తస్మాత్ జాగ్రత్త..!
                  
	► మార్కెట్లో నకిలీ పది నాణేలు 
	► హడలెత్తుతున్న జనం
	► చిల్లర కొట్టులో  తిరస్కరిస్తున్న యజమానులు
	► బ్యాంకులకు తీసుకెళ్లడంతో నకిలీ నాణేలుగా గుర్తింపు
	కడప :
	జిల్లాలో గత కొద్ది రోజులుగా నకిలీ పదిరుపాయల నాణేలు జనాలను హడలెత్తిస్తున్నాయి. పది నాణేలను  చిల్లర కొట్టులో, మార్కెట్లో తిరస్కరిస్తుండటంతో జనం ఆందోళనకు గురువుతున్నారు. కొన్ని పెట్రో బంకుల్లో సైతం చెల్లవాని చెబుతున్నట్లు తెసిలింది.
	 
	మరి కొన్నచోట్ల అసలు పదిరూపాయల నాణేలను చూడగానే వద్దంటూ నిరాకరిస్తున్నట్లు పలువురు తెలిపారు. కొత్తగా వచ్చిన పది నాణేనికి 10 అని రాయడంతోపాటు దానిపైన రుపీస్ సంబంధిత గుర్తు కూడా ఉంటుంది. కానీ  నకిలీ నాణేనికి అలాంటి గుర్తు లేకుండా కేవలం 10 అని మాత్రమే  రాసి ఉంటుంది. అలాగే మరో గుర్తు ఏమిటంటే మంచి పది రుపాయల నాణేనికి (రుపీస్) పైన పది నిలువు గీతలు ఉంటాయి. కానీ  నకిలీ నాణేనికి 15 నిలువు గీతలు ఉంటాయని కొంతమంది తెలిపారు. సంబంధిత విషయాలను ఎవరైన పది రుపాయలు ఇచ్చినప్పుడు గమనించాలి్సన  అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి నకిలీ నాణేలను అధికారులు గుర్తించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 
	 
	అధికారులే గుర్తించాలి
	మా హోటల్‌కు పాలు పోసే ఓ పెద్దాయనకు ఇటీవల 200 రుపాయలకు సంబంధించి పది రుపాయల నాణేలను ఇచ్చాను. ఆ పెద్దాయన ఓబ్యాంకులో డబ్బులు కట్టేందుకు వెళ్లగా ఇందులో పదికి పైగా నకిలీ బిల్లలున్నాయని బ్యాంకు అధికారులు వెనక్కు ఇచ్చారు.  కానీ మాకు ఇంతవరకూ పది నాణేలలో కూడా దొంగ బిళ్లలు ఉన్నాయన్న విషయం తెలియదు. అధికారులు స్పందించి  నకిలీ నాణేలకు, మంచి నాణేలకు గల తేడాల గురించి జనాలకు అవగాహన కల్పించాలి్సన అవసరం ఎంతైనా ఉంది.   
	– కృష్ణమూర్తి,
	గురుదర్శన్ హోటల్ యజమాని, కడప