breaking news
State of the Union
-
అమెరికా ఈజ్ బ్యాక్
వాషింగ్టన్: ‘అమెరికా స్వర్ణయుగం’ ఇప్పుడే మొదలైందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. ‘అమెరికా ఈజ్ బ్యాక్’ అని ఉద్ఘాటించారు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ కోసం తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా శ్రమిస్తోందని స్పష్టంచేశారు. అమెరికాను మరోసారి గొప్ప దేశంగా మార్చబోతున్నామని చెప్పారు. అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మంగళవారం రాత్రి అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ట్రంప్ మొదటిసారిగా మాట్లాడారు. ఏకంగా ఒక గంట 40 నిమిషాలకుపైగా ప్రసంగించి సరికొత్త రికార్డు సృష్టించారు. తొలి జాయింట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్లో గానీ, తొలి స్టేట్ ఆఫ్ ద యూనియన్ స్పీచ్‌లో గానీ అధ్యక్షుడు 100 నిమిషాలపాటు సుదీర్ఘంగా మాట్లాడడం అమెరికా చరిత్రలో ఇదే ప్రథమం. ఇప్పటిదాకా బిల్ క్లింటన్ పేరిట ఉన్న రికార్డును ట్రంప్ తిరగరాశారు. 2000 సంవత్సరంలో అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ స్టేట్ ఆఫ్ ద యూనియన్ స్పీచ్‌లో ఒక గంట 28 నిమిషాల 49 సెకండ్ల పాటు ప్రసంగించారు. డొనాల్డ్ ట్రంప్ తన తాజా ప్రసంగంలో పలు కీలక అంశాలపై స్పందించారు. సరిహద్దు భద్రత, టారిఫ్‌లు, రష్యా–ఉక్రెయిన్ శాంతి ఒప్పందం, ఇంధన భద్రత, ధరల పెరుగుదల, అక్రమ వలసలు తదితర అంశాలపై తన వైఖరిని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేశారు. పనామా కాలువను స్వా«దీనం చేసుకుంటామని, గ్రీన్‌ల్యాండ్‌పై నియంత్రణ సాధిస్తామని తేల్చిచెప్పారు. ట్రంప్ ప్రసంగం ఆయన మాటల్లోనే... ప్రతి దేశం మమ్మల్ని దగా చేస్తోంది ‘‘ఇండియాతోపాటు ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై అధికంగా సుంకాలు విధిస్తున్నాయి. ఇలా చేయడం ముమ్మాటికీ అన్యాయమే. యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, ఇండియా, మెక్సికో, కెనడా తదితర దేశాల టారిఫ్‌ల గురించి విన్నారా? ఇండియాలో అయితే అటో టారిఫ్‌లు 100 శాతానికి పైగా విధిస్తున్నారు. చాలాదేశాలు దశాబ్దాలుగా మా ఉత్పత్తులపై సుంకాల రూపంలో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు సుంకాల మోత మోగిస్తున్నాయి. ఈ భూగోళంపై ఉన్న దాదాపు ప్రతి దేశం మమ్మల్ని దగా చేస్తోంది. ఇకపై ఈ దోపిడీ సాగడానికి వీల్లేదు. ఇప్పుడు మా వంతు వచి్చంది. మా ఉత్పత్తులపై సుంకాలు విధించే దేశాల ఉత్పత్తులపై మేము కూడా అదే స్థాయిలో సుంకాలు వసూలు చేస్తాం. వచ్చే నెల 2వ తేదీ నుంచే ఇవి అమల్లోకి వస్తాయి. ఆయా దేశాలు వారి ఉత్పత్తులను అమెరికాలో తయారు చేయకపోతే టారిఫ్‌లు చెల్లించాల్సిందే. ట్రంప్ పాలనలో కొన్ని సందర్భాల్లో టారిఫ్‌లు చాలాచాలా అధికంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఎవరైనా వారి మార్కెట్లలోకి మమ్మల్ని రానివ్వకపోతే మేము కూడా అదే పనిచేస్తాం. మా మార్కెట్లలోకి వారిని అడుగు పెట్టనివ్వం. జెలెన్స్కీ లేఖ ప్రశంసనీయం ఉక్రెయిన్‌తో ఘర్షణకు ముగింపు పలికి, శాంతిని కోరుకుంటున్నట్లు రష్యా నుంచి నాకు బలమైన సంకేతాలు అందాయి. