breaking news
T. Jivanreddi
-
ప్రజలపై దాడి
సీఎల్పీ ఉపనాయకుడు జీవన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: జేఏసీ చైర్మన్ కోదండరాంపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న దాడిని తెలంగాణ ప్రజల పై దాడిగా సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి అభివర్ణించారు.మంగళవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కోదండరాంను చూసి టీఆర్ఎస్ ఉలిక్కి పడుతోందన్నారు. ఆయనపై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సరికాదన్నారు. ఇవి తెలంగాణవాదులను, ప్రజలను అవమాన పర్చడమేనన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాన్నే కోదండరాం చెప్పారన్నారు. వాటిని సలహా లు, సూచనలుగా తీసుకుని ప్రభుత్వ విధానాలను మార్చుకోవాలన్నారు. రాజకీయాలకు అతీతంగా కోదండరాంను జేఏసీకి చైర్మన్‌గా ఎన్నిక చేసుకున్నామని, సకల జనుల సమ్మె వంటి పోరాటాలతోనే తెలంగాణ వచ్చిందన్నారు. టీఆర్ఎస్కు, ప్రభుత్వానికి టీజేఏసీ అనుకూలంగా నడవాలా అని ప్రశ్నించారు. ఆయన ఉన్న మాటంటే ఉలుకెందుకన్నారు. -
అసెంబ్లీ మీడియా పాయింట్
సమస్య తీవ్రతపై సీఎం నిర్లక్ష్యం రైతుల ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సమస్యను దాటవేస్తూ రైతాంగాన్ని కించపరుస్తున్నారు. ఏకమొత్తంగా రుణమాఫీ వర్తింపజేయడంతోపాటు, వ్యవసాయ సంక్షోభం, ఆత్మహత్యల నివారణ, గిట్టుబాటు ధరల కల్పన, బ్యాంకర్ల ద్వారా కొత్త రుణాలిప్పించేందుకు చర్యలు తీసుకోవాలి. దీర్ఘకాలిక రుణాలపై వడ్డీ మాఫీ చేయాలి. నిజాంషుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే టేకోవర్ చేసి రైతులకు బకాయిలు చెల్లించాలి. - టి.జీవన్‌రెడ్డి, సీఎల్పీ ఉపనేత గ్రామసభల ద్వారా ఆత్మహత్యల నిర్ధారణ ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్యను గ్రామసభల ద్వారా నిర్ధారించాలి. రైతుల సమస్యలను చర్చించకుండానే సభను అర్ధంతరంగా వాయిదా వేయడం అన్యాయం. ప్రభుత్వం ఏడాదిన్నరగా బాధ్యతను విస్మరించడంతోనే 1,300 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రుణమాఫీ చేసే వరకు మా పోరాటం ఆగదు. - రవీంద్రకుమార్, సీపీఐ శాసనసభాపక్ష నేత ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణ జరపాలి వరంగల్ జిల్లా తాడ్వాయిలో జరిగిన శ్రుతి, సాగర్ల బూటకపు ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణ జరిపించాలి. చిత్రవధ చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ప్రజాసంఘాల నేతలను,మేధావులను బలవంతంగా అరెస్టు చేసి గృహనిర్బంధం చేయడం దారుణం. - సున్నం రాజయ్య, సీపీఎం కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి సమ్మె సందర్భంగా విధుల్లో నుంచి తొలగించిన 1200 మంది జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలి. జీతాలు పెంచి పొట్ట నింపమని ఆందోళన చేస్తే వారి పొట్టకొట్టడం దారుణం. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం సంధించడం న్యాయం కాదు. బంగారు తెలంగాణలో కార్మికుల భవిష్యత్‌ను అంధకారం చేయొద్దు. - డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ శాసనసభాపక్ష నేత రుణమాఫీ జరిగే వరకు పోరాటం వందశాతం రుణమాఫీ జరిగే వరకు మా పోరాటం ఆగదు. రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే తక్షణం పూర్తిగా రుణాలు మాఫీ చేయాలి. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలుచేయాలి. ఇచ్చినమాట నిలపుకోకుండా ప్రభుత్వం అర్ధంతరంగా సభను వాయిదా వేయడం దారుణం. - రామ్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రీ డిజైన్‌పై కలర్ సినిమా చూపిస్తాం -ఇరిగేషన్ ప్రాజెక్టుల రీ డిజైన్‌పై ప్రతిపక్ష సభ్యులకు శాసనసభలోనే రెండు గంటల పాటు సీఎం కేసీఆర్ కలర్ సినిమా చూపిస్తారు. ఎందుకు డిజైన్ మార్చాల్సి వచ్చిందో విశదీకరించి చెబుతారు. రైతుల ఆత్మహత్యకు గత ఇరవై ఏళ్ల ఆర్థిక పరిస్థితే కారణం. రుణమాఫీపై సీఎం స్పష్టమైన సమాధానం ఇచ్చినా ప్రతిపక్షాల సభ్యులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. విద్యుత్ సంక్షోభానికి గత పాలకులే కారణం. - జీవన్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏకమొత్తంలో రుణమాఫీ చేయాలి రైతులందరికీ వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద ఒకేసారి రుణమాఫీ చేయాలి. ప్రభుత్వం ఈ విషయంలో అనవసర కాలయాపన చేయడంతో 1400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతుల సంక్షేమంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు.