breaking news
thyroid diseases
-
హషిమోటో థైరాయిడైటిస్ గురించి విన్నారా? ఎందువల్ల వస్తుందంటే..
థైరాయిడ్ సమస్య అనగానే హైపర్ థైరాయిడిజమ్, హైపో థైరాయిడిజమ్లు గుర్తుకొస్తాయి. హషిమోటో థైరాయిడైటిస్ అనేది హైపో థైరాయిడిజమ్లోని ఒక సమస్య. ఇది తమ సొంత వ్యాధి నిరోధక వ్యవస్థే తమపై ప్రతికూలంగా పని చేయడం వల్ల వచ్చే ఒక రకం ఆటో ఇమ్యూన్ డిసీజ్. అందుకే దీన్ని ‘ఆటోఇమ్యూన్ హైపో థైరాయిడిజమ్’ అని కూడా అంటారు. ఈ సమస్యపై అవగాహన కోసం ఈ కథనం. మన దేహంలో మెడ దగ్గర సీతాకోకచిలుక ఆకృతిలో ఓ కీలకమైన థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఇది దేహంలోని అనేక రకాల జీవక్రియలకు అవసరమైన థైరాక్సిన్ అనే హార్మోన్‌ను స్రవిస్తూ ఉంటుంది. తమ సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంథిపై వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ‘థైరాక్సిన్’ హార్మోన్ స్రావాలు తగ్గుతాయి. దాంతో అది హైపో థైరాయిడిజమ్‌కు దారితీస్తుంది. ఫలితంగా సరిపోయినంత థైరాక్సిన్ దొరకక దేహానికి అవసరమైన జీవక్రియలు జరగవు. ఈ హైపోథైరాయిడిజమ్లోని ఒకానొక కండిషన్ పేరే ‘హషిమోటో థైరాయిడైటిస్’. కారణాలు: ‘హషిమోటో థైరాయిడైటిస్’కు కారణాలు ఇంకా తెలియదు. కానీ కొన్ని జన్యుపరమైన కారణాలతో, అలాగే హార్మోన్ స్రావాల లోపాలతో ఇలా జరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. అదీగాక థైరాయిడ్ సమస్య వచ్చే మహిళల్లోని 20% మందిలో తర్వాత్తర్వాత ఈ సమస్య వచ్చే అవకాశాలూ ఎక్కువని కూడా తెలుసుకున్నారు. గతంలోనైతే ఆహారంలో అయోడిన్ లేని ఉప్పు కారణంగా ఈ సమస్య వచ్చేది. ఎందుకంటే థైరాయిడ్ బాగా పని చేయాలంటే అయోడిన్ అవసరం. పిండదశలోనే ఈ సమస్యతో మానసిక, శారీరక ఎదుగుదల లోపాలు కనిపిస్తాయి. దాన్ని ‘క్రెటినిజమ్’ అని అంటారు. అయితే ఇటీవల ఐయోడైజ్డ్ ఉప్పు లభ్యతతో... వ్యాధి రావడం తగ్గింది. కొన్ని రకాల రేడియేషన్లకు గురికావడమూ ఈ సమస్యకు దారితీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. కొంతమందిలో థైరాయిడ్‌లో గడ్డ లేదా క్యాన్సర్ కణితి రావడంతో, దాన్ని తొలగించడంతోనూ హైపోథైరాయిడిజమ్ రావచ్చు. అయితే... ‘హషిమోటో థైరాయిడైటిస్’లో థైరాయిడ్ గ్రంథి అలాగే ఉంటుందిగానీ... దాని పనితీరు తగ్గుతూపోతుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో దీని విస్తృతి ఎక్కువ. లక్షణాలు: దీని లక్షణాలు వేర్వేరు వయసువాళ్లలో వేర్వేరుగా కనిపిస్తాయి. స్థూలంగా ఈ కింద పేర్కొన్న విధంగా ఉంటాయి. మెడదగ్గర ఉండే థైరాయిడ్ గ్రంథిలో వాపు రావడంతో మెడ ముందుభాగం ఉబ్బినట్లుగా కనిపించడం ప్రధానమైన / కీలకమైన లక్షణం హైపోథైరాయిడిజమ్‌లో థైరాయిడ్ గ్రంథి పనితీరు లోపించినప్పుడు స్థూలకాయం సాధారణం. అందువల్ల ఈ సమస్య బాధితులు బాగా బరువు పెరుగుతుంటారు నీరసం, నిస్సత్తువ, తీవ్రమైన అలసట పాలిపోయినట్లుగా కాస్త ఉబ్బినట్లుగా కనిపించే ముఖం కండరాల, కీళ్ల నొప్పులు మలబద్ధకం మహిళల్లో గర్భధారణ సమస్యలు, సంతానలేమి, యువతుల్లో ఆలస్యంగా రజస్వల కావడం, అయ్యాక నెలసరి సక్రమంగా రాకపోవడం, రుతుసమయంలో రక్తం ఎక్కువగా పోవడం వంటి ఇబ్బందులు జుట్టు రాలిపోవడం, పలచబడటం గుండె స్పందనల వేగం తగ్గడం కుంగుబాటు (డిప్రెషన్)కు గురికావడం వంటి మానసిక సమస్యలు కనిపిస్తాయి పుట్టిన పిల్లల్లో పుట్టుకతోనే (కంజెనిటల్గా) హైపోథైరాయిడిజమ్ ఉంటే వాళ్ల మెదడు పెరుగుదల మందగిస్తుంది. పిల్లల దశలోనే వస్తే వాళ్ల ఎదుగుదల దెబ్బతింటుంది. స్కూల్ చదువుల్లో పర్ఫార్మెన్స్ తక్కువగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిర్ధారణ: టీ3, టీ4, టీఎస్‌హెచ్ పరీక్ష చేయించినప్పుడు టీ3, టీ4 మోతాదులు నార్మల్‌గా లేదా తక్కువగానే ఉన్నప్పటికీ టీఎస్‌హెచ్ మోతాదులు ఎక్కువగా ఉంటాయి. యాంటీ–టీపీవో యాంటీబాడీస్ పరీక్షలు చేసినప్పుడు టీఎస్‌హెచ్ మోతాదులతో పాటు యాంటీ–టీపీవో యాంటీబాడీస్, యాంటీ థైరోగ్లోబ్లు్యలిన్ యాంటీబాడీస్ పరీక్షల్లో వాటి మోతాదుల్లో పెరుగుదల కనిపిస్తే దాన్ని ‘హాషిమోటో థైరాయిడైటిస్ / ఆటోఇమ్యూన్ హైపోథైరాయిడిజమ్’గా నిర్ధారణ చేయవచ్చు. డా‘‘ శ్రీనివాస్ కందుల కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ (చదవండి: సున్నపు రాయి ఇంత ప్రమాదమా? అదే ఆ తల్లికి తీరని కడుపు కోత మిగిల్చింది!) -
ఈ లక్షణాలుంటే మీకు థైరాయిడ్ సమస్య ఉన్నట్లే..
-
గాయిటర్ సమస్యల్లో రకాలు... పరిష్కారాలు
మన శరీరంలో జరిగే అనేక జీవక్రియలకు గ్రంథుల నుంచి స్రవించే హార్మోన్లు అవసరం. అందులో థైరాయిడ్ గ్రంథి చాలా ముఖ్యమైనది. ఇది మెడ ముందు భాగంలో శ్వాసనాళానికి రెండువైపులా సీతాకోకచిలుక రెక్కల ఆకృతిలో ఉంటుంది. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రభావంతో థైరాయిడ్ గ్రంథి టీ3, టీ4 హార్మోన్లను వెలువరిస్తుంది. థైరాయిడ్ గ్రంథిలో అసాధారణ పెరుగుదలను గాయిటర్ అంటారు. ఇందులోనూ రెండు రకాలు ఉంటాయి.మొదటది డిఫ్యూస్ గాయిటర్, రెండోది నాడ్యులార్ గాయిటర్. థైరాయిడ్ గ్రంథి ఉబ్బిపోయి... ఇరువైపులా సమానంగా పెరగడాన్ని డిఫ్యూస్ గాయిటర్‌గా అంటారు. ఇక నాడ్యులార్ గాయిటర్‌లో థైరాయిడ్ గ్రంథికి ఒక భాగంలో ఒకటి లేదా మరిన్ని గడ్డలు ఏర్పడతాయి. ఇలా గడ్డల్లాంటివి పెరగడాన్ని నాడ్యులార్ గాయిటర్ అంటారు. గాయిటర్ సమస్య వచ్చిన కొందరిలో థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి సంబంధించి ఎలాంటి మార్పులూ ఉండవు. కానీ మరి కొందరిలో మాత్రం థైరాయిడ్ హార్మోన్ల స్రావంలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. అంటే... హార్మోన్స్రావాలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. హార్మోన్ల ఉత్పత్తి పెరిగితే ఆ కండిషన్‌ను హైపర్ థైరాయిడిజం అని, తగ్గితే హైపోథైరాయిడిజమ్ అని అంటారు. శరీరంలో అయోడిన్ లోపం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది. థైరాయిడ్‌కు సంబంధించిన సమస్యలు ఉన్నవారికి థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్షలైన టీ3, టీ4, టీఎస్‌హెచ్, యాంటీ థైరాయిడ్ యాంటీబాడీస్ వంటి పరీక్షలు చేసి, సమస్యను నిర్ధారణ చేస్తారు. ఫలితాలను బట్టి చికిత్స అవసరమవుతుంది. థైరాయిడ్ క్యాన్సర్ సమస్యను మినహాయించి... సాధారణంగా థెరాయిడ్ గ్రంథి వాపు (గాయిటర్) సమస్యను ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే నయం చేయవచ్చు. -
పడతులూ తెలుసుకోండి ఈ పధ్నాలుగు వ్యాధులను...
పురుషుడితో పోలిస్తే మహిళల్లో జరిగే అనేకానేక జీవక్రియలు అత్యంత సంక్లిష్టాలు. యుక్తవయసుకు వచ్చిన నాటి నుంచి యువకుల్లో ఒకటి రెండు హార్మోన్లు మాత్రం పనిచేస్తే చాలు. అదే యువతుల్లో అయితే వారి జీవక్రియలన్నీ సక్రమంగా జరగడానికి అనేక హార్మోన్లు అవసరం. మళ్లీ ఈ హార్మోన్లన్నింటి మధ్యా సమన్వయం కావాలి. అందుకే మహిళ తాలూకు ఆరోగ్య నిర్వహణ అత్యంత క్లిష్టంగా ఉంటుంది. ఈ కింద పేర్కొన్న అంశాల్లో కొన్ని మహిళలకు మాత్రమే వచ్చే అనారోగ్యాలతో పాటు... అందరిలోనూ కనిపించే ‘రక్తహీనత’,‘థైరాయిడ్ వ్యాధులు’ వంటివీ ఉన్నాయి. అయితే అవి పురుషుల్లో కంటే మహిళల్లోనే అత్యధికం. ఈ నెల 8వ తేదీ ‘మహిళా దినోత్సవ’సందర్భంగా మహిళల్లో అత్యధికంగా కనిపించే 14 ప్రధాన ఆరోగ్య సమస్యలు, వాటి నివారణలు, చికిత్సలు సంక్షిప్తంగా... 1- పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఏమిటీ సమస్య: మహిళలకు ఓవరీలో నీటితిత్తులు ఎక్కువగా వస్తుంటాయి. మహిళల్లో అత్యధికంగా వచ్చే ఈ సమస్యను ‘పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్’ అంటారు. ఈ సమస్య మహిళల్లో అనేక అవరోధాలను కల్పిస్తుంది. రుతుక్రమం సక్రమంగా రాకపోవడం గర్భధారణలో ఆటంకాలు హార్మోన్ల అసమతౌల్యత గుండె, రక్తనాళాల సమస్యలు. ఎందుకు వస్తుంది: పురుష హార్మోన్ అయిన ఆండ్రోజన్ పాళ్లు మహిళల్లో పెరిగినప్పుడు ఈ సమస్య వస్తుంది. దీనికి జన్యుపరమైన అంశాలే కారణమని భావిస్తున్నారు. దుష్పరిణామాలు: ముఖంపై అత్యధికంగా మొటిమలు రావడం చుండ్రు అవాంఛిత రోమాలు కొందరిలో పురుషుల్లో లాగా బట్టతల స్థూలకాయం అండం విడుదలలో సమస్యలు నెలసరి సరైన సమయంలో రాకపోవడం ఎదుర్కొనేది ఎలా: జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు... అంటే వేళకు తినడం, నిద్రపోవడం, ఆహారంలో కృత్రిమ ప్రాసెస్డ్ ఫుడ్ - చక్కెరపాళ్లను తగ్గించుకోవడం, పొట్టుతో ఉండే ఆహారం, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తినడం వంటివి. దీనికి నిర్దిష్టమైన చికిత్స లేదు. అయితే దీనివల్ల వచ్చే సమస్యలను అధిగమించడానికి చికిత్స చేయించుకోవాలి. కొందరిలో అవసరాన్ని బట్టి అండం విడుదల కావడానికి, చక్కెర తగ్గడానికి మందులు వాడాల్సి రావచ్చు. మామూలుగా తగ్గకపోతే ‘ఒవేరియన్ డ్రిల్లింగ్’ అనే శస్త్రచికిత్స ప్రక్రియను అనుసరించాల్సి రావచ్చు. 