breaking news
swornin
-
ఆరోసారి రాజ్యసభకు..
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు శుక్రవారం ఆయనచేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాజస్తాన్ నుంచి మన్మోహన్సింగ్ తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. పెద్దల సభకు ఆయన ఎన్నికవడం ఇది ఆరవసారి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, థావర్ చంద్ గెహ్లోత్, గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, అహ్మద్ పటేల్, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్‌తో పాటు కొంతమంది బీజేపీ నాయకులు కూడా హాజరయ్యారు. మన్మోహన్ ఇంతకుముందు 28 సంవత్సరాల పాటు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. -
ముహూర్తం నేడే...
కోస్గి (కొడంగల్) : అటు ప్రజలు.. ఇటు పల్లెలను అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఉన్న నేతలు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది.. సరిగ్గా ఆరు నెలల అనంతరం గ్రామపంచాయతీల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పాలన మొదలుకానుంది.. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్, పాలకవర్గాలు శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నాయి. ఇదే రోజు పాలకమండలి తొలి సమావేశం జరగనుంది.. ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడంతో పాటు మామిడి ఆకుల తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు.. స్వపరిపాలన నినాదంతో ప్రజల ఆకాంక్ష మేరకు కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీల్లో తొలిసారి పాలన మొదలుకానుండడంతో ఆయా పంచాయతీల్లో సందడి నెలకొంది. 733.. 721.. 719 జిల్లాలో గతంలో 468 గ్రామపంచాయతీ ఉండేది. స్వపరిపాలన నినాదంతో కొన్నేళ్లుగా కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు డిమాండ్ ఉంది. దీంతో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందే జిల్లాలోని 265 ఆవాసాలను కొత్త గ్రామపంచాయతీలుగా ఏర్పాటుచేసింది. ఇందులో 107 గిరిజన తండాలు ఉన్నాయి. ఈ మేరకు మొత్తం గ్రామపంచాయతీల సంఖ్య 733కు చేరగా.. ఇందులో 12 జీపీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. దీంతో జీపీల సంక్య 721కి చేరింది. అయితే, జడ్చర్ల మండలంలోని బండమీదిపల్లి, శంకరాయపల్లి తండాల పాలకవర్గాల గడువు ఇంకా ముగియలేదు. ఫలితంగా జిల్లాలోని 719 గ్రామపంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. మూడు విడతలుగా ఎన్నికలు గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ జనవరి 1వ తేదీన వెల్లడించింది. ఈ మేరకు మూడో విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించగా తొలి విడత జనవరి 21న 10 మండలాల్లోని 249 గ్రామపంచాయతీలు, 2,274 వార్డుల్లో, రెండో విడతగా జనవరి 25న ఏడు మండలాల్లోని 243 గ్రామపంచాయతీలు, 2,068 వార్డుల్లో పోలింగ్ నిర్వహించారు. ఇక మూడో విడతగా 30వ తేదీన ఎనిమిది మండలాల్లోని 227 గ్రామపంచాయతీలు, 2,024 వార్డుల్లో పోలింగ్, లెక్కింపు జరిపి విజేతల వివరాలను ప్రకటించారు. టీఆర్ఎస్ హవా అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలు కావడం.