Throw away
-
మాటిమాటికీ రసగుల్లా తిన్నాడని..తందూరీ పొయ్యిలో పడేశాడు
బస్తీ(యూపీ): వివాహ శుభకార్యంలో అతిథుల కోసం సిద్ధంచేసి రసగుల్లాలను మాటిమాటికీ తినేస్తున్నాడన్న కోపంతో ఒక క్యాటరింగ్ కాంట్రాక్టర్ 11 ఏళ్ల పిల్లాడిని తందూరీ పొయ్యిలో పడేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఉదంతంలో పిల్లాడికి ఛాతీ నుంచి ముఖందాకా తీవ్రస్థాయిలో కాలినగాయాలయ్యాయి. వెంటనే బంధువులు పిల్లాడిని అయోధ్య వైద్య బోధనాస్పత్రిలో చేరి్పంచారు. బస్తీ జిల్లాలోని ఛవానీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మలౌలీ గోసాయ్ గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం 11 ఏళ్ల పిల్లాడు ఛమన్ అలియాస్ అమర్ స్వస్థలం గోంఢా పరిధిలోని దుర్జాన్‌పూర్. కానీ తన అమ్మ సొంతూరు బఘానాలాలో అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి ఉంటున్నాడు. బంధువుల పెళ్లి కావడంతో అమ్మమ్మతో కలిసి మలౌలీకి వచ్చాడు. పెళ్లి వేడుకలో బంధువుల కోసం కౌంటర్ వద్ద రసగుల్లా సిద్ధంచేశారు. రసగుల్లాలను పదేపదే పిల్లాడు తీసుకోవడం చూసి అక్కడి క్యాటరింగ్ సర్వీస్ కాంట్రాక్టర్ పిల్లాడిని కోప్పడ్డాడు. అయినాసరే పిల్లాడు మరో రసగుల్లా తీసుకోవడంతో పట్టరాని ఆగ్రహంతో పిల్లాడిని కాంట్రాక్టర్ వెంటనే మండుతున్న తందూరీ పొయ్యి మీద కూర్చోబెట్టాడు. తీవ్రమైన వేడిమికి తాళలేక పిల్లాడు పట్టుతప్పి లోపల పడిపోయాడు. కాలినగాయాలతో కేకలువేయడంతో బంధువులు వచ్చి బయటకుతీసి వెంటనే అయోధ్య ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం లక్నో బోధనాస్పత్రిలో చేర్పించారు. మేనమామ దేవిదీన్ నిషద్ ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు సెక్షన్ 109(1)(హత్యా ప్రయత్నం) నేరం కింద పలువురిపై కేసు నమోదుచేశారు. పారిపోయిన కాంట్రాక్టర్ కోసం వేటమొదలెట్టామని సర్కిల్ ఆఫీసర్ హరయా స్వనిమా సింగ్ చెప్పారు. -
కసాయి తల్లి...తన ఆరుగుపిల్లల్ని బావిలో పడేసి...
"తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష" అనే చిన్నప్పటి పద్యం మనకు జీవితాంతం అడుగడుగున ఉపకరిస్తుంది. జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులు, అవమానాలు, సంఘర్షణల సమయయంలో మనం ఎలా వ్యవహరించాలో తెలుపుతుంది ఈ పద్యం. కోపం అనే చిన్న అవలక్షణం కారణంగా పతనమైపోయిన మహానుభావులు ఎందరో ఉన్నారు ఈ లోకంలో. క్షణికావేశంతో కోపంలో చేసే పనులు కారణంగా తనను తానే కోల్పోవడం లేదా జీవితాంత ఆవేదనతో బతకడమో జరుగుతుంది. ఎంతో మంది యువత కూడా ఈ ఆగ్రహమనే గ్రహానికి బలైపోతున్నారు. అచ్చం అలనే ఇక్కడో మహిళ క్షణికమైన కోపావేశాలకు గురై తన సంతానాన్ని తానే కడతేర్చింది. వివరాల్లోకెళ్తే....మహారాష్ట్రాలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఓ తల్లి తన సంతానాన్ని తానే చంపుకుంది. కుటుంబ కలహాల కారణంగా తన ఆరుగురు పిల్లల్ని బావిలో పడేసి చంపేసింది. చనిపోయిన ఆ ఆరుగురు చిన్నారుల్లో ఐదుమంది బాలికలే ఉన్నారు. ఈ ఘటన ముంబైకి 100కిలోమీటర్ల దూరంలోని మహద్ తాలూకాలోని ఖరవలి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు 30 ఏళ్ల మహిళ తన భర్త కుటుంబ సభ్యులు తనను దారుణంగా కొట్టడంతో ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు తెలిపారు. చనిపోయిన చిన్నారులంతా 18 నెలల నుంచి 10 ఏళ్ల మధ్య వయసు వారేనని అధికారులు తెలిపారు. (చదవండి: గాయత్రి ఇల్లు కబ్జాకు కుటుంబీకుల యత్నం) -
పారేసింది... పట్టుకున్నారు...
నవమాసాలు మోసి.. కన్న బిడ్డను ఓ తల్లి రోడ్డుపై పడేసేందుకు యత్నించింది. ఈ ఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎన్.చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం... కాప్రా జమ్మిగడ్డలో నివసించే జయ (21) బిహార్‌కు చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని రోజుల క్రితం వీరు విడిపోయారు. కాగా, అప్పటి నుంచి జయ తాగుడుకు బానిసై బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. జయ నెలన్నర క్రితం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మంగళవారం రాత్రి జయ చిత్తుగా మద్యం తాగి ఆటోలో వెళుతూ నేరేడ్మెట్ మూడు గుళ్ల వద్ద ఒడిలో ఉన్న పసికందును రోడ్డుపై పడేసేందుకు యత్నించింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. జయను, పసి కందును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు జయను విచారించి మల్కాజిగిరి మారుతినగర్లో నివసించే జయ సోదరి మీనాకు అప్పగించారు.