2- మొటిమలుబ (ఆక్నే) ఏమిటీ సమస్య: ఈ సమస్య యువతీ యువకులు ఇద్దరిలోనూ కనిపించినా యువతుల్లోనే ఎక్కువ. అలాగే మరిన్ని కారణాలు (హార్మోన్ల అసమతౌల్యత వంటివి) కూడా మహిళల్లో ఈ సమస్యకు దోహదం చేస్తాయి. పైగా అందంగా కనిపించే అంశంలోనూ ఇవి మహిళలను ఒకింత ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తాయి. ఎందుకు వస్తుంది: హార్మోన్ల అసమతౌల్యత మహిళల్లో పురుష హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ పాళ్లు పెరగడం పీసీఓఎస్ దుష్పరిణామాలు: ముఖంపై గుంటలు పడడం గొంతు భారీగా (మగ గొంతుకలా) మారడం కండరాలు మృదుత్వాన్ని కోల్పోయి మగవారిలా దృఢంగా/గరుకుగా మారడం, రొమ్ముల పరిమాణం తగ్గడం. ఎదుర్కొనేది ఎలా: ముఖాన్ని గాఢత తక్కువైన (మైల్డ్) సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ముఖంపై జిడ్డుగా ఉండేలా మేకప్ వేసుకోకూడదు. రోజుకు రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ముఖాన్ని స్క్రబ్‌తో రుద్దుకోకూడదు. వెంట్రుకలు జిడ్డుగా ఉండేవారు ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేయాలి. ముఖం కప్పేలా కాకుండా, కాస్త నుదురు కనపడేలా జుట్టును దువ్వుకోవాలి. మొటిమలను గిల్లడం, నొక్కడం చేయకూడదు. జిడ్డుగా ఉండే కాస్మటిక్స్ వేసుకోకూడదు. కాస్మటిక్స్ వాడాలనుకుంటే ‘నాన్-కొమిడోజెనిక్’ తరహావి మాత్రమే వాడాలి. అప్పటికీ తగ్గకపోతే మొటిమలను నివారించే మందులను డాక్టర్ సలహా మేరకే వాడాలి. మందుల షాపుల్లో అమ్మే మొటిమలను తగ్గించే మందుల్ని ఎవరంతట వారే వాడకూడదు. ఎందుకంటే అందులో బెంజోయిల్ పెరాక్సైడ్ / సల్ఫర్ / రిజార్సినాల్ / శాల్సిలిక్ ఆసిడ్ అనే రసాయనాలు ఉండవచ్చు. అవి బ్యాక్టీరియాను చంపి, ముఖాన్ని తేమగా ఉంచే నూనెగ్రంథులను నాశనం చేయవచ్చు, పైపొరను దెబ్బతీయవచ్చు. ముఖం ఎర్రబారవచ్చు. మొటిమలు వచ్చేవారు ముఖానికి కాస్త లేత ఎండ తగిలేలా జాగ్రత్త తీసుకుంటే ఆ చిన్న జాగ్రత్తే చాలావరకు అవి రాకుండా నివారిస్తుంది. 3- రక్తహీనత (అనీమియా) ఏమిటీ సమస్య: ఇది అందరిలో కనిపించే సమస్యే అయినా భారతీయ మహిళల్లో మరీ ఎక్కువ. రక్తంలో తగినన్ని ఎర్రరక్తకణాలు (ఆర్బీసీ) లేకపోవడాన్ని రక్తహీనత (అనీమియా) అంటారు. ఈ ఎర్రరక్తకణాలే మన శరీరంలోని అన్ని అవయవాలకూ రక్తాన్ని మోసుకుని వెళుతుంటాయి. వాటి సంఖ్య తగ్గడం ప్రమాదకరంగా పరిణమిస్తుంది. రక్తహీనతల్లోనూ ఐరన్‌లోపం వల్ల కలిగేది చాలా సాధారణమైనది. ఎందుకు వస్తుంది: మహిళల్లో రుతుస్రావం వల్ల ప్రతి నెలా రక్తం పోతుంది కాబట్టి అది రక్తహీనతకు దారితీయడం చాలా సాధారణం. కొందరిలో ఎర్రరక్తకణాల తయారీ ప్రక్రియ దెబ్బతింటుంది. కొత్త ఎర్రరక్తకణాలు తయారయ్యే లోపే కొందరిలో పాతవి వేగంగా చనిపోవడం వల్ల కూడా రక్తహీనత వస్తుంది. ఇక మహిళల్లో రుతుస్రావంతో పాటు బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అతిగా రక్తం పోవడం, యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ ఉండటం కూడా రక్తహీనతకు కారణం. లక్షణాలు: వేగంగా అలసట కొద్దిపాటి నడకకే ఆయాసం తలనొప్పి కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు, అవి చల్లగా మారడం పాలిపోయినట్లుగా ఉండడం ఛాతీనొప్పి త్వరగా భావోద్వేగాలకు గురికావడం చిరాకు/కోపం స్కూలుకెళ్లే వయసు వారు అక్కడ తగిన సామర్థ్యం చూపలేకపోవడం. ఎదుర్కొనేది ఎలా: ఐరన్ పుష్కలంగా లభించే ఆహారమైన ఆకుపచ్చటి ఆకుకూరలు, నువ్వులు, ఖర్జూరం, కొబ్బరి, పప్పుచెక్కలు (చిక్కీ)తో పాటు మాంసాహారులైతే గుడ్లు, కాలేయం, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. ఏదైనా తిన్న వెంటనే కాఫీ, టీ తాగితే, అవి జీర్ణమైన ఆహారాన్ని రక్తంలోకి ఇంకకుండా చేస్తాయి. కాబట్టి, తినగానే వాటిని తీసుకోవద్దు. డాక్టర్ సలహా మీద ఐరన్ ట్యాబ్లెట్లు వాడాలి. మరీ రక్తహీనత ఎక్కువగా ఉంటే అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించాలి. 4- రొమ్ము క్యాన్సర్ ఏమిటీ సమస్య: మహిళల్లో అత్యధికంగా కనిపించే మరో రుగ్మత రొమ్ము క్యాన్సర్. రొమ్ము కణజాలాల్లో క్యాన్సర్ కణాలు అపరిమితంగా పెరిగిపోవడమే రొమ్ము క్యాన్సర్. ఈ క్యాన్సర్ కణాలు ఒక గడ్డ (ట్యూమర్)లా కనిపించవచ్చు. అవి దగ్గర్లోని ఇతర కణజాలాలకు పాకి, పక్కనే ఉన్న లింఫ్నోడ్స్కు వ్యాపించి శరీరమంతా విస్తరించనూ వచ్చు. రొమ్ము క్యాన్సర్‌లో ప్రధానంగా ఈ కింది రకాలు ఉంటాయి. అవి... డక్టల్ కార్సినోమా: రొమ్ము క్యాన్సర్ వచ్చిన ప్రతి పదిమందిలో ఎనిమిది మంది సమస్య ఈ తరహాకు చెందినదే. లోబ్యులార్ కార్సినోమా: ప్రతి పదిమందిలో కేవలం ఒకరికే ఈ తరహా క్యాన్సర్ కనిపిస్తుంది. లక్షణాలు: లక్షణాలు కనిపించకముందే ఆమెలో క్యాన్సర్ ఉందని తెలుసుకునే అవకాశం ఉంది. ఎలాగంటే... రొమ్ములో లేదా బాహుమూలాల కింద గట్టిగా ఉన్న కండ... గడ్డలా చేతికి తగులుతుండటం రొమ్ము ఆకృతిలో, పరిమాణంలో మార్పురావడం చనుమొన నుంచి స్రావాలు రావడం (ఇవి పాలు కావు) చనుమొన ఆకృతిలో మార్పురావడం... అంటే అది లోపలికి కుంచించుకుపోయినట్లుగా మారడం రొమ్ము చర్మంలో