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నుంచి నాకు ఈరోజే ఒక ముఖ్యమైన లేఖ అందింది. శాంతి సాధన కోసం సాధ్యమైనంత త్వరగా చర్చలు ప్రారంభం కావాలని ఆయన కోరుకుంటున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్ ప్రజల కంటే మిన్నగా శాంతిని ఆకాంక్షిస్తున్నవారు ఎవరూ లేరని లేఖలో జెలెన్స్కీ పేర్కొన్నారు. ఇది నిశ్చయంగా శుభ పరిణామం. శాశ్వత శాంతి కోసం ట్రంప్ నాయకత్వంలో పని చేస్తామని జెలెన్స్కీ, ఆయన బృందం చెప్పారు. ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న సాయాన్ని మర్చిపోలేమని వారు తెలిపారు. ఉక్రెయిన్ సార్వ¿ౌమత్వం, స్వాతంత్య్రాన్ని అమెరికా కాపాడుతుందని వారు ఆశిస్తున్నారు. అదే సమయంలో అరుదైన ఖనిజాల సరఫరాతోపాటు ఉక్రెయిన్ భద్రత విషయంలో ఒప్పందంపై ఏ సమయంలోనైనా సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీ నా దృష్టికి తీసుకొచ్చారు. జెలెన్స్కీ రాసిన లేఖ ప్రశంసనీయం. క్రూరమైన యుద్ధం వల్ల ఉక్రెయిన్, రష్యాలో ఇప్పటికే లక్షలాది మంది అన్యాయంగా బలైపోయారు. చాలామంది క్షతగాత్రులుగా మారారు. ఈ మారణకాండ ఆగిపోవాల్సిందే. మతిలేని యుద్ధాన్ని ఆపేయాల్సిన సమయం ఇదే. ఉక్రెయిన్‌లో ఘర్షణకు తెరదించడానికి నేను ఎంతగానో కష్టపడుతున్నా. రష్యా ప్రతినిధులతో ఇటీవలే చర్చలు జరిపాం. శాంతి కోసం సిద్ధంగా ఉన్నట్లు వారు బలమైన సంకేతాలిచ్చారు. ఇది నిజంగా ఎంతో అద్భుతంగా ఉంది కదా. కాశ్ పటేల్‌కు కృతజ్ఞతలు 2021 ఆగస్టులో అఫ్గానిస్తాన్ ఎయిర్‌పోర్టు వద్ద పేలుళ్లకు పాల్పడి 13 మంది అమెరికా సైనికులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాది ముహమ్మద్ షరీఫుల్లాను అరెస్టు చేశామని తెలియజేయడానికి సంతోషిస్తున్నా. పాకిస్తాన్ సాయంతో అతడిని బంధించాం. అమెరికాకు తరలిస్తున్నాం. సత్వరమే చట్టప్రకారం విచారణ చేపట్టి, అతడిని శిక్షిస్తాం. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గతంలో అప్పటి పాలకులు న్యాయ వ్యవస్థను రాజకీయ ప్రత్యర్థులపై ఆయుధంగా వాడుకున్నారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని కాశ్ పటేల్ పునరుద్ధరించారు. కాశ్ పటేల్ మున్ముందు గొప్ప పనులు చేయబోతున్నారు. అలాగే లింగ మార్పిడి చర్యలకు మేము వ్యతిరేకమే. లింగ మారి్పడిని శాశ్వతంగా నిషేధిస్తూ, దాన్ని నేరంగా పరిగణించే బిల్లును ఆమోదించాలని కాంగ్రెస్‌ను కోరుతున్నా. చిన్నారుల్లో క్యాన్సర్, ఆటిజం కేసులను తగ్గించడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. మన పర్యావరణం నుంచి విషకారకాలను, ఆహార పదార్థాల అన్ని రకాల విష రసాయనాలను తొలగించి, చిన్నారులను ఆరోగ్యంగా, బలంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. డ్రిల్ బేబీ డ్రిల్ అమెరికాలో ఇప్పుడు ధరల పెరుగుదలతోపాటు అనేక సమస్యలకు గత జో బైడెన్ ప్రభుత్వమే కారణం. బైడెన్ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్రవ్యోల్బణ సమస్య వేధిస్తోంది. ఏ దేశానికీ లేని విధంగా మన కాళ్ల కింద ద్రవరూపంలో బంగారం ఉంది. ముడి చమురు, సహజ వాయువును వెలికితీస్తే ద్రవ్యోల్బణ సమస్య పరిష్కారమవుతుంది. బైడెన్ పాలనలో వందకుపైగా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు మూసివేశారు. వాటిని మళ్లీ తెరవబోతున్నాం. ఇంధన వ్యయాన్ని తగ్గించడంపై దృష్టి పెట్టాం. నేను అధికారంలోకి రాగానే జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితి విధించా. కాళ్ల కింద ఉన్న బంగారాన్ని తవ్వితీస్తే ఇంధన ఖర్చులు గణనీయంగా తగ్గిపోతాయి. ప్రజలకు మేలు జరుగుతుంది. దాన్ని డ్రిల్ బేబీ డ్రిల్ అంటారు. అమెరికా పౌరులందరికీ సామాజిక భద్రత కలి్పంచడమే మా ధ్యేయం. 300 ఏళ్ల వయసున్న వ్యక్తి కూడా ప్రభుత్వం నుంచి సాయం అందుకొనే విధానం తీసుకొస్తాం. అక్రమ వలసలపై మా వైఖరేమిటో ఇప్పటికే బయటపెట్టాం. అక్రమ వలసదార్లను బయటకు పంపిస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు. అక్రమ వలసను అరికట్టడానికి సరిహద్దులను దుర్భేద్యంగా మారుస్తాం’’ అని డొనాల్డ్ ట్రంప్ వివరించారు. ఆ దేశాలకు రాయితీలు బంద్ ‘‘పొరుగు దేశాల నుంచి ఫెంటానిల్ వంటి ప్రాణాంతక మాదక ద్రవ్యాలు అమెరికాలోకి అక్రమంగా వచ్చి పడుతున్నాయి. డ్రగ్స్ కారణంగా వేలాది మంది అమెరికా పౌరులు అకాల మరణం చెందుతున్నారు. కుటుంబాలు కూలిపోతున్నాయి. యువతీ యువకులు ప్రాణాలు కోల్పోతుండడం బాధ కలిగిస్తోంది. ఇలాంటి విషాదం ఎప్పుడూ చూడలేదు. అమెరికా నుంచి వందల బిలియన్ డాలర్ల సబ్సిడీలు పొందుతున్న దేశాలు చేస్తున్న నిర్వాకమిది. కెనడా, మెక్సికో దేశాలకు ఎన్నో రాయితీలు ఇస్తున్నాం. వందల బిలియన్ల డాలర్ల సొమ్ము ఖర్చు చేస్తున్నాం. ఇకపై ఇలాంటి త్యాగాలకు మేము సిద్ధంగా లేము. మాకు నష్టం కలిగిస్తున్న దేశాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ రాయితీలిచ్చే ప్రసక్తే లేదు’’. గ్రీన్లాండ్ అమెరికాలో భాగం కావాల్సిందే ‘‘పనామా కాలువను మా అ«దీనంలోకి తీసుకోవడానికి మావద్ద ప్రణాళికలు ఉన్నాయి. మా జాతీయ భద్రతను మరింత పటిష్టం చేసుకోవడానికి పనామా కాలువను నియంత్రణలోకి తెచ్చుకోక తప్పదు. ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభమైంది. జిమ్మీ కార్టర్ ప్రభుత్వం కేవలం ఒక్క డాలర్‌కు పనామా కాలువను ఇతరులకు ఇచ్చేసింది. అప్పట్లో కుదిరిన ఒప్పందాలు పదేపదే ఉల్లంఘనకు గురవుతున్నాయి. ఇక మాది మేం తీసుకుంటాం. గ్రీన్లాండ్ సైతం అమెరికాలో భాగం కాక తప్పదు. ఒక మార్గంలో కాకపోతే మరో మార్గంలో గ్రీన్ల్యాడ్ను స్వా«దీనం చేసుకుంటాం. సొంత భవిష్యత్తును నిర్ణయించుకొనే హక్కు గ్రీన్లాండ్ ప్రజలకు ఉంది. అమెరికా పౌరులుగా మారాలనుకుంటే సాదర స్వాగతం పలుకుతాం. గ్రీన్లాండ్ ప్రజలను భద్రంగా చూసుకుంటాం’’. -
వలసదారులతో సుసంపన్నం
