breaking news
Survived childrens
-
బ్రేవ్ గర్ల్..! అడవిలో తప్పిపోయి.. ధైర్యంగా రాత్రంతా చలిలోనే..
దట్టమైన వాషింగ్టన్ అడవుల్లో పదేళ్ల చిన్నారి. ఎక్కలేని కొండలు. క్రూర మృగాల భయం. వీటన్నింటిని మించి వేళ్లు వంకర్లు పోయేంత చలి. ఇన్ని ప్రతికూల పరిస్థితులను దాటుకుని 24 గంటలపాటు నిలవగలిగింది ఆ చిన్నారి. అటవీ ప్రాంతంలో నిర్వహించిన ఫ్యామ్లీ గ్యాధరింగ్(కుటుంబ సమ్మేళనం)మీటింగ్లో తప్పిపోయిన చిన్నారి ఎలా చివరకు తన కుటుంబాన్ని చేరుకుంది? అడవిలో తాను ఎదుర్కొన్న సవాళ్లేంటో వివరించింది. అలా తప్పిపోయి.. శుంగ్లా మష్వానీ(10) కుటుంబం ఆఫ్గానిస్థాన్కు చెందింది. రెండేళ్ల క్రితమే వారు వాషింగ్టన్లో స్థిరపడ్డారు. వేరు వేరు ప్రదేశాల్లో ఉండే 20 మంది కుటుంబ సభ్యులు ఆదివారం రోజున ఫిష్ లేక్ రోడ్డులోని క్యాథడ్రల్ పాస్ ట్రైల్హెడ్ వద్ద కలుసుకున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం భోజనం చేయడానికి క్లీ ఈలమ్ నదిపై ఉన్న వంతెన వెంట నడుస్తున్నారు. అప్పుడు శుంగ్లా తప్పిపోయినట్లు గుర్తించి చుట్టుపక్కల వెతికారు. కానీ ప్రయోజనం లేకపోయింది. రాత్రంతా అడవిలోనే.. అయితే.. తప్పిపోయిన శుంగ్లాకు ఎంతసేపటికీ వారు నడిచిన వంతెన కనిపించలేదట. వెతికే కొద్ది తనవారికి తాను దూరమైనట్లు గుర్తించిన ఆ చిన్నారి.. ఎంతో ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని ప్రదర్శించింది. కొండలను దాటుతూ.. నది వెంటే నడుచుకుంటూ వెళ్లడం సరైన విధానమని గుర్తించినట్లు తెలిపింది. రాత్రి మొత్తం చెట్ల మధ్యే చలిలో గడిపినట్లు వెల్లడించింది. ఏ మాత్రం భయపడలేదని చెబుతోంది. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి.. గాలింపు చర్యలు చేపట్టాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బాలికను గుర్తించినట్లు తెలిపారు. కుటుంబంతో బాలికను కలిపినట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి:విహారంలో అపశృతి..టూరిస్టు స్విమ్మింగ్ చేస్తుండగా.. సొర ఎంట్రీ..క్షణాల్లోనే.. -
ఆసుపత్రిలో చిన్నారులకు కేసీఆర్ పరామర్శ
హైదరాబాద్: మెదక్ జిల్లా మసాయి పేట వద్ద రైలు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. చిన్నారుల వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వ భరిస్తుందని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా మసాయిపేట వద్ద గురువారం ఉదయం నాందేడ్ ప్యాసింజర్ రైలు స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సును ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 20 మందికిపైగా మృతి చెందారు. ఆ ప్రమాదంలో మృతి చెందిన ఒక్కోకుటుంబానికి రూ. 5 లక్షలు నష్టపరిహారం కింద అందజేయనున్నట్లు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ. 20 వేల ఇవ్వనున్నట్లు తెలిపింది.