మార్పులు... అంటే చనుమొన, దాని చుట్టూ ఉన్న ప్రాంతంలోనూ, రొమ్ము మీద దురద రావడం, ఎర్రబారినట్లుగా కనిపించడం, పొలుసులు ఊడినట్లుగా అవుతుండటం, సొట్టపడినట్లుగా ఉండటం. ఎదుర్కొనేది ఎలా: రొమ్ముక్యాన్సర్ చికిత్సలో ఒకటి కంటే ఎక్కువ ప్రక్రియలను అనుసరించాల్సి రావచ్చు. ఎన్ని, ఎలాంటి ప్రక్రియలు అనుసరించాలి అన్న అంశం... క్యాన్సర్ ఏ దశలో ఉందన్న విషయంతో పాటు... ట్యూమర్ పరిమాణం ఎంత, అది ఏ రకమైన క్యాన్సర్, అది వచ్చిన మహిళ మెనోపాజ్ దశకు చేరిందా లేదా, ఆమె సాధారణ ఆరోగ్యపరిస్థితి... వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, హార్మోన్ థెరపీ, నిర్ణీతంగా క్యాన్సర్ కణాలను మాత్రమే నిర్మూలించే టార్గెట్ థెరపీ వంటి ప్రక్రియలతో చికిత్స చేస్తారు. 5- ఎండో మెట్రియాసిస్ ఏమిటీ సమస్య: ఎండోమెట్రియాసిస్ అనే ఈ జబ్బు కేవలం మహిళలు, యువతుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. అది కూడా వారిలో రుతుస్రావం మొదలై... అది కొనసాగుతున్న సమయంలోనూ వస్తుంది. ఇందులో గర్భసంచీలో ఉండే లోపలిపొర (ఎండోమెట్రియమ్) కేవలం లోపలికే పరిమితం కాకుండా అన్ని అంతర్గత అవయవాల్లోకి పెరుగుతుంది. ఫలితంగా అది అండాలను, ఫెలోపియన్ ట్యూబ్స్‌ను, పొత్తికడుపులో ఉండే ఇతర అవయవాలను ప్రభావితం చేస్తుంది. లక్షణాలు: కొందరిలో ఎండోమెట్రియమ్ పొర బయటకు తక్కువగా పెరిగినా పొత్తికడుపు కింది భాగంలో లేదా నడుములో నొప్పి ఉండవచ్చు. కొందరిలో అది ఎంతగా బయటకు పెరిగినా వారిలో ఎలాంటి నొప్పీ ఉండకపోవచ్చు. అయితే సాధారణంగా కనిపించే లక్షణాలు ఏమిటంటే... రుతుస్రావ సమయంలో తీవ్రమైన నొప్పి నడుము, పొత్తికడుపులో నొప్పి సెక్స్‌లో విపరీతమైన బాధ మలవిసర్జన / మూత్రవిసర్జన బాధాకరంగా ఉండటం రుతుస్రావం సమయంలోనే గాక... ఇతర సమయాల్లోనూ చుక్కలు చుక్కలుగా రక్తస్రావం తీవ్రమైన అలసట గర్భధారణ జరగకపోవడం (ఇన్ఫెర్టిలిటీ) నీళ్లవిరేచనాలు / మలబద్ధకం / కింది నుంచి గ్యాస్ పోవడం / వికారం (రుతుస్రావ వేళ ఈ వికారం ఎక్కువ). ఎదుర్కొనేది ఎలా: దీనికి చికిత్స దశల వారీగా జరుగుతుంది. ఉదాహరణకు ఒక దశ చికిత్సకు సరైన స్పందన లభించకపోతే ఆ తర్వాతి దశకు వెళ్లాల్సి ఉంటుంది. మొదటి దశలో: నాన్‌స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ నొప్పి నివారణ మందులతో రెండో దశలో: కనీసం మూడు నెలల పాటు గర్భనిరోధక మాత్రలతో మూడో దశలో: ఎండోమెట్రియమ్ పొర పెరుగుదలను అరికట్టే జీఎన్ఆర్హెచ్-అగొనిస్ట్ అనే మందుతో నాలుగో దశలో: ల్యాపరోస్కోపిక్ శస్త్రచికిత్స ద్వారా పొత్తి కడుపు భాగంలో చిన్న గాటు పెట్టి, ఎండోమెట్రియమ్ పొరను చూస్తూ... కనిపించిన మేరకు తొలగిస్తారు. 6- మూత్రంలో ఇన్ఫెక్షన్ ఏమిటీ సమస్య: మూత్రంలో ఇన్ఫెక్షన్స్ అన్నవి పురుషుల్లోనూ కనిపించినా... మహిళల్లో చాలా ఎక్కువ. మూత్రంలో ఇన్ఫెక్షన్కు చికిత్స చేయించకపోతే అది మూత్రాశయానికీ, మూత్రపిండాలకూ హాని కలిగించవచ్చు. ఒక్కోసారి ఈ ఇన్ఫెక్షన్ రక్తంలోకి పాకి అన్ని అవయవాలకూ వ్యాపించి, ప్రమాదకరంగానూ పరిణమించవచ్చు. ఎందుకు వస్తుంది: బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సిస్టైటిస్ (బ్లాడర్ ఇన్ఫెక్షన్) పైలోనెఫ్రైటిస్ (కిడ్నీ ఇన్ఫెక్షన్) యురెథ్రైటిస్ (మూత్రాశయం నుంచి మూత్రద్వారం వరకు ఉండే మూత్రనాళంలో మంట, ఇన్ఫెక్షన్). లక్షణాలు: మూత్రవిసర్జన సమయంలో నొప్పి, మంట పొత్తికడుపులో, నడుములో, నడుము పక్కభాగాల్లో నొప్పి చలి, వణుకు జ్వరం చెమటలు పట్టడం వికారం / వాంతులు మాటిమాటికీ మూత్రం వస్తున్నట్లు అనిపించడం మూత్రంపై నియంత్రణ కోల్పోయి ఒక్కోసారి చుక్కలు చుక్కలుగా పడటం మూత్రం నుంచి ఘాటైన వాసన విసర్జించే మూత్రం పరిమాణంలో మార్పులు (ఎక్కువ లేదా తక్కువ) మూత్రంలో రక్తం, చీము పడటం సెక్స్‌లో మంట, నొప్పి ఎదుర్కొనేది ఎలా: వ్యాధి నిర్ధారణ తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గడానికి తగిన మందులు వాడతారు. ఒకవేళ మాటిమాటికీ మూత్రంలో ఇన్ఫెక్షన్ వస్తుంటే మూత్రపిండాలను, గర్భసంచి (యుటెరస్)ను, మూత్రాశయాన్ని ఎక్స్-రే తీసి పరీక్షించే ఇంట్రావీనస్ పైలోగ్రామ్ (ఐవీపీ) అనే ప్రత్యేకమైన పరీక్షలనూ, అవసరాన్ని బట్టి పూర్తి మూత్ర విసర్జక వ్యవస్థను పరిశీలించడానికి అల్ట్రాసౌండ్ స్కాన్‌ను, ఒక టెలిస్కోప్ వంటి సాధనంతో బ్లాడర్ లోపల పరీక్ష చేయాల్సి వచ్చే ‘సిస్టోస్కోపీ’ వంటి పరీక్షలు చేయాల్సి రావచ్చు. ఇది సాధారణ యాంటీ బయాటిక్స్తోనే ఇది తగ్గుతుంది. పరిస్థితి ముదిరితేనే కనిపించే లక్షణాలను బట్టి ఇతర చికిత్సలు అవసరమవుతాయి. 