వాషింగ్టన్: చట్టబద్ధంగా అమెరికాకు వస్తున్న వలసదారులతో దేశానికి ఎన్నో విధాలుగా మేలు జరుగుతోందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ప్రతిభ ఆధారిత వలస విధానం ప్రాముఖ్యత మరోసారి నొక్కి చెప్పిన ట్రంప్..అమెరికా పౌరుల ఉద్యోగాలు, ప్రాణాల్ని పరిరక్షించే ఒక సుదృఢ వలస వ్యవస్థను రూపొందించాల్సిన నైతిక బాధ్యత తమపై ఉందని ఉద్ఘాటించారు. కాంగ్రెస్‌లోని ఉభయ సభల్ని ఉద్దేశించి ఆయన ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ పేరిట బుధవారం ప్రసంగించారు. ఏటా జరిగే ఈ జరిగే కార్యక్రమం అధ్యక్ష హోదాలో ట్రంప్‌కు రెండోది కావడం గమనార్హం. ప్రతీకార రాజకీయాలను తిరస్కరించాలని, భేదాభిప్రాయాలు పరిష్కరించుకోకుంటే మరో షట్‌డౌన్ వస్తుందని హెచ్చరించారు. ట్రంప్ తన ప్రసంగంలో వివిధ అంశాలపై చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. వలసలు, సరిహద్దు గోడపై.. చట్టాలు గౌరవించి, సక్రమంగా అమెరికాకు వస్తున్న వలసదారులు ఎన్నో విధాలుగా మన సమాజాన్ని సుసంపన్నం చేస్తున్నారు. వారు చట్టబద్ధంగా రావాలని కోరుకుంటున్నా. మన పౌరులందరి ప్రయోజనాల్ని రక్షించే ఒక వ్యవస్థను నిర్మించాల్సిన బాధ్యత మనపైనే ఉంది. మెక్సికోతో సరిహద్దు గోడ కోసం కలసి పనిచేద్దాం. రాజీకొద్దాం. అమెరికాను గొప్ప దేశంగా తీర్చిదిద్దే ఒప్పందం చేసుకుందాం. కాంగ్రెస్‌లో విభేదాలపై.. మరో ప్రభుత్వ షట్‌డౌన్ రాకుండా నివారించాలంటే విభేధాల్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. పాత గాయాలు మానేలా, భేదాభిప్రాయాలు పక్కనపెట్టి కొత్త పరిష్కారాలు, ఒప్పందాలు చేసుకుందాం. విదేశీ శత్రువులను ఓడించాలంటే స్వదేశంలో మనం కలసిపనిచేయాలి. తాలిబాన్‌తో చర్చలపై.. అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ ఉగ్రవాదులతో నిర్మాణాత్మక చర్చలు కొనసాగుతున్నాయి. శాంతి స్థాపనకు ప్రయత్నంచే సమయం వచ్చింది. తాలిబాన్లతో చర్చల్లో పురోగతి సాధిస్తే, అక్కడ మన సైన్యాన్ని తగ్గించి, ఉగ్ర వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి సారిస్తాం. చైనా ఉత్పుత్తులపై టారిఫ్‌లు వేయడంపై చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లు వేయడం ద్వారా అమెరికాకు ప్రతినెలా బిలియన్ల కొద్ది ఆదాయం వస్తోంది. అంతకుముందు, డ్రాగన్ దేశం మనకు ఒక్క డాలర్ కూడా ఇచ్చేది కాదు. దశాబ్దాలుగా అమెరికాకు ప్రతికూలంగా ఉన్న వాణిజ్య విధానాల్ని రద్దుచేయడానికి అధిక ప్రాముఖ్యత ఇస్తున్నాం. కొత్త అణు ఒప్పందం! భారత్, పాక్‌లను చేరుస్తూ ట్రంప్ సరికొత్త అణు ఒప్పందాన్ని ప్రతిపాదించారు. భారత్‌కు చెందిన పృథ్వీ, అగ్ని క్షిపణులు, పాక్‌కు చెందిన బాబర్, షహీన్, ఘోరి లాంటి క్షిపణుల ప్రయోగాలపై నియంత్రణ ఉండేలా ఆయన ఈ ప్రతిపాదన తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో ఆయన నేరుగా భారత్‌ను ప్రస్తావించలేదు. కాగా, కార్యక్రమానికి డెమొక్రాటిక్ పార్టీకి చెందిన మహిళా సభ్యులు తెలుపు రంగు డ్రెస్‌లలో వచ్చారు. 20వ శతాబ్దంలో ఓటుహక్కు కోసం ఉద్యమించిన మహిళల జ్ఞాపకార్థం వారీ రంగు దుస్తుల్లో వచ్చారు. కాగా, ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌లు ఈ నెల 27, 28న వియత్నాంలో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. -