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలే విజయం సాధించిన నేపథ్యంలో వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగా మూడు విడతలుగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ జీపీలను ఏకగ్రీవం చేసేందుకు యత్నించారు. అలా వారి కృషి ఫలించి మొత్తంగా 126 జీపీల కార్యవర్గాలను ప్రజలు ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నారు. మిగతా వాటికి మాత్రం మూడు విడతలుగా పోలింగ్ జరిగింది. మొత్తంగా పరిశీలిస్తే ఏకగ్రీవమైన వాటితో కలిపి టీఆర్ఎస్ మద్దతుదారులు 503 పంచాయతీల్లో విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ మద్దతుదారులు 71 స్థానాల్లో గెలుపొందగా, ఇతరులు 47 స్థానాలను, స్వతంత్రులు 98 స్థానాలను కైవసం చేసుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు తమ పట్టు నిలుపుకున్నట్లయింది. ఆరు నెలల అనంతరం అంతకుముందు ఉన్న గ్రామపంచాయతీల పాలకవర్గాల గడువు గత ఏడాది ఆగస్టు 2న ముగిసింది. అప్పటి నుంచి వివిధ కారణాలతో ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇక డిసెంబర్ మొదటి అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. టీఆర్ఎస్ రెండోసారి అధికారం చేజిక్కించుకుంది. ఆ వెంటనే హైకోర్టు ఆదేశాల మేరకు గ్రామపంచాయతీల ఎన్నికలు జరిగాయి. మూడు విడతలుగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ జనవరి 30న ముగిసింది. ఇక 2వ తేదీ శనివారం అని గ్రామపంచాయతీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారానికి ముహూర్తంగా నిర్ణయించింది. అంటే సరిగ్గా ఆరు నెలల తర్వాత గ్రామాల్లో ప్రజాప్రతినిధుల పాలన మొదలుకానుంది. ఇందులో 265 కొత్త పంచాయతీలు ఉండడంతో అక్కడి ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. -
పుతిన్ నాలుగోసారి..
మాస్కో: రష్యాపై సంపూర్ణమైన పట్టు పెంచుకున్న వ్లాదిమిర్ పుతిన్ (65) మరో ఆరేళ్లపాటు అధ్యక్షబాధ్యతల్లో కొనసాగనున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం నాలుగోసారి దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొన్నటి మార్చిలో రష్యాలో జరిగిన ఎన్నికల్లో పుతిన్‌కు 77 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన 2024 వరకు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించనున్నారు. దీటైన ప్రత్యర్థి, విపక్షనేత నావన్లీపై అవినీతి ఆరోపణలు మోపటం ద్వారా ఎన్నికల బరిలో దిగకుండా చేయటంతో.. పుతిన్ ఎన్నిక ఏకపక్షమైంది. 1999 నుంచి రష్యా రాజకీయాలను పుతిన్ నియంత్రిస్తున్నారు. జోసెఫ్ స్టాలిన్ తర్వాత ఎక్కువకాలం రష్యా అధ్యక్షుడిగా ఉన్న రికార్డును తనపేర రాసుకునే దిశగా దూసుకెళ్తున్నారు. నా బాధ్యత పెరిగింది దేశ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజితం చేస్తానని ప్రమాణ స్వీకారం సందర్భంగా పుతిన్ పేర్కొన్నారు. ‘రష్యా వర్తమానం, భవిష్యత్తు కోసం ఏదైనా చేయటం నా బాధ్యత. నా జీవిత లక్ష్యం కూడా. నాపై నమ్మకంతో విజయాన్నందించిన రష్యన్లకు కృతజ్ఞతలు. దీంతో మన దేశ గౌరవం పెరిగింది. దేశాభివృద్ధిలో నా బాధ్యత మరింత పెరిగిందని బలంగా విశ్వసిస్తున్నాను. దేశాధ్యక్షుడిగా రష్యా కీర్తి, బలం, సుసంపన్నత రెట్టింపయ్యేలా చిత్తశుద్ధితో పనిచేస్తాను’ అని రష్యా రాజ్యాంగంపై పుతిన్ ప్రమాణం చేశారు. క్రెమ్లిన్ పాలెస్ కాంప్లెక్స్‌లోని ఆర్నెట్ ఆండ్రియేవ్ హాల్లో ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది. విపక్షాల ఆందోళనలు పుతిన్ విజయంపై విపక్ష నేత అలెక్సీ నావన్లీ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో నావన్లీ సహా దేశవ్యాప్తంగా 1600 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులను యూరోపియన్ యూనియన్ తీవ్రంగా ఖండించింది. -
'మా' అధ్యక్షుడిగా రాజేంద్రుడు