అన్నాడీఎంకే అభ్యర్థికి మద్దతుగా సినీనటుని ప్రచారం
ప్రచారం చేస్తున్న రామరాజన్
హొసూరు: జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలో అన్నాడీఎంకే అభ్యర్థి గోవిందరాజుకు మద్దతుగా తమిళ సినీనటుడు రామరాజన్ శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. క్రిష్ణగిరి పురవధుల్లో జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ ఓటర్లనుద్దేశించి మాట్లాడారు. జయలలిత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. రాష్ట్రం ప్రశాంత వనంగా ఉందని, రాష్ట్ర అభివృద్ధికి జయలలిత పాటుపడ్డారని రామరాజన్ పేర్కొన్నారు. అన్నాడీఎంకే నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.