breaking news
tax return
-
ఐటీ రిటర్నులు ఎవరు ఫైల్ చేయాలి..?
ఇదొక ప్రశ్నా..? అనుకోకండి... ఆదాయం అంటే నికర ఆదాయం లేదా టాక్సబుల్ ఇన్‌కం బేసిక్ లిమిట్ దాటిన ప్రతి వ్యక్తీ, ప్రతి ఏటా విధిగా, కచ్చితంగా సకాలంలో రిటర్నులు దాఖలు చేయాలి. ఇదొక ప్రాథమిక సూత్రం. ఫాలో అవ్వండి. చట్ట ప్రకారం, వ్యక్తులకు ఎటువంటి ఆదాయం లేకపోయినా బేసిక్ లిమిట్ పరిధిలోకి వస్తారు. టాక్స్‌బుల్ ఇన్‌కం ఉంటే ఆదాయపు పన్ను రిటర్నులు చేయాల్సిందే. ఇటువంటి వ్యక్తులు ఎవరు? ఏమిటా సందర్భము? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ..మీరు ఒక సంవత్సరం కాలం, అంటే ఓ ఆర్థిక సంవత్సరంలో ఒక కోటి రూపాయిలు దాటి బ్యాంకులో డిపాజిట్ చేశారనుకొండి. మీరు రిటర్ను వేయాల్సిందే. అమెరికా నుంచి మీ అబ్బాయి రూ.కోటి దాటి పంపితే, అది మీ అకౌంటులో జమ కాబట్టి మీరు రిటర్ను వేయాలి. సాంకేతికంగా ఒక సలహా.. మీ అకౌంట్లో కోటి లోపు, మీ జీవిత భాగస్వామి అకౌంట్లో కోటి లోపు వేసినట్లయితే ఈ బాధ్యత నుంచి బయట పడవచ్చు. ఇటువంటి బదిలీల వలన మీకు ఎటువంటి పన్ను భారం మాత్రం ఉండదు.మీరు ఓ కంపెనీకి డైరెక్టర్ అనుకోండి. లేదా లిమిటెడ్ పార్టనర్ షిప్లో భాగస్వామి అనుకోండి. జీతం/పారితోషికం/కమీషన్ ఏమీ తీసుకోకపోయినా రిటర్ను వేయాల్సిందే. దగ్గరి వారో లేదా మిత్రులో.. ప్రోద్బలం వల్ల కంపెనీ పెట్టవచ్చు. లిమిటెడ్ పార్టనర్‌షిప్‌లో చేరవచ్చు. మీకు ఎటువంటి బరువు, బాధ్యతలు ఉండకపోవచ్చు. కానీ రిటర్ను మాత్రం వేయాలి. మీకు చెప్పుకుండా మీ పేరు కూడా వాడుకోవచ్చు. తగిన జాగ్రత్త వహించాలి.విదేశీయానం మీద రూ.2 లక్షలు దాటి పెట్టారనుకోండి. మీరు రిటర్ను దాఖలు చేయాలి. అలా చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందీ, పన్ను భారం ఉండకపోవచ్చు. మీ అబ్బాయో/అమ్మాయో టికెట్ కొనమనండి. ఆ డబ్బుల్ని వారిని చెల్లించమనండి.మీకు కరెంట్ బిల్లు సంవత్సరంలో రూ.ఒక లక్ష దాటింది అనుకొండి. ఆ షాక్‌తో పాటు రిటర్ను దాఖలు షాక్ కూడా మీ నెత్తిన పడుతుంది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో మీ పేరు మీద ఫ్లాట్లు ఉన్నాయనుకోండి. అన్నీ కలిపి మీ పేరు మీద బిల్లు రూ.లక్ష దాటింది అనుకోండి. మీకు ఈ బాధ్యత వర్తిస్తుంది. కరెంటు బిల్లు.. ఇంటికి, బిల్డింగ్‌కి, అపార్ట్మెంట్కి, కమర్షియల్ ప్రాపర్టీకే కాదు ఒక వ్యక్తికి వస్తుంది. ఇలాంటి జాబితాలో చాలామంది ఉంటారు. ఉన్నారు. ప్రస్తుతం సమాచార సమన్వయం లేకపోవడంతో వీళ్లు తప్పించుకుంటున్నారు. కానీ కృత్రిమ మేథస్సు వలన ఇవన్నీ బయటపడతాయి.మీ విషయంలో టీడీఎస్ రూ.25,000 లేదా ఆపైన జరిగిందనుకోండి. సీనియర్ సిటిజన్ల విషయంలో ఈ లిమిట్ రూ.50,000గా ఉంటుంది. వీరు రిటర్ను వేయాల్సిందే. వెంటనే ఫారం 16/ఫారం 16ఏ చెక్ చేసుకోండి. ‘నిప్పు లేనిదే పొగరాదు’ మాదిరిగా ఏదొక వ్యవహారం జరగనిదే టీడీఎస్ కోత తప్పదు. ఈ వ్యవహారాన్ని బయట పెట్టే సందర్భమే... ఈ రిటర్ను వేయడం.