breaking news
SUM
-
'ఎస్యూఎం'లో భారీ అగ్నిప్రమాదం
-
అగ్నిప్రమాదంలో చనిపోయింది 19మందే
భువనేశ్వర్ : ఎస్యూఎం ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 19మందే మృతి చెందినట్లు ఒడిశా ఆరోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో సోమవారం రాత్రి ఎస్యూఎం ఆస్పత్రిలో షార్ట్ స్కర్యూట్ జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ ప్రమాదంలో 22మంది చనిపోయినట్లు ఒడిశా ప్రభుత్వం అధికారికంగా నిన్న ప్రకటించింది. అయితే ప్రమాద ఘటనలో 19మందే మరణించినట్లు వైద్యశాఖ వర్గాలు తెలిపాయి. క్యాపిటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 14మంది చనిపోగా, తీవ్రంగా గాయపడ్డ మరో అయిదుగురు అమ్రి ఆస్పత్రిలో మరణించినట్లు వెల్లడించాయి. గాయపడ్డ మరో 106మందికి చికిత్స కొనసాగుతున్నట్లు హెల్త్ సెక్రటరీ ఆర్తి అహుజా తెలిపారు. ఆర్తీ అహుజా మంగళవారం ఉదయం ఎస్యూఎం ఆస్పత్రిని సందర్శించి, దుర్ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. 19 మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయిందని, మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు వాహనాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. విచారణ నిమిత్తం ఇక ప్రమాదం సంభవించిన ఐసీయూతో పాటు ఎమర్జెన్సీ యూనిట్లను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ దుర్ఘటనపై ఒడివా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారణకు ఆదేశించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆయన సూచించారు. క్షతగాత్రులకు ముఖ్యమంత్రి ఇవాళ పరామర్శించనున్నారు. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
ఆస్పత్రిలో మంటలు
24 మంది ఆహుతి 75 మందికి గాయాలు • ఒడిశాలోని భువనేశ్వర్ ఎస్‌యూఎంలో దుర్ఘటన • డయాలసిస్ వార్డులో షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం • ఐసీయూకు మంటలు అంటుకొని పలువురు మృతి • 500 మందిని రక్షించిన అధికారులు, స్థానికులు • మృతుల కుటుంబాలకు ప్రధాని తీవ్ర సంతాపం భువనేశ్వర్‌లో సోమవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. ఎస్యూఎం ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోగా, 75 మంది గాయపడ్డారు. ఆస్పత్రి మొదటి అంతస్తులో ఉన్న డయాలసిస్ వార్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఐసీయూకు వ్యాపించడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భువనేశ్వర్: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో సోమవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. ఎస్యూఎం ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 75 మంది గాయపడ్డారు. ఆస్పత్రి మొదటి అంతస్తులో ఉన్న డయాలసిస్ వార్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా పక్కనే ఉన్న ఐసీయూకు వ్యాపించాయి. దీంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న అనేక మంది తీవ్రంగా గాయపడగా వారిని నగరంలోని పలు ఆస్పత్రులకు తరలించారు. క్యాపిటల్ ఆస్పత్రికి తరలించిన వారిలో 14 మంది, కార్పొరేట్ ఆస్పత్రిలో 10 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కిటికీలు పగులగొట్టి బయటపడ్డ రోగులు మరోవైపు ఆస్పత్రిలోని ఇతర విభాగాలకు కూడా మంటలు వ్యాపించాయన్న పుకార్లతో రోగులు, వారి బంధువులు, ఆస్పత్రి సిబ్బంది పరుగులు తీశారు. పలువురు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు పలువురు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆస్పత్రిలో చిక్కుకున్న 500 మందిని రక్షించారు. మంటల్ని అదుపు చేసేందుకు, సహాయక కార్యక్రమాల కోసం ఏడు అగ్నిమాపక బృందాలు శ్రమించాయని ఫైర్ సర్వీస్ డీజీ బినయ్ బెహెరా తెలిపారు. క్షతగాత్రుల్ని తరలించేందుకు పదుల సంఖ్యలో అంబులెన్స్‌ల్ని మోహరించారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పలువురు రోగులు నాలుగు అంతస్తుల భవంతి అద్దాలు పగులగొట్టి బయటపడ్డారు. గాయపడ్డవారిలో పలువురు అమ్రి, అపోలో, కళింగ ఆస్పత్రులతో పాటు ఎస్సీబీ మెడికల్ కాలేజీ, కటక్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై విచారణకు ఆదేశం ఐసీయూలోని రోగుల్ని ఇతర ఆస్పత్రులకు తరలించామని ఎస్‌యుఎం ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ బసంత పాటి చెప్పారు. ఈ సంఘటన పై జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, ఫైర్ సిబ్బందితో విచారణ సంఘం ఏర్పాటు చేశామని ఒడిశా వైద్య కార్యదర్శి ఆర్తి అహుజా తెలిపారు. ఆస్పత్రి యాజ మాన్యం తప్పుందని తేలితే చర్యలు తీసుకుంటామని వైద్య శాఖ మంత్రి అత్ను సబ్యసాచి నాయక్ చెప్పారు. మోదీ తీవ్ర విచారం ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో పలువురి మరణంతో తీవ్రంగా కలత చెందానని, మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నానని ప్రధాని ట్వీట్ చేశారు. గాయపడ్డవారిని ఎయిమ్స్‌కు తరలించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు సూచించారు. బాధితులకు అన్ని విధాలా సాయం చేయాలని మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఆదేశించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం