‘ఉపాధి’ పనుల్లో అవినీతి
సారంగాపూర్, న్యూస్‌లైన్ :
మండలంలో 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద నిర్వహించిన పనుల్లో అవినీతి, అక్రమాలు వెలుగుచూశారుు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆదివారం ఉపాధిహామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. పలు గ్రామాల్లో పథకం పనుల్లో బినామీ, తప్పుడు మస్టర్లు, పనులు చేపట్టకుండానే బిల్లుల డ్రా వంటి అక్రమాలు వెలుగుచూశారుు. 18 గ్రామ పంచాయతీల్లో రూ.2.40 కోట్ల విలువైన పనులు జరగగా ఇందులో రూ.9,18,638 నిధులు పక్కదారి పట్టినట్లు సామాజిక తనిఖీ బృందాలు వెల్లడించారుు.
కంకెట గ్రామంలో బినామీ పేర్లు, పనులు చేయకున్నా చేసినట్లుగా సృష్టించి మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్, టీఏ, బీపీఎంలు కలిసి రూ.8,68,791 దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలింది. ఈ మొత్తాన్ని సదరు సిబ్బంది నుంచి రికవరీ చేయాలని అదనపు ప్రాజెక్టు డెరైక్టర్ గణేశ్ ఆదేశించారు. ఎఫ్ఏను విధుల్లోంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కంకెట గ్రామస్తులు వేదిక వద్దకు చేరుకుని ఏపీడీతో వాగ్వాదానికి దిగారు. ఎఫ్‌ఏకు ఎలాంటి సంబంధంలేదని, మేట్లు ఏపీవో సహాయంతో నిధులు మింగారని పేర్కొన్నారు. ఎఫ్‌ఏతో చర్చింకుండానే ఏపీవో దశరథ్ మేట్లకు పని బాధ్యతలు అప్పగించారని ఫిర్యాదు చేశారు. మేట్లకు అండగా ఉన్న ఏపీవోను తొలగించాలని కోరారు.
స్పందించిన ఏపీడీ విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటామని చెప్పారు. డిమాండ్ మేరకు కూలీలకు పనికల్పించలేదని కంకెట, గోపాల్పేట్, స్వర్ణ, ప్యారమూర్, కౌట్ల(బి), మలక్‌చించోలి, ఆలూరు, తాండ్ర(జి), చించోలి(బి), జామ్ గ్రామాల ఎఫ్‌ఏలకు రూ.3 వేల చొప్పున జరిమానా విధించారు. చించోలి(బి)లో ఎఫ్ఏ, టీఏల నుంచి రూ.12,585, వంజర్ గ్రామంలో ఎఫ్ఏ నుంచి రూ.10,708, ప్యారమూర్ ఎఫ్ఏ, మేట్ల నుంచి రూ.5401, మలక్‌చించోలి ఎఫ్ఏ మరుగుదొడ్లు నిర్మించకున్నా బిల్లులు ఇచ్చారని తేలడంతో అతడి నుంచి రూ.26,039 రికవరీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. డీఆర్డీఏ ఏపీడీ గజ్జారాం, క్లస్టర్ వెంకటేశ్వర్లు, అంబుడ్స్‌మన్ నాగోరావు, తహశీల్దార్ గంగాధర్, ఎంపీడీవో శేఖర్, ఎఫ్ఎస్వో శ్రీదేవి, ఏపీవో దశరథ్ పాల్గొన్నారు.