మీ వ్యాపారం/బిజినెస్/వసూళ్లు/ అమ్మకాలు సంవత్సర కాలంలో రూ.60 లక్షలు దాటాయనుకోండి. జీఎస్టీ రిజిస్ట్రేషన్ ద్వారా ఇది బయటపడుతుంది. అలాగే వృత్తి పరంగా వచ్చే ఆదాయం ఏటా రూ.10 లక్షలు దాటిందంటే రిటర్ను వేయాలి. ఈ రెండు కేసుల్లోనూ నికర ఆదాయంతో సంబంధం లేదు. లాభనష్టాలతో అసలు పనేంలేదు. రిటర్ను వేయాలి.టీడీఎస్ జరిగింది.. ఆదాయం టాక్స్‌బుల్ ఇన్‌కం లోపల ఉన్నా, ఆదాయం ఏమాత్రం లేకున్నా, పన్ను భారానికి మించి టాక్స్ కట్ చేసినా రిఫండ్ పొందాలి. రిఫండ్ కోసం రిటర్ను వేయాల్సిందే.ఇదీ చదవండి: స్వల్పకాల పెట్టుబడికి మెరుగైన సాధనాలుచివరిగా, మీకు రుణాల మంజూరు, విదేశీ ప్రయాణాలకు వీసాలు లాంటి విషయాల్లో .. గౌరవం, పరపతి, గుర్తింపు ఇటువంటి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి రిటర్నులు వేయడంపై దృష్టి పెట్టండి. ఎగవేత మార్గాన్ని ఎంచుకోకండి. -
జీఎస్టీ రిటర్న్‌లో మార్పులు.. వచ్చే ఏడాది నుంచి కొత్త రూల్స్
వచ్చే ఏడాది నుంచి జీఎస్టీ రిటర్న్‌లకు సంబంధించి నిబంధనలలో మార్పులు రానున్నాయి. ఇందులో భాగంగా 2025 ప్రారంభం నుండి జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు రిటర్న్ దాఖలు చేసిన గడువు తేదీ నుండి మూడు సంవత్సరాల తర్వాత నెలవారీ, వార్షిక జీఎస్టీ రిటర్న్ ఫైల్ చేయలేరు.గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ (జీఎస్టీఎన్) తాజాగా జరిగిన సంప్రదింపులలో ఈ విషయాన్ని తెలిపింది. జీఎస్టీ అమ్మకాల రిటర్న్‌లతో పాటు, బకాయిల చెల్లింపు, వార్షిక రిటర్న్‌లు, టీసీఎస్ వసూలుకు సంబంధించిన రిటర్న్‌లకు కొత్త నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. అంటే రిటర్న్‌ల సమర్పణ గడువు తేదీ నుండి మూడేళ్ల వ్యవధి ముగిసిన తర్వాత రిటర్న్ దాఖలు చేయడంపై నిషేధం ఉంటుంది.“ఈ మార్పు వచ్చే ఏడాది (2025) ప్రారంభం నుండి జీఎస్టీ పోర్టల్‌లో అమలులోకి రాబోతోంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు తమ రికార్డులను సరిచూసుకోవాలి. ఇంకా ఎవరైనా జీఎస్టీ రిటర్న్‌లను దాఖలు చేయకపోతే వీలైనంత త్వరగా దాఖలు చేయాలి" అని జీఎస్టీఎన్ సూచించింది.సకాలంలో జీఎస్టీ దాఖలును పూర్తి చేయడం, డేటా విశ్వసనీయతను పెంచడం, ఫైల్ చేయని రిటర్న్‌ల 'బ్యాక్లాగ్'ను సమర్థవంతంగా తగ్గించడం లక్ష్యంగా జీఎస్టీఎన్ కొత్త మార్పులు ప్రవేశపెడుతోంది. రిటర్న్‌లను ఆలస్యంగా దాఖలు చేసే వ్యవధిని పరిమితం చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులు తమ రికార్డులను సరిపోల్చుకుని, సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. -
రాష్ట్రాలకు రూ.72,961 కోట్లు విడుదల.. ఎందుకంటే..