అమెరికా కోసం కలసి పనిచేద్దాం
వాషింగ్టన్: అమెరికా ప్రయోజనాలు, ఆర్థికవ్యవస్థ, విలువలను చైనా, రష్యా వంటి దేశాలు సవాల్ చేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇందుకోసం దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. స్వాప్నికులకు మేలుచేయడంతోపాటు, వలస విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అధ్యక్ష పగ్గాలు చేపట్టాక తొలిసారి స్టేట్ ఆఫ్ ది యూనియన్ను ఉద్దేశించి బుధవారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) ఆయన ప్రసంగించారు. 80 నిమిషాలసేపు కొనసాగిన ఈ ప్రసంగంలో ‘అమెరికా ఫస్ట్’ నినాదం, నాలుగు స్తంభాల వలస విధానం, నైపుణ్యాధారిత వలసలు (భారత్ వంటి దేశాల నిపుణులకు మేలుచేసే) ఏడాది పాలనలో ఆర్థిక విజయాలు, స్టాక్‌మార్కెట్ వృద్ధి, నిరుద్యోగం తగ్గటం వంటి విజయాలనూ పేర్కొన్నారు. దేశ స్థితిగతులు, తన విజయాలు, ప్రణాళికలను కాంగ్రెస్ ఉభయసభలకు దేశాధ్యక్షుడు వివరించేదే ఈ ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్ ’ ప్రసంగం. విభేదాలను పక్కనపెట్టి ‘మనమంతా రాజకీయాలకు అతీతంగా ఏకమై దేశానికి మేలు చేసే లక్ష్యంతో ముందుకెళ్లాలి’ అని ట్రంప్ డెమొక్రాట్, రిపబ్లికన్ సభ్యులకు పిలుపునిచ్చారు. ‘మన పౌరులను వర్ణం, మతం, జాతితో సంబంధం లేకుండా కాపాడాలనేదే నా అభిప్రాయం. అమెరికన్లు తమ దేశాన్ని ప్రేమిస్తారు. వారికి ప్రేమను పంచే ప్రభుత్వాలనే కోరుకుంటారు’ అని ట్రంప్ పేర్కొన్నారు. ‘ఇది నవ అమెరికా క్షణం. అమెరికా కలలో జీవించాలనుకునే వారికి ఇంతకన్నా గొప్ప అవకాశం ఉండదు’ అని పేర్కొన్నారు. అధ్యక్షుడిగా పనిచేయటం వ్యాపారాన్ని నడిపినట్లు కాదని అర్థమైందని.. ప్రభుత్వం నడిపేందుకు హృదయంతో పనిచేయాల్సి ఉంటుందని ఈ ఏడాదిలో తెలుసుకున్నానన్నారు. అమెరికాలోని వివాదాస్పద గ్వాంటనమో జైలును ముసివేయటం లేదని ట్రంప్ తెలిపారు. దీనికి సంబంధించిన ఆదేశాలపై సమావేశానికి ముందే ట్రంప్ సంతకం చేశారు. నాలుగు స్తంభాల విధానం 18లక్షల మంది స్వాప్నికులకు లబ్ధిచేకూర్చటం, వలసల విధానంలో సంస్కరణలకోసం నాలుగు స్తంభాల విధానాన్ని ట్రంప్ ప్రతిపాదించారు. ‘మన ప్రణాళిక ప్రకారం, విద్య, పనికి సంబంధించిన నిబంధనలకు సరిపోతారో, నీతివంతమైన ప్రవర్తనను కనబరుస్తారో వారు అమెరికా పూర్తిస్థాయి పౌరులుగా ఉండేందుకు అనుమతి పొందుతారు’ అని మొదటి స్తంభాన్ని వివరించారు. ఇది స్వాప్నికులకు మేలుచేసే నిర్ణయంగా భావిస్తున్నారు. మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించటమే రెండో స్తంభం. ట్రంప్ మొదట్నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న లాటరీ వీసా విధానాన్ని రద్దుచేయటమే మూడో పిల్లర్ ఉద్దేశం. గొలుసుకట్టు వీసాల విధానానికి చరమగీతం పాడటమే నాలుగో పిల్లర్. అమెరికా పౌరసత్వం పొందిన వ్యక్తి ఎందరైనా తన బంధువులు, కావాల్సిన వారిని అమెరికాకు తీసుకొచ్చి ఉపాధి కల్పించటమే ఈ వీసా విధానం. నిరుద్యోగం తగ్గింది దేశంలో 45 ఏళ్ల అత్యల్ప