breaking news
Swami vivekanandudu
-
సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలి
కథలాపూర్(వేములవాడ): దేశ సంస్కృతిని ప్రపంచదేశాలు ప్రశంసిస్తున్నాయని, హిందు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుందామని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. మంగళవారం కథలాపూర్ మండలంలో భజరంగ్‌దళ్ కార్యకర్తల ఆధ్వర్యంలో వీరహనుమాన్ విజయయాత్ర నిర్వహించారు. అంతకుముందు కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. వివేకానందుడు దేశం గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలలు చాటిచెప్పారని, ఆయన దేశంలో జన్మించడం గర్వకారణని పేర్కొన్నారు. హిందు ధర్మం సైన్స్‌తో ముడిపడి ఉందన్నారు. విభిన్న భాషలు మాట్లాడేవారు దేశంలో ఉన్నారని, రాముడి పాలనను ఆదర్శంగా తీసుకోవడంతో ధర్మం, న్యాయం ఆచరిస్తున్నారని పేర్కొన్నారు. ఆంజనేయస్వామి తన గురువు అయిన రాముడి కోసం ఎన్నో త్యాగాలు చేశారని, వారి చరిత్రను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హిందు ధర్మం అన్ని వర్గాలవారిని, మతా లవారిని సమానంగా ఆదరిస్తుందన్నారు. అనంతరం భజరంగ్‌దళ్ కార్యకర్తలు మండలకేంద్రం నుంచి భూషణరావుపేట, చింతకుంట, దుంపేట, పోసానిపేట, తాండ్య్రాల గ్రామాల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో హనుమాన్దీక్షాపరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
ఆదర్శనీయుడు వివేకానందుడు
పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : స్వామి వివేకానందుడి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని యువత అన్ని రంగాల్లో ముందుకు పోవాలని పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కె.తారక రామారావు అన్నారు. స్వామి వివేకానంద 150 జయంత్యుత్సవాలను పురస్కరించుకుని దోమలగూడ రామకృష్ణమఠంలో జరుగనున్న జాతీయ యువజన సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వివేకానందుడి జీవితం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రపంచం మొత్తం వృద్ధులను మోస్తుంటే భారత్ మాత్రం యువకళను సంతరించుకుంటుందని అన్నారు. ఈ కార్యక్ర మంలో రామకృష్ణమఠం అధ్యక్షుడు స్వామి జ్ఞానదానంద,బేలూరు మఠం రామకృష్ణ మిషన్ వివేకానంద యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ స్వామి ఆత్మ ప్రియానంద, మఠం అసిసెంటంట్ సెక్రటరీ స్వామి బోధశరణానంద తదితరులు పాల్గొన్నారు.