రుణమాఫీ,కరువు ప్రాంతాలను ప్రకటించే విషయంలో సర్కారు వైఫల్యం చెందింది.పంటల భీమా పథకం రైతులకు ఉపయోగపడడంలేదు. సభలో రైతుల సమస్యలపై చర్చించేందుకు అవకాశం ఇవ్వకుండా అర్ధంతరంగా వాయిదా వేశారు. - పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ పక్షనేత -
ఒకేసారి మాఫీ చేసుంటే ఆత్మహత్యలుండేవి కావు
-
ఒకేసారి మాఫీ చేసుంటే ఆత్మహత్యలుండేవి కావు
- అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చలో జీవన్‌రెడ్డి - లక్ష కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రం.. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.60 కోట్లు ఇవ్వలేదా అని ప్రశ్న సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఏకమొత్తంగా మాఫీ చేసి ఉంటే రైతు ఆత్మహత్యలు ఉండేవి కావని కాంగ్రెస్‌పక్ష ఉపనేత టి.జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. రుణమాఫీని దశలవారీగా అమలు చేసి రైతులను సమస్యల్లోకి నెట్టేశారని విమర్శించారు. ఇప్పటికైనా మిగిలిన రుణాలను ఒకేమారు మాఫీ చేయాలని కోరారు. ధనిక రాష్ట్రమంటూ గొప్పలకు పోయి కరువు మండలాల ప్రకటనపై ఆలస్యం చేయడం మంచిపద్ధతి కాదన్నారు. దీనివల్ల రుణాల రీషెడ్యూల్ జరగక రైతులకు సమస్యలొస్తున్నాయని వాపోయారు. మంగళవారం రుతుపవనాల వైఫల్యం, రైతుల సంక్షేమంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో జీవన్‌రెడ్డి మాట్లాడారు. గతఏడాది జూన్, జూలైలో ఖరీఫ్ ఆరంభమైతే రుణమాఫీపై సెప్టెంబర్ వరకు తన విధానాన్ని ప్రభుత్వం ప్రకటిం చలేకపోయిందని, అదీ కేవలం 25 శాతం రుణాలను మాత్రమే మాఫీ చేయడంతో ఏ ఒక్క రైతుకు రూ.25 వేలకు మించి రుణం పొందే అవకాశం దక్కలేదన్నారు. ప్రభుత్వం బ్యాంకులకు సకాలంలో వడ్డీలు కట్టకపోవడంతో వారు సైతం రుణాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారన్నారు. ‘పంటలు నష్టపోయి, పెట్టుబడులు సమకూర్చుకోలేక, రుణమాఫీ పొందలేక, కుటుంబ సమస్యలు పెరిగి రైతులు ఆత్మహ త్యలు చేసుకుంటున్నారు. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం 1,400 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిని ఆదుకుంటే ప్రభుత్వానికి రూ.60-70కోట్లు ఖర్చవుతాయి. లక్ష కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఈ మాత్రం వెచ్చించలేదా?’ అని ఆయన ప్రశ్నించారు. గతంలో పంటల దిగుబడి తగ్గినప్పుడు ప్రభుత్వాలు బోనస్ ప్రకటించాయని జీవన్‌రెడ్డి గుర్తుచేశారు. 2004-05, 2005-06లో వరిపై కేంద్రం నిర్ణయించిన ధరకు అప్పటి ప్రభుత్వం రూ.50 బోనస్‌గా ప్రకటించిందని చెప్పారు. సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు రూ.5వేల ప్రోత్సాహకం సైతం అందజేశారన్నారు. వరి, మొక్కజొన్నకు రూ.200, పత్తి పంటకు రూ.500 బోనస్ ఇవ్వాలని కోరారు. గత ఏడాది ఈదురుగాలులతో నష్టపోయిన పం టలకు ఇంతవరకూ ప్రభుత్వం రూపాయి చెల్లించలేదని, ఉద్యానవన పంటలకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపుల్లోనూ జాప్యం చేస్తున్నారని విమర్శించారు. చెరుకు రైతుల బకాయిలు చెల్లించేందుకు మార్కెట్ స్థిరీకరణ నిధి నుంచి నిధులు విడుదల చేయాలన్నారు. రైతులకిస్తే తప్పేంటి? ఇక ట్రాక్టర్ కలిగి ఉన్నాడనే కారణంతో రైతులను ఆసరా పింఛన్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని, ఇది సమంజసం కాదన్నారు. డెంగీ వంటి రోగాలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, రైతులందరికీ ఆరోగ్యకార్డులు ఇవ్వాలన్నరు. ఉద్యోగికి వచ్చే ఆదాయంలో 10శాతం ఆదాయం లేని రైతుకు ఆరోగ్యకార్డు ఇస్తే తప్పేంటన్నారు.