కేంద్రప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నుల్లో రాష్ట్రాల వాటాను ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తూ ఉంటుంది. అయితే రానున్న నూతన సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల అవసరాలు తీర్చేలా రూ.72,961.21 కోట్ల పన్నుల పంపిణీకి కేంద్రం శుక్రవారం ఆమోదం తెలిపింది. వివిధ సామాజిక సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఆర్థిక సహాయం చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వాలను బలోపేతం చేయడానికి ఈ నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబరు 11, 2023న ఇప్పటికే విడుదలైన నిధులకు తాజాగా విడుదల చేస్తున్న రూ.72,961.21 కోట్లు అదనం అని కేంద్రం ప్రకటనలో చెప్పింది. ఈ నిధుల్లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు అత్యధికంగా రూ.13,088.51 కోట్లు, బిహార్ రూ.7338.44 కోట్లు, మధ్యప్రదేశ్ రూ.5727.44 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.5488.88 కోట్లు రానున్నాయి. ఇదీ చదవండి: 2024లో బ్యాంక్ సెలవులు ఇవే.. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో 41 శాతం నిధులను 14 విడతలుగా రాష్ట్రాలకు పంపిణీ చేసినట్లు సమాచారం. 2023-24 బడ్జెట్ ప్రకారం ఈ ఏడాది రాష్ట్రాలకు రూ.10.21 లక్షల కోట్లు బదిలీ చేయాలని కేంద్రం భావిస్తోంది. -
పన్నుల రాబడి పెరుగుతోంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం ఏటా పురోగమన దిశలోకి వెళుతోంది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో బడ్జెట్ రాబడులు, వ్యయాలు, అప్పులు కలిపి ఆర్థిక వ్యవస్థ విలువ రూ. 4 లక్షల కోట్లు ఉంటే గత ఐదేళ్లలో అది రూ. 9 లక్షల కోట్లకు చేరింది. ఇందులో ముఖ్యంగా సొంత పన్నుల రాబడిలో అద్భుత ప్రగతి నమోదవుతోంది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పన్ను రాబడి గతేడాదితో పోలిస్తే 29 శాతం వృద్ధి నమోదు చేసుకుంది. మొత్తం రూ. 77,514 కోట్ల సొంత పన్ను రాబడిని 2018–19లో లక్ష్యంగా పెట్టుకుంటే డిసెంబర్ నాటికే అది రూ. 49,203 కోట్లు వచ్చింది. మిగిలిన త్రైమాసికంలోనూ మంచి ఫలితాలు ఉండటంతో 2018–19 ఆర్థిక సంవత్సరం రూ.64,714 కోట్లతో ఆశాజనకంగా ముగిసింది. మొత్తానికి గత ఐదేళ్లలో సొంత పన్ను రాబడులు రూ. 29 వేల కోట్ల నుంచి రూ. 70 వేల కోట్లకు చేరడం గమనార్హం. రిజిస్ట్రేషన్లు.... సూపర్ రెవెన్యూ రాబడులను పరిశీలిస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయం రాష్ట్రంలో గత ఐదేళ్లలో అద్భుత ప్రగతిని నమోదు చేసుకుంది. ఏటా రిజిస్ట్రేషన్ల ఆదాయం విపరీతంగా పెరుగుతోంది. ఒక్కో నెలలో ఏకంగా రూ. 500 కోట్లు దాటుతున్న రిజిస్ట్రేషన్ల రాబడులు ఖజానాకు భారీగా నిధులు తెచ్చిపెడు తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ రికార్డులు నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే 27 శాతం అధికంగా రూ. 