breaking news
talkie part complete
-
మూడు పాటలు.. రెండు ఫైట్లు
ప్రేమ కబుర్లకి ఫుల్స్టాప్ పెట్టి ఫైట్స్ చేయడానికి, పాటలు పాడటానికి రెడీ అవుతున్నారు అఖిల్. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘మిస్టర్ మజ్ను’. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఎయిర్‌పోర్ట్‌లో అఖిల్, నిధిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ సినిమా టాకీ పార్ట్ బుధవారంతో పూర్తవుతుందని సమాచారం. అలాగే ఈ సినిమాలో ఆరు పాటలు ఉండగా మూడు పాటల చిత్రీకరణ పూర్తయింది. మరో మూడు పాటలు, రెండు ఫైట్లు మినహా సినిమా మొత్తం పూర్తయింది. -
బాహుబలి షూటింగ్ దాదాపు పూర్తి
ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కతున్న 'బాహుబలి' సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలి ఉండటంతో వాటిని చిత్ర యూనిట్ మొదలుపెట్టింది. ప్రధానంగా విజువల్ ఎఫెక్ట్‌ల మీద ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. రెండు పాటలు తప్ప.. మిగిలిన సినిమా షూటింగ్ పూర్తయిందని, మిగిలిన షూటింగ్‌తో పాటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయని సినిమా వర్గాలు తెలిపాయి. సినిమాలో నటులంతా తెలుగు, తమిళ భాషలకు సంబంధించి డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. ఈ సినిమాకు సంబంధించిన శబ్దాలను డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీలో మిక్స్ చేస్తున్నారు. ఈ పని ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతుంది. సినిమాకు సంబంధించిన మరో కీలకాంశం వీఎఫ్ఎక్స్. ముందునుంచి వీఎఫ్ఎక్స్ను దృష్టిలో పెట్టుకునే డిజైనింగ్ చేశారు. జాతీయ అవార్డు విజేత అయిన శ్రీనివాస మోహన్ నేతృత్వంలో వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయని, దేశంలోని ఆరు స్టూడియోలతో పాటు హాంకాంగ్, అమెరికాల లోనూ ఈ పనులు చేస్తున్నామని చెప్పారు. ఒకే రాజ్యానికి చెందిన ఇద్దరు సోదరుల మధ్య శత్రుత్వానికి సంబంధించిన కథ ఇది. ప్రభాస్, దగ్గుబాటి రాణా పోటాపోటీగా నటించారు. అనుష్క కూడా ఇందులో చాలా భిన్నమైన పాత్ర పోషించిందని అంటున్నారు.