breaking news
Tammy Beaumont
-
ఇంగ్లండ్ ఓపెనర్ల విధ్వంసకర శతకాలు
వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టుతో ఇవాళ (మే 30) జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్లు ట్యామీ బేమౌంట్, యామీ జోన్స్ చెలరేగిపోయారు. ఈ ఇద్దరూ విధ్వంసకర శతకాలతో విరుచుకుపడ్డారు. ఈ జోడీ తొలి వికెట్‌కు 222 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పింది. బేమౌంట్ 107 (104 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు), యామీ జోన్స్ 122 పరుగులు (121 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్) చేసి ఔటయ్యారు. 41 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 262/3గా ఉంది. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (8), సోఫియా డంక్లీ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది.కాగా, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో టీ20 సిరీస్ ఇదివరకే ముగియగా.. వన్డే సిరీస్ ఇవాళ ప్రారంభమైంది. టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్.. వన్డే సిరీస్‌ను కూడా అదే తరహాలో ముగించాలని భావిస్తుంది. మే 30, జూన్ 4, 7 తేదీల్లో మూడు వన్డేలు వేర్వేరు వేదికల్లో జరుగనున్నాయి. -
T20 WC 2024: ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. సీనియర్లపై వేటు
మహిళల టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ కోసం ఇంగ్లండ్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. యూఏఈ వేదికగా జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్ కోసం ఎంపిక చేసిన పదిహేను మంది సభ్యుల వివరాలను మంగళవారం వెల్లడించింది. వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే జట్టులో ముగ్గురు ప్లేయర్లకు తొలిసారిగా చోటిచ్చింది.సీనియర్లపై వేటుహీథర్ నైట్ కెప్టెన్సీలోని ఈ టీమ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ బెస్ హీత్, ఆల్‌రౌండర్ ఫ్రేయా కెంప్, రైటార్మ్ పేసర్ డేనియెల్ గిబ్సన్లకు జట్టులో స్థానం కల్పించింది. గత ఎడిషన్‌లో ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్లుగా ఉన్న వీరు ఈసారి ప్రధాన జట్టులోకి రావడం విశేషం. అయితే, అనూహ్యంగా సీనియర్లు కేట్ క్రాస్, టామీ బీమౌంట్లపై వేటు పడింది. కాగా ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ మహిళా టీ20 జట్టు సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది. గత నాలుగు ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ అద్భుత విజయాలు సాధించింది.సూపర్ ఫామ్‌లో ఇంగ్లండ్ఆఖరిగా.. న్యూజిలాండ్‌తో రెండు, ఇండియా, పాకిస్తాన్‌తో ఒక్కో మ్యాచ్‌లో గెలుపు బావుటా ఎగురవేసింది. ఈ క్రమంలో వరల్డ్‌కప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఇంగ్లండ్ ఈసారి బరిలోకి దిగనుంది. ఇక జట్టు ప్రకటన సందర్భంగా హెడ్‌కోచ్ జాన్ లూయీస్ మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన, యువ ఆటగాళ్లతో తమ జట్టు సమతూకంగా ఉందని పేర్కొన్నాడు.ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకే పెద్దపీట వేశామని.. ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ కొందరిపై వేటు పడిందన్న లూయీస్.. యూఏఈ పరిస్థితులకు తగ్గట్లుగా రాణించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని తెలిపాడు. వరల్డ్‌కప్ అంటేనే ప్రత్యేకమైన ఈవెంట్ అని.. ఇందుకు తాము సన్నద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. కాగా గత ఎడిషన్‌లో ఇంగ్లండ్ మహిళా జట్టు గ్రూప్ స్టేజ్‌లో అజేయంగా నిలిచింది.ముందుగానే అబుదాబికి హీథర్ బృందంఅయితే, ఆతిథ్య సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్లో ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓడి ఇంటిబాట పట్టింది. ఈసారి ఆ తప్పులను పునరావృతం చేయకుండా ముందడుగు వేయాలని పట్టుదలగా ఉంది. కాగా మహిళా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీని బంగ్లాదేశ్‌లో నిర్వహించాల్సి ఉండగా.. అక్కడ అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో వేదికను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు మార్చారు.అక్టోబరు 3 నుంచి ఈ ఈవెంట్ ఆరంభం కానుండగా.. ఇంగ్లండ్ సెప్టెంబరు 13- 14 వరకు అబుదాబిలో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. షార్జా వేదికగా అక్టోబరు 5న బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ద్వారా ప్రపంచకప్-2024 ప్రయాణం మొదలుపెట్టనుంది.టీ20 ప్రపంచకప్-2024 కోసం ఇంగ్లండ్ మహిళా జట్టుహీథర్ నైట్ (కెప్టెన్), లారెన్ బెల్, మాయా బౌచియర్, ఆలిస్ క్యాప్సే, చార్లీ డీన్, సోఫియా డంక్లే, సోఫీ ఎక్లెస్టోన్, డేనియల్ గిబ్సన్, సారా గ్లెన్, బెస్ హీత్, అమీ జోన్స్, ఫ్రేయా కెంప్, నాట్ స్కివర్-బ్రంట్, లిన్సే స్మిత్, డానీ వ్యాట్.చదవండి: యూఏఈలో అక్టోబర్ 3 నుంచి 20 వరకు టోర్నీ టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ప్రకటన