5,357 కోట్లు సమకూరాయి. దేశంలోనే ఈ మేర వృద్ధి సాధించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. రాష్ట్రంలో 2014–15 ఆర్థిక సంవత్స రంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ. 2,531 కోట్లుగా ఉంటే అది ఐదేళ్లలో రూ. 5,357 కోట్లకు చేరింది. అంటే గత ఐదేళ్లలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రెట్టింపుకన్నా ఎక్కువ పెరిగిందన్న మాట. జీఎస్టీలో రికార్డు... అమ్మకాలు, వర్తకపు పన్ను విషయంలోనూ రాష్ట్రంలో గణనీయ వృద్ధి నమోదవుతోంది. గత ఐదేళ్లలో పన్నుల ఆదాయం కూడా రెట్టింపు కన్నా ఎక్కువ కావడం గమనార్హం. 2017–18లో జీఎస్టీ అమల్లోకి వచ్చాక కూడా పన్నులు భారీగానే వసూలయ్యాయి. ఊహించిన దానికన్నా తక్కువే అయినా 2017–18లో రూ. 37,439 కోట్ల పన్నులు వసూలు కాగా, 2018–19లో ఆల్‌టైం రికార్డు సాధించింది. కేంద్రం నుంచి వచ్చే పరిహారంతోపాటు అన్ని పన్నులు కలిపి రూ. 45 వేల కోట్లకుపైనే వసూలయ్యాయి. 17 శాతం వృద్ధి నమోదు... 2014 మే నుంచి 2018 మార్చి వరకు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులనుబట్టి కాగ్ నివేదికలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 17 శాతంగా నమోదు కావడం విశేషం. ఇది దేశంలోనే అత్యధికం కాగా, మన తర్వాత హరియాణా, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. వరుసగా నాలుగేళ్లపాటు రాష్ట్రం ఆర్థిక వృద్ధిలో ప్రగతి నమోదు చేసుకుందని, అన్ని రాష్ట్రాలకన్నా పన్నుల రాబడిలో తెలంగాణ మంచి వృద్ధి సాధిస్తోందని కాగ్ నివేదికలో స్పష్టం చేసింది. సంక్షేమ భారాలను అధిగమిస్తూ... సంక్షేమం, అభివృద్ధితోపాటు రాష్ట్రంలో సాగునీటి వనరుల కల్పనే ధ్యేయంగా నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఆసరా పింఛన్లు, రైతు రుణమాఫీ, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాల అమలుకోసం ఏటా రూ. 30 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆసరా పింఛన్ల కోసమే రూ. 12 వేల కోట్ల మేర వెచ్చించాల్సి వస్తోంది. అప్పులూ చేయాల్సిందే... రాష్ట్రం ఏర్పాటయ్యాక రూ. 1.13 లక్షల కోట్ల మేర అప్పులు చేయాల్సి వచ్చింది. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రణాళికేతర వ్యయానికి తోడు సాగునీటి ప్రాజెక్టులకు కలిపి భారీగా నిధులు వెచ్చించాల్సి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు తీసుకోవాల్సి వస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రాష్ట్ర ఆర్థిక సామర్థ్యంలో 25 శాతం మేర అప్పులు తీసుకునే అవకాశం ఉండగా ప్రభుత్వం 22 శాతం అప్పులు తీసుకుంది. తెలంగాణ ఏర్పాటైన తొలి ఏడాది రూ. 9,410 కోట్లు అప్పు తీసుకుంటే ఆ తర్వాత వరుసగా రూ. 18,856 కోట్లు, రూ. 35,280 కోట్లు, రూ. 26,738 కోట్లు, రూ. 23,470 కోట్ల మేర అప్పులు తీసుకోవాల్సి వచ్చింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు అనుగుణంగా మరో రూ. 29,800 కోట్ల మేర అప్పులు తీసుకునే అవకాశం ఉంది. -
పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం ఎలా?