7- థైరాయిడ్ సమస్య ఏమిటీ సమస్య: మానవ దేహంలో సరిగ్గా మెడ భాగంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఇది ప్రథానంగా థైరాక్సిన్ (టీ4) అనీ, ట్రై అయడో థైరమిన్ (టీ3) అనే హార్మోన్లను స్రవిస్తుంటుంది. ఈ రెండూ శరీరంలోని అనేక జీవక్రియలను నియంత్రిస్తుంటాయి. ఈ హార్మోన్లను స్రవించే ఈ గ్రంథి అతిగా పనిచేసినా, లేదా పనిచేయకపోయినా సమస్యలు వస్తుంటాయి. థైరాయిడ్ సమస్యలను ప్రధానంగా ఇలా విభజించవచ్చు. హైపర్ థైరాయిడిజం (థైరాయిడ్ అతిగా పనిచేయడం) హైపో థైరాయిడిజం (థైరాయిడ్ పనిచేయకపోవడం) హైపర్ థైరాయిడిజం: హైపర్ థైరాయిడిజం కండిషన్లో థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేసి థైరాక్సిన్ హార్మోన్‌ను ఎక్కువగా స్రవిస్తుంటుంది. హైపర్ థైరాయిడిజం లక్షణాలు: ఎంత తిన్నా సన్నగానే ఉండటం, బరువు పెరగకపోగా... తగ్గడం. గాయిటర్ (మెడ దగ్గర ఉండే థైరాయిడ్ ఉబ్బినట్లుగా ఉండటం. దాంతో మెడ దగ్గర ఉబ్బి కనిపిస్తుంటుంది). కళ్లు ఉబ్బినట్లుగా ఉంటాయి. దురదలు పెట్టడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉద్వేగంగా ఉండటం, త్వరగా కోపం రావడం నిద్రపోవడంలో ఇబ్బందులు, ఎప్పుడూ అలసటగా ఉండటం గుండె వేగం పెరగడం, గుండె స్పందనల్లో క్రమబద్ధత లేకపోవడం, వేళ్లు వణుకుతూ ఉండటం చెమటలను ఎక్కువగా పట్టడం, కొద్దిపాటి వేడిమిని కూడా భరించలేకపోవడం కండరాలు బలహీనంగా మారడం త్వరగా మలవిసర్జన ఫీలింగ్స్ కలగడం. హైపర్ థైరాయిడిజం లక్షణాలు ఉన్నప్పుడు విధిగా పరీక్షలు చేయిచుకుని, ఆ రుగ్మత ఉన్నట్లు తేలితే తప్పనిసరిగా మందులు తీసుకోవాలి. లేకపోతే అది ఒక్కోసారి గుండె పనిచేయకపోవడానికి (హార్ట్‌ఫెయిల్యూర్)కు దారితీయవచ్చు. లేదా ఎముకలు పెళుసుగా మారిపోవడం (ఆస్టియోపోరోసిస్) జరగవచ్చు. ఒక్కోసారి ప్రాణాపాయకరమైన థైరాయిడ్ స్టార్మ్ కండిషన్కూ దారితీయవచ్చు. నిర్ధారణ పరీక్ష : రక్తంలో థైరాయిడ్ హార్మోన్ల మోతాదులను పరీక్షించడం ద్వారా హైపర్ థైరాయిడ్ కండిషన్‌ను నిర్ధారణ చేస్తారు. థైరాక్సిన్ హార్మోన్ (ప్రధానంగా టీ4 హార్మోన్) మోతాదులు పెరిగి ఉండటం ద్వారా దీన్ని గుర్తించవచ్చు. ఎదుర్కొనేది ఎలా: యాంటీ థైరాయిడ్ మందులు ఇవ్వడం రేడియో యాక్టివ్ అయొడిన్ ద్వారా చికిత్స శస్త్రచికిత్స బీటా బ్లాకర్స్ ఉపయోగించడం హైపో థైరాయిడిజం: థైరాయిడ్ గ్రంథి పనిచేయకపోవడం, లేదంటే చాలా తక్కువగా పనిచేయడాన్ని ‘హైపో థైరాయిడిజం’ అంటారు. లక్షణాలు: తీవ్రమైన అలసట / మందకొడిగా ఉండటం మానసిక వ్యాకులత (మెంటల్ డిప్రెషన్) చల్లగా అనిపించడం బరువు పెరగడం (రెండు నుంచి నాలుగు కిలోల వరకు) చర్మం పొడిగా మారడం, మలబద్ధకం మహిళల్లో రుతుక్రమం సక్రమంగా రాకపోవడం గర్భిణుల్లో మరింత జాగ్రత్త: గర్భిణుల విషయంలో థైరాక్సిన్ పాళ్లు తగ్గుతున్నాయేమో జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ పరీక్షలు చాలా అవసరం. నిర్ధారణ పరీక్షలు : రక్త పరీక్ష ద్వారా థైరాయిడ్ గ్రంథి స్రవించే టీ4 హార్మోన్ పాళ్లు సాధారణంగా ఉన్నాయా లేదా అని పరీక్షిస్తారు. టీఎస్‌హెచ్ పాళ్లలోనూ మార్పులు రావచ్చు. ఎదుర్కొనేది ఎలా: లెవో థైరాక్సిన్ సోడియమ్ వంటి మందుల ద్వారా దీనికి చికిత్స అందిస్తారు. 8- ఆస్టియో పోరోసిస్ ఏమిటీ సమస్య: భారతీయుల్లో చాలా ఎక్కువ. అందులోనూ మహిళల్లో! మెనోపాజ్ దాటాక కనీసం 40% మందిలో కనిపిస్తుంది. ఎందుకు వస్తుంది: మన అందరిలోనూ 20 ఏళ్లు వచ్చే వరకు ఎముకలు పెరుగుతుంటాయి. బాల్యం, కౌమారంలో ఉండే ఈ ఎముకల పెరుగుదల యౌవనం తర్వాత ఆగిపోయాక కూడా దాదాపు 40 ఏళ్లు వచ్చేవరకు బలంగా, గట్టిగా ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా పలచబడుతూ, పెళుసుగా మారుతూ ఉంటాయి. మహిళల ఓవరీల నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్- ఈస్ట్రోజెన్ తగ్గడం వల్ల రుతుక్రమం ఆగిన మహిళల్లో ఇది మరీ ఎక్కువ. (ఎముకలను బలంగా ఉంచడానికి ఈస్ట్రోజెన్ దోహదపడుతుంది). రుతుక్రమం ఆగిపోయాక ఈస్ట్రోజెన్ ఉత్పత్తి కూడా తగ్గిపోవడంతో ఈ పరిణామం మహిళల్లో ఎక్కువగా ప్రభావం చూపుతుంది. పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువగా కనిపించడానికి కారణం ఇదే. లక్షణాలు: ఇది వస్తుంది అని తెలుసుకోడానికి అవసరమైన లక్షణాలు ముందే కనిపించేందుకు అవకాశం లేదు. కారణం... ఎముకలు శరీరంలో లోపల ఉంటాయి కాబట్టి అవి పలచబడడం, పెళుసుగా మారడాన్ని గమనించడం సాధ్యం కాదు. అందుకే ఇది నిశ్శబ్దంగా వచ్చే పరిణామం. ఇలా ఎముకలు పలచబారడం దీర్ఘకాలం జరుగుతూ పోతే చిన్న గాయాలకే ఎముకలు విరగడం కనిపిస్తుంది. అంటే... ఏదైనా చిన్నపాటి ప్రమాదానికే ఎముక పుటుక్కున విరిగిపోతుంటే దాన్ని ‘ఆస్టియో పోరోసిస్’గా గుర్తించవచ్చు. దీనికి సంబంధించి మరికొన్ని లక్షణాలు ఏమిటంటే... ఒళ్లు నొప్పులు ఎముకలు, కీళ్ల నొప్పులు అలసట చిన్న ప్రమాదానికే ఎముక విరగడం విపరీతమైన వెన్ను నొప్పి, కాస్తంత వెన్ను ఒంగినట్లయి శరీరం ఎత్తు తగ్గడం ఆస్టియోపోరోసిస్ - నిర్ధారణ: రక్తపరీక్ష, ఎక్స్-రే, బీఎమ్‌డీ (బోన్ మాస్ డెన్సిటీ - అంటే ఎముక సాంద్రత నిర్ధారణ చేసే పరీక్షల ద్వారా రోగిలో దీన్ని నిర్ధరించవచ్చు.) ఎదుర్కొనేది ఎలా: ప్రాథమిక నివారణ చర్యలు ఆస్టియోపోరోసిస్ కండిషన్‌ను ఆలస్యం చేస్తాయి. ఫలితంగా రిస్క్ తగ్గుతుంది. దాంతోపాటు... క్యాల్షియమ్, విటమిన్ ‘డి’ ఇవ్వడం - డాక్టర్లు ప్రాథమిక చికిత్సగా క్యాల్షియమ్, విటమిన్ ‘డి’ ఇస్తారు. అంటే... 