breaking news
swami swaroopanandendra
-
విశాఖ తీరంలో కుంభాభిషేకం
-
గోవధను నిషేధించాలన్న పోరాటం ఫలించింది
► కేంద్రం నిర్ణయంపై స్పందించిన శారదపీఠాధిపతి విశాఖపట్నం: దేశంలో గోవధను నిషేధిస్తు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విశాఖ శారద పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి స్పందించారు. గోవధను నిషేధించాలని ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పోరాటం ఫలించిందన్నారు. కేంద్రం తీసుకున్న ఈనిర్ణయం భారతీయుల హృదయాల్లో ఆనందాన్ని నింపిందని, తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం ఎన్నో ప్రభుత్వాలు మారినా గోవధపై సరైన నిర్ణయం తీసుకోకపోవడం దరదృష్టకరమన్నారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లైన తర్వాతైనా ప్రధాని మోడి గొప్ప నిర్ణయం తీసున్నారన్నారు. మూడేళ్ల క్రితం కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే గోవధ నిషేధం జరుగుతుందని తాము ఆకాంక్షినట్లు పేర్కొన్నారు. దేశ ప్రజలు గోవును కులమతాలకు అతీతంగా పూజిస్తారని, తల్లిగా, ఇంటి మహాలక్ష్మిగా కొలుస్తారని తెలిపారు. కేవలం ఇది మాటలకే పరిమితం కాకుండా సవరణలకు వీలులేని విధంగా చట్టాలను తీసుకురావాలని శారదాపీఠం తరపున లేఖ రాయనున్నట్లు స్వరూపానందేంద్ర సరస్వతి తెలియచేశారు.