న్యూఢిల్లీ: భారతీయ పౌరులకు బయోమెట్రిక్ డేటా ఆధారంగా ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డు ఆధార్ కార్డ్. ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకం చేయడానికి, నల్లధనాన్ని అరికట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా తాజాగా ఆర్థిక శాఖ పాన్‌కార్డుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసింది. పాన్, పన్ను రిటర్న్‌లు దాఖలు కోసం ఆధార్ తప్పనిసరి. ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేసేందుకు పాన్‌తో ఆధార్ అనుసంధానాన్ని జులై 1 నుంచి తప్పనిసరి చేసింది ప్రభుత్వం. డిసెంబరు 31 తుది గడువుగా ప్రకటించింది. ఈ గడువు ముగిసిన తర్వాత పాన్ ఇన్వాలిడ్ అవుతుందని కేంద్రం హెచ్చరిస్తోంది. పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం ఎలా? మొదట పన్ను చెల్లింపుదారులఇన్కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి. ఇదివరకే యూజర్ ఖాతా కలిగి ఉన్నవారు నేరుగా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నేరుగా లాగిన్ అయితే సరిపోతుంది.లాగిన్ అయిన తర్వాత ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్కడ లింక్ ఆధార్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ పేరు, పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలను ఎంటర్ చేయాలి. ఈ వివరాలను ఆటోమేటిగ్గా సరిచూస్తుంది. క్రాస్ చెక్ పూర్తయిన తర్వాత మీ నంబరు, క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే.. నిమిషాల్లో ఈ ఆధార్ లింకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. వివరాలన్నీ సరిపోలితేనే ఈ అనుసంధాన ప్రక్రియ సజావుగా జరుగుతుంది. అనుసంధానం పూర్తయిన వెంటనే సమాచారం అందుతుంది. పాన్‌తో పాటు ఆధార్ అనుసంధానం చేయని పక్షంలో కొన్ని రోజుల తర్వాత పాన్ పనికిరాకుండా పోతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే ఆధార్ లేని వారు దాని కోసం దరఖాస్తు చేయాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. ఒకవేళ ఈ మధ్యే ఆధార్ కోసం దరఖాస్తు చేసుకొని వుంటే అనుసంధానం చేసేటప్పుడు ఎన్రోల్మెంట్ నంబరు వేస్తే చాలు. -
ఐటీ రిటర్న్ లో తప్పులు.. మళ్లీ దాఖలు చేయొచ్చా?
నేను ఇటీవలే ఐటీఆర్ దాఖలు చేశాను. అయితే స్టాక్ మార్కెట్లో వచ్చిన నష్టాలను, ఇతర వనరుల నుంచి వచ్చిన ఆదాయం తదితర వివరాలను ఐటీఆర్‌లో పేర్కొనడం మరచిపోయాను. సవరించిన ఐటీఆర్‌ను మళ్లీ దాఖలు చేయవచ్చా? దీనికేమైనా గడువుందా ? -జగన్, హైదరాబాద్ మీరు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లో ఏ విషయాన్నైనా తప్పుగా పేర్కొన్నా, ఏవైనా లోటుపాట్లున్నాయని మీరు భావించినా, సవరణలతో మీరు మళ్లీ ఐటీఆర్‌ను దాఖలు చేయవచ్చు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను గడువు తేదీలోగా అంటే ఈ ఏడాది ఆగస్టు 5లోపు దాఖలు చేసివుంటేనే మీరు సవరణలతో కూడిన ఐటీఆర్‌ను దాఖలు చేయడానికి వీలుంటుంది. ఇలా సవరణలతో కూడిన ఐటీఆర్‌ను వచ్చే ఏడాది మార్చి 31లోగా సమర్పించాల్సి ఉంటుంది. ఆగస్టు 5లోపు ఏ విధానంలో ఐటీఆర్‌ను సమర్పించారో, అదే