breaking news
Terrorist control
-
ఉగ్రవాదుల నియంత్రణలో పీఓకే
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ఉగ్రవాదుల నియంత్రణలో ఉందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. గిల్గిత్–బల్టిస్తాన్, పీఓకేలు పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్నాయని శుక్రవారం పేర్కొన్నారు. 1947 అక్టోబర్ 24న మహారాజ హరిసింగ్ భారత్‌తో ఒప్పందం కుదుర్చుకున్న వెంటనే కశ్మీర్ భారత్‌లో విలీనమైందన్నారు. ఆర్టికల్ 370 కూడా తాత్కాలికమైందేనన్నారు. భారత భూభాగాలైన పీఓకే, గిల్గిత్–బల్టిస్తాన్‌లను పాక్ ఆక్రమించుకొని వాటిని ఉగ్రస్థావరాలుగా మార్చిందన్నారు. ఇటీవల యాపిల్ వ్యాపారులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనపై స్పందించారు. ఇది ముమ్మాటికి పాక్ ఉగ్రవాదుల పనేనని, కశ్మీర్లో దుకాణాలు తెరవనివ్వకుండా భయపెట్టేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. విద్యార్థులను సైతం భయపెడుతున్నారన్నారు. శాంతియుత పరిస్థితులను కల్లోలంగా మార్చడానికి ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం కశ్మీర్లో శాంతిని, అభివృద్ధిని సాధిస్తుందని తెలిపారు. -
సమష్టి పోరుతోనే ఉగ్ర నిర్మూలన
న్యూఢిల్లీ: ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా పోరాడాలని భారత్, నెదర్లాండ్స్ పిలుపునిచ్చాయి. ఉగ్రవాదుల ప్రాబల్యం, ఆర్థిక వనరులను దెబ్బతీయడానికి, సీమాంతర ఉగ్రవాద నియంత్రణకు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. భారత పర్యటనకు వచ్చిన నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూట్ గురువారం ప్రధాని మోదీతో చర్చలు జరిపారు మతం, జాతి, తెగ, వర్గాలతో ఉగ్రవాదాన్ని ముడిపెట్టొద్దని ఇరువురు నేతలు ఉద్ఘాటించారు. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థలు దక్షిణాసియాలో శాంతికి ముప్పుగా పరిణమించాయని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. అణు సరఫరా బృందం(ఎన్ఎస్జీ)లో భారత్ సభ్యత్వానికి నెదర్లాండ్స్ మద్దతిస్తుందని రూట్ తెలిపారు. మన బంధం మరింత బలపడాలి.. వాణిజ్యం, వ్యవసాయం, ఇంధన వనరులు తదితర రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, నెదర్లాండ్స్ నిర్ణయించాయి. ఇండియా–డచ్ సీఈవోల రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నాక మోదీ, రూట్ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ‘అంతర్జాతీయ సౌర కూటమిలో చేరాలని నెదర్లాండ్స్‌ను గతంలోనే ఆహ్వానించాను. గురువారం వారు అందులో సభ్య దేశంగా చేరారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను’ అని మోదీ అన్నారు. భారత్‌లో అత్యధికంగా విదేశీ పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో నెదర్లాండ్స్ మూడో స్థానానికి చేరిందని వెల్లడించారు. భారత్‌లో కల్పిస్తున్న కొత్త అవకాశాల పట్ల డచ్ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయని నరేంద్ర మోదీ అన్నారు. రూట్ మాట్లాడుతూ..వాణిజ్యం, వ్యవసాయం, స్మార్ట్ సిటీస్, ఇంధన వనరుల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మెరుగైన అవకాశాలున్నాయని అన్నారు. ద్వైపాక్షిక భేటీ తరువాత విడుదలైన ఉమ్మడి ప్రకటనలో..పెట్టుబడులు, వాణిజ్య సంబంధాల అభివృద్ధిలో ప్రైవేట్ రంగ పాత్ర కీలకంగా మారిందని మోదీ, రూట్ పేర్కొన్నారు. ‘క్లీన్ గంగా’ ప్రాజెక్టుకు రూట్ కితాబు.. పవిత్ర గంగా నది ప్రక్షాళనకు ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నమామీ గంగే పథకాన్ని రూట్ ప్రశంసించారు. నీటిని ఆర్థిక వనరుగానే పరిగణించకుండా, సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ పరంగానూ విలువ ఇవ్వాలని పేర్కొన్నారు. గంగా నది శుద్ధి కార్యక్రమంలో ఈ అంశా లన్నీ ఇమిడి ఉన్నాయని కితాబు ఇచ్చారు. కాగా, గురువారం రాత్రే రూట్ స్వదేశం బయల్దేరారు. 