60 ఏళ్లు దాటిన వారికి ప్రతిరోజూ 1500 ఎంజీ క్యాల్షియమ్నూ, విటమిన్-డిని రోజూ 10 నుంచి 15 మిల్లీ గ్రాములు ఇస్తారు. డిస్ఫాస్ఫోనేట్స్ - ఇవి ఒక రకం మందులు. వీటినే డిస్ఫాస్ఫోనేట్స్ అని కూడా అంటారు. ఎముక తనలోని పదార్థాన్ని కోల్పోయే ప్రక్రియను ఇవి ఆలస్యం చేస్తాయి. ఫలితంగా ఎముక సాంద్రత తగ్గే వేగం మందగిస్తుంది. దానివల్ల ఎముక మరింత కాలం దృఢంగా ఉంటుంది. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ) - రుతుక్రమం ఆగిన మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను తిరిగి భర్తీ చేసే ఈ చికిత్స ప్రక్రియను కూడా అవసరాన్ని బట్టి డాక్టర్లు చేస్తుంటారు. అయితే ఈ హెచ్ఆర్టీ వల్ల కొన్ని దుష్ర్పభావాలు కూడా కనిపిస్తాయి. అంటే... రొమ్ముల సలపరం, మళ్లీ రుతుస్రావం మొదలుకావడం, బరువు పెరగడం, మూడ్స్ మాటిమాటికీ మారిపోవడం, పార్శ్వపు తలనొప్పి రావడం వంటివన్నమాట. కాబట్టి రోగి కండిషన్‌ను బట్టి హెచ్ఆర్టీ అవసరమా, కాదా అన్నది డాక్టర్లే నిర్ధరిస్తారు. క్యాల్సిటోనిన్ - ఈ మందులను డాక్టర్ల సలహా మేరకే తీసుకోవాల్సి ఉంటుంది. టెరీపారటైడ్ - ఇది ఆస్టియో పోరోసిస్ చికిత్స ప్రక్రియలో సరికొత్త మందు. 9- ప్రీ-మెన్స్ట్రువల్ సిండ్రోమ్ ఏమిటీ సమస్య: ఇది మహిళల్లో రుతుస్రావం ముందర కనిపించే ఆరోగ్యసమస్య. ఎందుకు వస్తుంది: ఈ సమస్యకు కారణాలు నిర్దిష్టంగా తెలియదు. అయితే అనేక అంశాలు దీరికి దోహదపడతాయి. ఉదాహరణకు ప్రతి నెలా రుతుస్రావం వచ్చేందుకు ఉపయోగపడే అనేక హార్మోన్లలో మార్పులు మిగతావారి కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ‘పీఎమ్ఎస్’ కనిపించవచ్చు. కొందరిలో మెదడు రసాయనాల్లోని మార్పులూ ఇందుకు దోహదం చేస్తాయి. ఒత్తిడి, ఉద్వేగ భరితమైన సమస్యలూ (డిప్రెషన్) పీఎమ్ఎస్కు కారణాలే. లక్షణాలు: మొటిమలు రావడం రొమ్ము వాపు లేదా ముట్టుకుంటే మంటగా మారడం (టెండర్నెస్) అలసట నిద్రపోవడంలో ఇబ్బంది కడుపులో ఇబ్బంది / కింది నుంచి గ్యాస్పోవడం / మలబద్ధకం లేదా నీళ్ల విరేచనాలు తలనొప్పి వెన్నునొప్పి కీళ్లనొప్పులు కండరాల నొప్పులు టెన్షన్ / త్వరగా కోపం రావడం / వేగంగా భావోద్వేగాలకు గురికావడం / మూడ్స్ త్వరత్వరగా మారిపోవడం / తరచూ వెక్కివెక్కి ఏడ్వటం యాంగ్జైటీ లేదా డిప్రెషన్ ఎదుర్కొనేది ఎలా: దీనికి చికిత్స మూడు మార్గాల్లో జరుగుతుంది. మొదటిది జీవనశైలిలో మార్పులు: ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అంటే... ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోవడం తాజాపండ్లు తినడం ఉప్పు, తీపి, కెఫిన్ ఉండే పదార్థాలకు దూరంగా ఉండటం (ప్రధానంగా పీఎమ్ఎస్ ఉన్నప్పుడు) ప్రతిరోజూ కనీసం ఎనిమిది గంటలు తగ్గకుండా నిద్రపోవడం యోగా, రిలాక్సేషన్ టెక్నిక్స్ వంటివి చేయడం. రెండోది మందులు తీసుకోవడం: ఇలాంటి సమయాల్లో నొప్పులు తగ్గడానికి వీలుగా ఇబూప్రొఫెన్, కీటోప్రొఫెన్, న్యాప్రోగ్రెన్, ఆస్పిరిన్ వంటి మందులు తీసుకోవడం. మూడోది అల్టర్నేటివ్ థెరపీ: పీఎమ్ఎస్ ఉన్నవారు అదనంగా కొన్ని విటమిన్లు, మినరల్ సప్లిమెంట్లు తీసుకోవాలి. 10- యూరినరీ ఇన్‌కాంటినెన్స్ ఏమిటీ సమస్య: మూత్రం వస్తున్నప్పుడు దానిని ఏ మాత్రం నియంత్రించలేక టాయ్‌లెట్‌కు వెళ్లాల్సి వచ్చే పరిస్థితిని ‘యూరినరీ /అర్జ్ ఇన్‌కాంటినెన్స్’ అంటారు. టాయ్‌లెట్‌కు చేరేలోపే మూత్రం చుక్కలు చుక్కలుగా పడుతుంది. పరిస్థితి మరింత దిగజారేదెప్పుడు: ఈ సమస్య ఉన్న మహిళలు కెఫిన్ ఎక్కువగా తీసుకున్నా (కాఫీలు ఎక్కువసార్లు తాగినా), టీలు, కోలా డ్రింకులు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నా, తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నా... పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. కొందరు మహిళల్లో రుతుస్రావం ఆగిపోయాక (మెనోపాజ్ తర్వాత) అది ఇంకా పెరుగుతుంది. మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడంతో యోని లోపలి పొరలు కుంచించుకుపోవడం (వెజైనల్ అట్రోఫీ) వల్ల ఈ స్థితి వస్తుందని భావన. ఎదుర్కొనేది ఎలా: అర్జ్ ఇన్‌కాంటినెన్స్‌ను అధిగమించడానికి కొన్ని సాధారణ జీవనశైలి మార్గాలు ప్రభావపూర్వకంగా