విధానంలో సవరించిన ఐటీఆర్‌ను దాఖలు చేయాలి. నేను గోల్డ్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను సావరిన్ గోల్డ్ బాండ్స్‌కు మార్చాలనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా? -ప్రశాంతి, విజయవాడ పెట్టుబడులకు సంబంధించి గోల్డ్ ఈటీఎఫ్‌లతో పోల్చితే సావరిన్ గోల్డ్ బాండ్స్ ఉత్తమమని చెప్పవచ్చు. ఈ పుత్తడి బాండ్లపై 2.75 శాతం వడ్డీ వస్తుంది. ప్రతి ఆర్నెల్లకొకసారి మీరు ఈ వడ్డీ అందుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లపై ఆయా సంస్థలు 1 శాతం వరకూ నిర్వహణ చార్జీలు వసూలు చేస్తాయి. గోల్డ్ బాండ్లపై అలాంటి చార్జీలు లేవు. గోల్డ్ బాండ్స్ పెట్టుబడుల ఉపసంహరణపై ఎలాంటి మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు. కానీ గోల్డ్ ఈటీఎఫ్‌లపై వచ్చే రాబడులపై స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ అంశాల దృష్ట్యా గోల్డ్ ఈటీఎఫ్‌ల కంటే కూడా సావరిన్ గోల్డ్ బాండ్స్ ఉత్తమమైనవని చెప్పవచ్చు. తగిన కేవైసీ(నో యువర్ కస్టమర్) డాక్యుమెంట్లు సమర్పించి బ్యాంక్‌లు, పోస్టాఫీసుల్లో మీరు గోల్డ్ బాండ్స్‌ను కొనుగోలు చేయవచ్చు. ఒక్కో బాండ్ విలువ ఒక గ్రామ్ బంగారంతో సమానంగా ఉంటుంది. చిన్న ఇన్వెస్టర్లు కూడా ఇన్వెస్ట్ చేయడానికి వీలుగా కనీస ఇన్వెస్ట్మెంట్ ఒక్క గ్రామ్‌కు తగ్గించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా మీరు 500 గ్రాముల విలువ వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ గోల్డ్ బాండ్ల కాలపరిమితి ఎనిమిది సంవత్సరాలు. ఐదేళ్ల తర్వాత ఈ బాండ్ల నుంచి వైదొలిగే ఆప్షన్ ఉంది. మీ అసలు ఇన్వెస్ట్‌మెంట్‌పై వార్షిక వడ్డీ 2.75 శాతంగా ఉంటుంది. వడ్డీని ఆరు నెలలకొకసారి చెల్లిస్తారు. ఈ బాండ్లు ఎక్స్చేంజీల్లో లిస్ట్ అవుతాయి. అంటే మెచ్యూరిటీకి ముందే మీకు డబ్బు అవసరమైన పక్షంలో మీరు సెకండరీ మార్కెట్లో ఈ బాండ్లను విక్రయించుకునే అవకాశముంది. అప్పటి మార్కెట్ ధర ప్రకారమే ఈ బాండ్లను విక్రయించుకోవచ్చు. ఈ బాండ్ల ఆధారంగా మీరు రుణాలు కూడా తీసుకోవచ్చు. ఈ బాండ్లలో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మెచ్యురిటీ కాలం వరకూ కొనసాగిస్తే మూలధన లాభాల పన్ను (క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్) మినహాయింపు లభిస్తుంది. మెచ్యూరిటీకి ముందే బాండ్లను బదిలీచేస్తే ఇండెక్సేషన్ ప్రయోజనాలు లభిస్తాయి. నేను అనుకోకుండా ఒక యులిప్(యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్)లో ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. ఈ రూ.3 లక్షల యులిప్ కాలపరిమితి 10 సంవత్సరాలు. తొలి ఏడాది ప్రీమియమ్ రూ.30,000 చెల్లించాను. ఈ పాలసీని రద్దు చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఎంత నష్టం వస్తుంది? -భవానీ శంకర్, విశాఖపట్టణం ఆకర్షణీయమైన కమీషన్ల కారణంగా పలువురు ఏజెంట్లు యునిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్)ను ఇన్వెస్టర్లకు విక్రయిస్తారు. ఈ పాలసీ తీసుకున్న 15 రోజుల వరకూ ఫ్రీ-లుక్ పీరియడ్ ఉంటుంది. ఈ కాలంలో మీరు వద్దనుకుంటే ఈ ప్లాన్‌ను రద్దు చేసుకోవచ్చు. ఈ 