29 నుంచి మోదీ విదేశీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 29 నుంచి ఐదు రోజుల పాటు ఇండోనేసియా, సింగపూర్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇరుదేశాలతో రక్షణ, భద్రతరంగానికి సంబంధించి పలు ఒప్పందాలు చేసుకుంటారు. మే 29 నుంచి 31 వరకూ మోదీ ఇండోనేసియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఇండోనేసియాతో రక్షణరంగంలో సహకారం కోసం ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు. అనంతరం జూన్ 1న సింగపూర్‌కు వెళ్లనున్న మోదీ ఆ దేశ ప్రధాని లీసెయిన్ లూంగ్‌తో పలు అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. అనంతరం 28 ఆసియా–పసిఫిక్ దేశాల రక్షణ మంత్రులు, ఆర్మీ చీఫ్‌లు పాల్గొనే షాంగ్రీ లా సదస్సులో మాట్లాడతారు. ఈ సదస్సులో ప్రసంగించనున్న తొలి భారత ప్రధాని మోదీనే కావడం గమనార్హం. ‘గ్రామస్వరాజ్’ సక్సెస్ ప్రధాని మోదీ ఉద్ఘాటన న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ‘గ్రామస్వరాజ్ అభియాన్’ కార్యక్రమం విజయవంతమైందని.. ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 14 (అంబేడ్కర్ జయంతి) మొదలుకుని మే 5 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని రూపొందించాం’ అని ఆయన ట్వీట్ చేశారు. పేదలకోసం ఉద్దేశించిన ఏడు ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ పథకాలను వివిధ బృందాలు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు వివరించాయన్నారు. ‘ఈ 21 రోజుల్లో 7.53 లక్షల మందికి ఉజ్వల కనెక్షన్లు, 5లక్షల ఇళ్లకు సౌభాగ్య పథకం ద్వారా విద్యుత్ వెలుగులం దించాం. 16,682 గ్రామాల్లో 25 లక్షల ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేశాం. 1.65 లక్షల మంది∙చిన్నారులు, 42,762 మంది గర్భిణులకు మిషన్ ఇంద్ర ధనుష్‌లో భాగంగా టీకాలు వేశాం’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, స్థానిక సంస్థల భాగస్వామ్యం మరువలేనిదన్నారు. అందరికీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. -
ఉగ్ర నియంత్రణకు కట్టుబడి ఉండండి
నవాజ్ షరీఫ్‌కు మోడీ సూచన మీ భూభాగం నుంచి చొరబడుతున్న ఉగ్రవాదుల్ని నియంత్రించండి న్యూఢిల్లీ: పాకిస్థాన్ భూభాగం నుంచి భారత్‌లోకి చొరబడి ఉగ్రవాదులు సృష్టిస్తున్న హింసపై ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తంచేశారు. ఉగ్రవాద నియంత్రణకు కట్టుబడి ఉండాలని ఆయన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు సూచించారు. ఇక ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ఎలా ముందుకు సాగాలన్న విషయంలో ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు సంప్రదింపులు జరిపేలా ఇద్దరు ప్రధానులు ఒక అంగీకారానికి వచ్చారు. విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు గత రెండేళ్లుగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు మంగళవారమే ఎనిమిది సార్క్ దేశాల నేతలతో మోడీ చర్చలు జరిపారు. వీరితో నవాజ్ షరీఫ్‌తో భేటీకి ఆయన అధిక ప్రాధాన్యమిచ్చారు. దాదాపు 45 నిమిషాలపాటు జరిగిన ఆ సమావేశం వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ మంగళవారమిక్కడ విలేకరులకు వెల్లడించారు. సుజాతా సింగ్ తెలిపిన వివరాల ప్రకారం... భారత్‌లో ఉగ్రవాదాన్ని విస్తరించడానికి ఉగ్రవాదులు పాక్ భూభాగాన్ని ఉపయోగిస్తున్నారని, దాన్ని నియంత్రించేందుకు కట్టుబడి ఉండాలని షరీఫ్‌కు మోడీ సూచించారు. ముంబైలో ఉగ్రవాదుల దాడి కేసులో నిందితులకు తగిన శిక్ష పడేలా పాక్ చర్యలు తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి ఏమైనా చర్చించారా అని అడగ్గా.. ఉగ్రవాదానికి సంబంధించి చాలా అంశాలు చర్చించారని సుజాతా సింగ్ చెప్పారు. కాశ్మీర్ అంశం గురించి చర్చ జరిగిందా అని అడగ్గా.. దీనిపై ఏం చేయాలన్నది విదేశాంగ కార్యదర్శులు చర్చిస్తారని వివరించారు. పాకిస్థాన్‌కు రావాల్సిందిగా మోడీకి ఆహ్వానాలు వచ్చాయని, వాటికి ఆయన అంగీకరించారని, ఇంకా తేదీలు ఖరారు కాలేదన్నారు. ఘర్షణను సహకారంగా మార్చుకోవాలి: షరీఫ్ శాంతి, ప్రగతి, సౌభాగ్యం కోసం ఇరుదేశాలు కలసికట్టుగా పనిచేయాలని, ఘర్షణను సహకారంగా మార్చుకోవాల్సిన అవసరముందని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్.. భారత ప్రధాని నరేంద్ర మోడీతో అన్నారు. మోడీతో తొలి భేటీ తర్వాత షరీఫ్ స్వదేశం వెళ్లేముందు విలేకరతో మాట్లాడారు. మోడీతో సమావేశం సుహృద్భావంతో నిర్మాణాత్మకంగా సాగిందన్నారు. ఈ స్ఫూర్తితో.. ద్వైపాక్షిక అజెండాను సమీక్షించి, ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలో విదేశాంగ కార్యదర్శుల భేటీ నిర్వహించేందుకు తాను, మోడీ అంగీకరించామన్నారు. అనంతరం నవాజ్ షరీఫ్ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.