పనిచేస్తాయి. అవి... త్వరగా టాయిలెట్‌కు వెళ్లడం కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలను తగ్గించడం తగినంతగా ద్రవాహారం తీసుకోవడం ఒకవేళ స్థూలకాయులైతే బరువు తగ్గించుకోవడం. మూత్రవిసర్జనపై నియంత్రణకు శిక్షణ: దీన్నే బ్లాడర్ ట్రైనింగ్ లేదా బ్లాడర్ డ్రిల్ అంటారు. అర్జ్ ఇన్‌కాంటినెన్స్ ఉన్నప్పుడు టాయిలెట్లోకి వెళ్లాక అక్కడ మూత్రవిసర్జన ఫీలింగ్‌ను నియంత్రించుకుంటూ క్రమంగా ఆ వ్యవధిని పెంచుకుంటూ పోవాలి. ఫలితంగా చుక్కలు చుక్కలుగా రాలడం అన్నది క్రమంగా తగ్గుతుంది. ఇలా క్రమంగా బ్లాడర్‌పై నియంత్రణ సాధించవచ్చు. మందులు: ఒకవేళ బ్లాడర్ ట్రైనింగ్/బ్లాడర్ డ్రిల్‌తో ఫలితం లేకపోతే అప్పుడు యాంటీ మస్కారినిక్స్ / యాంటీకొలినెర్జిక్ అనే మందులను ఇస్తారు. ఇక బ్లాడర్, యుటెరస్, మలద్వారం కండరాలు బలం పుంజుకునేలా చేసే కొన్ని రకాల వ్యాయామాలు (పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్లు)తోనూ మంచి ఫలితం ఉంటుంది. ఇవీ విఫలమైతే కొన్ని శస్త్రచికిత్సల ద్వారా సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. 11- ఫైబ్రాయిడ్స్ గర్భసంచిలో గడ్డలు ఏమిటీ సమస్య: గర్భసంచీలో పెరిగే హానికరం కాని గడ్డలను ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి క్యాన్సర్‌గా మారవు. వీటినే యుటెరైన్ మయోమాస్, ఫైబ్రోమయోమాస్ లేదా లియోమయోమాస్ అంటారు. ఎలాంటి చికిత్సా తీసుకోకపోయినా క్రమంగా తగ్గిపోతాయి. గర్భసంచీలో అవి వచ్చే ప్రాంతాన్ని బట్టి వాటిని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్, సబ్సిరోస్ ఫైబ్రాయిడ్స్, సబ్‌మ్యూకస్ ఫైబ్రాయిడ్స్, పెడంక్యులేటెడ్ ఫైబ్రాయిడ్స్ అని పిలుస్తారు. ఎందుకు వస్తుంది: ఇవి పెరగడానికి నిర్దిష్ట కారణం తెలియకపోయినా... అదనపు కండ పెరగడం వల్ల ఇవి వస్తాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ పాళ్లు పెరిగినప్పుడు ఆ హార్మోన్ వల్ల వీటి పెరుగుదలకూ ప్రేరణ లభిస్తుంది. ఈస్ట్రోజెన్ సరఫరా తగ్గితే ఇవి కూడా కుంచించుకుపోతాయి. లక్షణాలు: ఫైబ్రాయిడ్స్ ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరికి మాత్రమే వీటి వల్ల కనిపించే లక్షణాలు బయటపడతాయి. కొందరికి ఇవి ఉన్నప్పటికీ వాటి ఉనికే తెలియదు. అందుకే వేరే సమస్య కోసం పరీక్షలు చేస్తుంటే కొందరిలో ఇవి ఉన్నట్లుగా తెలుస్తుంది. సాధారణంగా కనిపించే లక్షణాలు... రుతుస్రావం సమయంలో తీవ్రమైన రక్తస్రావం, నొప్పి సెక్స్ సమయంలో నొప్పి గర్భస్రావం లేదా గర్భధారణ జరగకపోవడం గర్భవతిగా ఉన్న సమయంలో సమస్యలు. పరీక్షలు: యోనిని పరీక్షించినప్పుడు డాక్టర్‌కు ఈ ఫైబ్రాయిడ్స్ చేతికి తగలవచ్చు. మరికొందరిలో అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో ఇవి ఉన్నట్లు తెలియవచ్చు. ఎదుర్కొనేది ఎలా: ట్రానెగ్జామిక్ యాసిడ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు, కొన్ని గర్భనిరోధక మాత్రలు, లెవో నార్జెస్ట్రల్ ఇంట్రాయుటెరైన్ విధానలతో దీనికి చికిత్స చేయవచ్చు. ఇక చికిత్సతో తగ్గనప్పుడు కొన్ని శస్త్రచికిత్స ప్రక్రియలు, ఎండోమెట్రియల్ అబ్లేషన్, యుటెరస్‌కు రక్తసరఫరా చేసే రక్తనాళాన్ని ఆటంకపరచి దానికి రక్తసరఫరాను ఆపే ‘యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్’ వంటి ప్రక్రియలతో దీనికి చికిత్స చేయవచ్చు. 12- ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఏమిటీ సమస్య: ఇది చాలా ఇబ్బంది కలిగించే సమస్య. తినగానే టాయిలెట్‌కు వెళ్లాల్సి వచ్చే ఈ సమస్యతో సామాజికంగా చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఇందులో చాలా లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలకు కారణాలు తెలుసుకునేందుకు నిర్వహించే అన్ని వైద్యపరీక్షల్లోనూ ఎలాంటి సమస్యలూ ఉన్నట్లు తేలదు. ఫలితాలన్నీ మామూలుగా ఉంటాయి. లక్షణాలు: పొట్ట నొప్పి, పొట్ట పట్టేసినట్లుగా ఉండటం మలబద్ధకం మలవిసర్జన తర్వాత కూడా ఇంకా కడుపు పూర్తిగా ఖాళీ కానట్లుగా ఉండటం నీళ్ల విరేచనాలు విరేచనాలు, మలబద్ధకం లాంటి విరుద్ధ లక్షణాలు ఒకదాని తర్వాత మరోటి కనిపించడం మలంలో బంక (మ్యూకస్) పడటం కడుపు ఉబ్బరంగా ఉండటం కడుపులో గ్యాస్ నిండటం / కింది నుంచి గ్యాస్ పోవడం పొట్టపై భాగంలో ఉబ్బరంగా/ఇబ్బందిగా అనిపించడం కొద్దిగా తిన్నా కడుపు నిండిపోయినట్లు ఉండి వికారం / వాంతి భ్రాంతి కలగడం ఎదుర్కొనేది ఎలా: దీనికి నిర్దిష్టమైన చికిత్స లేదు. కాకపోతే కొన్ని ఆరోగ్యకరమైన జీవనశైలులను అనుసరించడం ద్వారా సమస్య తీవ్రతను తగ్గించవచ్చు. అవి... ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని తీసుకోవడం తగిన వేళల్లో తినడం ఆహారంలో తగినంత పీచు ఉండటం కోసం పొట్టుతో కూడిన ఆహారధాన్యాలు, తాజాపండ్లు, కూరగాయలు తీసుకోవడం రోజూ ఎనిమిది గ్లాసులకు తగ్గకుండా మంచినీళ్లుతాగడం తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం వంటి జాగ్రత్తలతో ఈ సమస్యను అధిగమించవచ్చు. అయితే కొన్నిసార్లు ఫైబర్‌ను మందుల రూపంలో తీసుకోవాల్సి రావచ్చు. లక్షణాలను బట్టి యాంటీ-డయేరియల్ మందులు, యాంటీ డిప్రెసెంట్స్, కడుపు పట్టేసిన ఫీలింగ్‌ను తొలగించేందుకు యాంటీ స్పాస్మోడిక్ మందులు అవసరం కావచ్చు. అవసరాన్ని బట్టి మానసిక చికిత్సలో భాగంగా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ), డైనమిక్ సైకోథెరపీ వంటి చికిత్స ప్రక్రియలు అవసరం కావచ్చు. 13- రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏమిటీ సమస్య: ఇది మహిళల్లో ఒళ్లు నొప్పులు, కీళ్లనొప్పుల రూపంలో కనిపించే సమస్య. దాదాపు 25 నుంచి 30 ఏళ్ల మధ్యవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మన శరీరంలోని రోగ నిరోధకశక్తి మనకే వ్యతిరేకంగా పనిచేయడం వల్ల కనిపించే ఆటో-ఇమ్యూన్ సమస్య ఇది. దీనివల్ల కీళ్లనొప్పులు, కీళ్ల కదలికలు తగ్గడం వంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి. లక్షణాలు: బాగా అలసటగా ఉండటం కీళ్లలో విపరీతమైన నొప్పులు కీళ్ల కదలికలు మందగించడం నిత్యం జ్వరం ఉన్నట్లుగా అనిపించడం (మలేయిస్) ఆకలి తగ్గుతుంది. ఫలితంగా బరువు కూడా తగ్గుతుంది కండరాల నొప్పులు ఎదుర్కొనేది ఎలా: మన రోగనిరోధకశక్తి మనకే వ్యతిరేకంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య కావడంతో దీనికి పూర్తిగా చికిత్సగాని, నిర్దిష్టమైన మందులుగాని అంతగా అందుబాటులో లేవు. అయితే ఈ పరిస్థితి మరింత తీవ్రం కాకుండా చూసేందుకు, కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు తగ్గించే మందులు, కీళ్లలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించే ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారికి చేసే చికిత్స ఉద్దేశం పరిస్థితిని అదుపు చేస్తూ, అది మరింత దిగజారకుండా చూడటమే. ఇందులో భాగంగా రక్తపరీక్షలు, ఇతరత్రా ప్రాథమిక పరీక్షలు కొన్ని క్రమం తప్పకుండా చేయించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా మందులనూ, మోతాదులనూ ఎప్పటికప్పుడు మార్చాల్సి రావచ్చు. 14- డిప్రెషన్ మానసిక వ్యాకులత ఏమిటీ సమస్య: డిప్రెషన్ (వ్యాకులత) అన్నది మహిళల్లో చాలా సాధారణంగా కనిపించే మానసిక సమస్య. నిజానికి ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరికి బయటకు తెలిసేలాంటి లక్షణాలతో (క్లినికల్ లక్షణాలతో) డిప్రెషన్ కనిపిస్తుంది. ప్రతి నలుగురు మహిళల్లోనూ ఒకరు జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు డిప్రెషన్‌కు లోనవుతుంటారు. లక్షణాలు: మానసికంగా కుంగిపోయినట్లుగా ఉండటం ఎప్పుడూ విచారంగా కనిపించడం జీవితంపై ఆసక్తి కోల్పోయినట్లుగా ఉంటూ, ఎప్పుడూ ఆనందంగా ఉండాలనే కోరిక తగ్గడం అస్థిమితంగా మారడం త్వరగా కోపం తెచ్చుకోవడం చాలాసేపు అదేపనిగా ఏడ్వటం ఎప్పుడూ అపరాధ భావనతో ఉండటం నిరాశాపూరితంగా ఆలోచించడం ఆకలి తగ్గడం, ఫలితంగా బరువు తగ్గడం అతిగా నిద్రపోవడం లేదా నిద్రలేమితో బాధపడటం నిద్రపట్టినా వేకువనే మెలకువ వచ్చి మళ్లీ నిద్రపట్టకపోవడం ఆత్మహత్య దిశగా ఆలోచనలు రావడం దేనిపైనా దృష్టి నిలపలేకపోవడం, దృష్టికేంద్రీకరణ శక్తి తగ్గడం, జ్ఞాపకశక్తి తగ్గడం, నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం ఎప్పుడూ తలనొప్పి, జీర్ణసమస్యలు, దీర్ఘకాలికంగా ఒంటినొప్పుల వంటి భౌతిక సమస్యలు ఉండటం. ఎదుర్కొనేది ఎలా: జీవితాన్ని ప్రయత్నపూర్వకంగా రసభరితంగానూ, ఆనందదాయకంగానూ మలచుకోవడం ద్వారా మనంతట మనమే ఈ సమస్యనుంచి బయటపడవచ్చు. దీనికి కావాల్సిందల్లా కొద్దిగా ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని పెంపొందించుకోవడమే. విచారం నుంచి బయట పడటానికి ఎవరికి వారుగా చేసుకోదగ్గ పనులు... ప్రతిరోజూ బిజీగా గడపడానికి వీలుగా ఏదో వ్యాపకాన్ని ఎంచుకుని దానిలో ఆసక్తికరంగా నిమగ్నం కావడం. ఏదైనా సాధించడానికి అనుగుణంగా మంచి లక్ష్యాన్ని ఎంచుకోవడం. దానికోసం కృషి చేయడం. ఇందులో భాగంగా మొదట చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని తేలిగ్గా అధిగమిస్తూ పోతూ క్రమంగా పెద్ద లక్ష్యాలను ఛేదించుకుంటూ పోవడం. నిత్యం వ్యాయామంతో ఎండార్ఫిన్స్ అనే రసాయనాలు విడుదలవుతాయి. అవి మనల్ని సంతోషంగా ఉండేలా చేస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. ముఖ్యంగా ఒమెగా ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉండే చేపలు. ఇక చికిత్సలో భాగంగా డాక్టర్ చెప్పిన మందులను క్రమం తప్పకుండా వాడాలి.