breaking news
TBGKS President
-
బాయిమీది పేరే లెక్క..
గోదావరిఖని(పెద్దపల్లి జిల్లా): సింగరేణి కార్మికునికి వంద పేర్లున్నా బాయిమీద ఉన్న పేరునే యాజమాన్యం లెక్కలోకి తీసుకోవాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు పేర్లున్నాయనే సాకుతో కార్మికుల పిల్లలకు ఉద్యోగాలిచ్చేందుకు అడ్డుపడుతున్నారని, విజిలెన్స్ విచారణతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మారు పేర్ల మార్పుకు హామీ ఇచ్చినా సింగరేణి అదికారులు మాత్రం విజిలెన్స్ విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేయడం శోచనీయమన్నారు. కేటీఆర్ దృష్టికి సమస్యలు.. సింగరేణి కార్మికుల ఎదుర్కొంటున్నసమస్యలను సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్, కోల్‌బెల్ట్‌ప్రాంత ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే ఆయన సీఎండీతో మాట్లాడారని తెలిపారు.. ఆగస్టు రెండో వారంలో మరోసారి కేటీఆర్‌ను కలుస్తామన్నారు. టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ సంస్థలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని జాతీయ సంఘాలు విమర్శించడంలో అర్థం లేదన్నారు. ముఖ్యమంత్రి జోక్యంతోనే కారుణ్య నియామకాలు ప్రారంభమైన విషయాన్ని మర్చిపోవద్దన్నారు. కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీని ధిక్కరించి వేరే ప్రచారం నిర్వహిస్తే వేటు తప్పదని వెంకట్రావు హెచ్చరించారు. టీఆర్ఎస్పార్టీ గెలుపుకోసం టీబీజీకేఎస్ శ్రేణులంతా కష్టించి పనిచేయాలన్నారు. కెంగర్లకు పదవి లేదు యూనియన్ బైలాస్ ప్రకారం టీబీజీకేఎస్ యూనియన్‌లో కెంగర్ల మల్లయ్యకు పదవి లేదని వెంకట్రావు అన్నారు. బైలాస్ ప్రకారం వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు లేదని.. ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గతంలో ప్రత్యేకంగా పదవి ప్రకటించిన విషయం వాస్తవమేనని, తర్వాత యూనియన్‌లో ఈపోస్టును సవరించాల్సి ఉన్నప్పటికి సాధ్యం కాలేదన్నారు. కనకం శ్యాంసన్, నూనె కొమురయ్య, గండ్ర దామోదర్‌రావు, దేవ వెంకటేశం, వెంకటేష్, పుట్ట రమేష్, ఎట్టెం క్రిష్ణ, రమేష్‌రెడ్డి పాల్గొన్నారు. -
వారసత్వ ఉద్యోగాలపై చరిత్రాత్మక నిర్ణయం
ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే.. టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ రెబ్బెన : 18 ఏళ్లుగా సింగరేణి కార్మికులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్న వారసత్వ ఉద్యోగాలపై సీఎం కేసీఆర్‌ది చరిత్రాత్మక నిర్ణయమని టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ అన్నారు. శుక్రవారం గోలేటి టౌన్‌షిప్‌లోని సీఈఆర్‌క్లబ్‌లో టీబీజీకేరియా ఏరియా సర్వసభ్య స మావేశం నిర్వహించారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య, ఉపాధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకట్రావ్ మాట్లాడుతూ సింగరేణిలో వీఆర్ఎస్ ఉద్యోగాలను రద్దు చేస్తూ జాతీ య సంఘాలు ఒప్పందాలు కుదుర్చుకుందని అన్నా రు. కేవలం కార్మికులు మరణిస్తే, మెడికల్ అన్‌ఫిట్ అ యితే తప్ప కార్మికులకు ఉద్యోగాలు దొరికే పరిస్థితులు లేకుండా పోయాయి. దేశంలో ఎక్కడ లేనివిధంగా సింగరేణి కార్మికులకు తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ రిటైర్ అయ్యే వరకు అందుతుందని తెలిపారు. జాతీయ సంఘాలు పొగొట్టిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి పునరుద్ధరణకు అంగీకారం తెలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎలాంటి షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగం కోసం దరఖాస్తులు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించాలని సీఎండీని ఆదేశించారని తెలిపారు. కమ్యూనిస్టు యూనియన్లను భూస్థాపితం చేయాలి : ఎమ్మెల్సీ సతీశ్ కుమార్ కార్మికులను శ్రమదోపిడీకి గురిచేసే కమ్యూనిస్టు యూ నియన్లను వచ్చే గుర్తింపు సంఘం ఎన్నికల్లో భూస్థాపితం చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ సతీశ్ కుమార్ పిలుపునిచ్చారు. జాతీయ సంఘాలు కార్మికులను ఓట్ల వేసే యంత్రాలుగా మార్చుకుని ఎన్నికల్లో గెలిచిన అనంతరం యాజమాన్యానికి తొత్తులుగా మారుతున్నాయని విమర్శించారు. వారసత్వ ఉద్యోగాలను కాలరాసిన కమ్యూనిస్టు సంఘాలు ఏ ముఖం పెట్టుకుని కార్మికులను ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ను కార్మికులు గెలిపిస్తే ప్రభుత్వ అండతో మరిన్ని హక్కులను సాధిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఏరియాకు చెందిన కార్మికులు భారీస్థాయిలో టీబీజీకేఎస్‌లో చేరారు. ఈ సమావేశంలో రెబ్బెన, తాండూర్ జెడ్పీటీసీలు అజ్మీర బాబురావు, సురేష్‌బాబు, రెబ్బెన ఎంపీపీ సంజీవ్‌కుమార్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్ పర్సన్ శంకరమ్మ, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సదాశివ్, కేంద్రకమిటీ కార్యదర్శులు శ్రీనివాస్‌రావు, సత్యనారాయణ,ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, ఏరియా కార్యదర్శులు శంకరయ్య, శంకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్ లక్ష్మణ్, నాయకులు పాల్గొన్నారు.