15 రోజుల కాలపరిమితి తీరిపోయింది కాబట్టి మీరు ఈ పాలసీని రద్దు చేసుకోలేరు. మీరు ఈ ప్లాన్‌ను సరెండర్ చేయవచ్చు. అయితే మీకు సొమ్ములు ఐదేళ్ల(ఈ ప్లాన్ల లాక్-ఇన్ పీరియడ్ ఐదేళ్లు కాబట్టి) తర్వాతనే అందుతాయి. అదీన్నూ ఈ ఐదు సంవత్సరాలకు సంబంధించిన అన్ని చార్జీలను మినహాయించుకొని మీకు మిగిలిన మొత్తం చెల్లిస్తారు. బహుశా మీరు చెల్లించిన ప్రీమియమ్ మొత్తం మీరు నష్టపోవచ్చు. భవిష్యత్తులో ఎప్పుడు కూడా బీమాను, ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కలగలపకండి. జీవిత బీమా కోసం పూర్తిగా టర్మ్ ఇన్సూరెన్స్ పాల సీలు తీసుకోవాలి. ఈ తరహా ప్లాన్లలో బీమా కవరేజీ అధికంగానూ, ప్రీమియమ్ తక్కువగానూ ఉంటుంది. ఇక ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్రజా భవిష్యనిధి(పీపీఎఫ్), మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. నాకు ఈమధ్య పెళ్లి అయింది. నా భార్య ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగం చేయడం లేదు. పెళ్లికి ముందే నేను నా పేరు మీద ఒక ప్రజా భవిష్య నిధి(పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్- పీపీఎఫ్) ఖాతా తెరిచాను. ఏడాదికి రూ.లక్షన్నర వరకూ ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను నా భార్య పేరు మీద మరో పీపీఎఫ్ ఖాతా తెరవవచ్చా? నా భార్యకు చెందిన పీపీఎఫ్ ఖాతాలో కూడా రూ. లక్షన్నర వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చా? ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై నాకేమైనా పన్ను ప్రయోజనాలు లభిస్తాయా? -నాని, గుంటూరు మీరు మీ భార్య పేరు మీద పీపీఎఫ్ ఖాతా తెరవవచ్చు. ఈ ఖాతాలో మీరు డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. కానీ ఆమెకు పన్ను వర్తించే ఆదాయమేదీ లేనందున ఈ పీపీఎఫ్ ఖాతాపై ఆమెకు ఎలాంటి పన్ను ప్రయోజనాలు లభించవు. అంతే కాకుండా ఆమె పీపీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీకు ఎలాంటి పన్ను ప్రయోజనాలు లభించవు. -
ట్యాక్స్ రిటర్న్స్ ఇక సులభం..
న్యూఢిల్లీ: పన్ను రిటర్నుల ఈ-వెరిఫికేషన్ ప్రక్రియను సరళతరం చేసే దిశగా ఆదాయ పన్ను విభాగం చర్యలు తీసుకుంది. బ్యాంకు ఖాతాలు, డీమ్యాట్ ఖాతాల వివరాలను సమర్పించడం ద్వారా కూడా ఐటీఆర్‌ల ఈ-వెరిఫికేషన్ కోడ్లను పొందే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. పన్ను చెల్లిం పుదారు తన బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబరు వివరాలను ముందస్తుగా సమర్పిస్తే వాటిని ధ్రువీకరించుకున్న తర్వాత కోడ్లను ఈ-ఫైలింగ్ పోర్టల్ ఆయా చెల్లింపుదారుల ఫోన్ నంబరు, ఈమెయిల్‌కు పంపుతుంది. డీమ్యాట్ విషయంలో పాన్ నంబరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ బ్యాం కింగ్, ఈమెయిల్ లేదా ఆధార్ నంబరు ద్వారా వన్ టైమ్ పాస్‌వర్డ్‌ను పొంది ఐటీఆర్‌లను ఎలక్ట్రానిక్ పద్ధతిలో పరిశీలించుకునే వీలు ఉంది. ఐటీ విభాగం. బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్‌కి పేపరు రూపంలో అక్నాలెడ్జ్మెంటు పంపే విధానానికి పూర్తిగా స్వస్తి చెప్పే దిశగా ఐటీ విభాగం ఈ చర్యలు చేపడుతోంది.