breaking news
telangana mala mahanadu
-
‘దళితులను దగాచేస్తున్న ప్రభుత్వం’
గోపాల్పేట : దళితులను దగా చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలంగాణ మాల మాహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దంకి దయాకర్ స్పష్టంచేశారు. ఆదివారం ఆయన వనపర్తిలో విలేకరులతో మాట్లాడారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఒక్క డీఎస్సీ కూడా వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఆరోపించారు. నాలుగేళ్లలో దాదాపు రూ.95వేల కోట్లను సీమాంధ్ర కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌రావు నలుగురితో బంగారు తెలంగాణ ఎలా సాధ్యమన్నారు. అంబేద్కర్ సుజల స్రవంతి పేరును కాళేశ్వరంగా మార్చి అంబ్కేదర్‌ను అవమానించారన్నారు. తెలంగాణ కోసం పనిచేసిన ప్రొఫెసర్ కోదండరాం పర్యటిస్తే జైల్లో పెడతారు.. అదే కేసీఆర్‌ను తిట్టిన పవన్ కల్యాణ్ మాత్రం పర్యటించ వచ్చా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు కేటాయించడమే తప్ప ఖర్చు చేయడం లేదన్నారు. బ్యాక్లాగ్ పోస్టులను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. త్వరలో నడిగడ్డలో దళితగర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి తుమ్మల రవికుమార్, శ్రీనివాస్, కృష్ణ, రవికుమార్ ఉన్నారు. -
ఏపీఎన్జీవో భవన్ ముట్టడికి యత్నం
హైదరాబాద్ : సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఏపీఎన్జీఓల తీరుకు నిరసనగా ఏపీఎన్జీవో భవన్‌ను ముట్టడించేందుకు తెలంగాణ మాలమహానాడు కార్యకర్తలు బుధవారం ప్రయత్నించారు. కార్యాలయం ముందు బైఠాయించి అన్నదమ్ముల్లా కలిసుందామని... రాష్ట్రాలుగా విడిపోదామని వారు కోరారు. సీమాంధ్ర ప్రజలకు తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు కలగవని చెప్పారు. ఈ నెల 7న ఏపీఎన్జీఓలు నిర్వహించ తలపెట్టిన సభను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను అక్కడ నుంచి తరలించారు. ఏపీ ఎన్జీవోలు ఏడో తేదీన తలపెట్టిన సభకు పోలీసులు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.