స్థాయికి నిరుద్యోగం చేరుకుందని ఆయన పేర్కొన్నారు. చిరు వ్యాపారుల విశ్వాసం అపరిమితంగా పెరిగిందన్నారు. స్టాక్ మార్కెట్ రికార్డులను బద్దలు చేస్తూ దూసుకెళ్తోందన్నారు. వ్యాపార పన్నురేటును 35 శాతం నుంచి 21 శాతానికి తగ్గించటం పెద్ద పన్నుల సంస్కరణన్నారు. ఉత్తరకొరియాకు హెచ్చరిక ఉత్తరకొరియా నిర్లక్ష్యపూరిత ధోరణిపై ట్రంప్ తన ప్రసంగంలో మండిపడ్డారు. అణు క్షిపణులను పరీక్షించటం ద్వారా అమెరికా నగరాలను బెదిరించాలని చూస్తోందన్నారు. గత ప్రభుత్వాలు అమెరికాను ప్రమాదకర స్థితిలోకి నెట్టేలా చేసిన తప్పులను తను చేయబోనని స్పష్టం చేశారు. ‘అంతర్గతంగా అమెరికా బలాన్ని, విశ్వాసాన్ని పునర్నిర్మిస్తున్నాం. విదేశీగడ్డపైనా మన బలాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా విలువల్లేని కొన్ని దేశాలు, ఉగ్రవాద సంస్థలు, చైనా, రష్యా వంటి శత్రుదేశాలు మన ప్రయోజనాలు, ఆర్థిక వ్యవస్థ, విలువలకు సవాల్ విసురుతున్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో మనం బలహీనంగా ఉంటే ముందడుగు వేయలేం’ అని ట్రంప్ పేర్కొన్నారు. ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ట్రంప్ కేబినెట్ సభ్యులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, గతేడాది అమెరికన్ కాల్పుల్లో మృతిచెందిన భారతీయుడు శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన కూడా ఈ ప్రసంగానికి ఆహ్వానితురాలిగా హాజరయ్యారు. ట్రంప్ స్వీయ కరతాళాలు వివాదాస్పద వ్యాఖ్యలకు, వింత హావభావాలకు పేరుగాంచిన ట్రంప్ ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగం సమయంలోనూ వింతగా వ్యవహరించారు. ప్రసంగిస్తూ మధ్యలో తన వ్యాఖ్యలకు ప్రశంసగా తనకు తానే చప్పట్లు కొట్టుకుంటూ ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిపై సోషల్ మీడియాలో భారీగా స్పందనలు వచ్చాయి. చాలా మంది ప్రజలు ట్రంప్‌ను ఎద్దేవా చేస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ప్రసంగ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా తులసీ గబార్డ్, కెవిన్ యోడర్లతో సునయన (మధ్యలో) -
భారతీయులకు శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటన భారతీయులకు శుభవార్త కానుంది. ప్రతిభ ఆధారంగానే ప్రవేశం కల్పించాలని ట్రంప్ ప్రకటన చేశారు. అలా చేయడం ద్వారా మాత్రమే అమెరికాను ప్రథమ స్థానంలో ఉంచగలమని స్పష్టం చేశారు. అలాగే, లాటరీ వీసా వ్యవస్థకు తాను ముగింపు పలకబోతున్నానని మరోసారి స్పష్టం చేశారు. అలాగే, నిరంతర వలస విధానాన్ని వ్యతిరేకిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి ట్రంప్ తాజాగా ప్రసంగించారు. ఈ ప్రసంగానికి గతంలో కాన్సాస్‌లో జాతి విధ్వేష కాల్పుల్లో మరణించిన కూచిబొట్ల శ్రీనివాస్ భార్య సునయన కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ విబేధాలను పక్కన పెడుతూ అందరూ ఐకమత్యంతో ఉండాలని సూచించారు. ఇటీవల సంభవించిన విపత్తు మన భూభాగాన్ని తుడిచిపెట్టిందని అన్నారు. 'అమెరికాలో శాశ్వత పౌరసభ్యత్వం ఇచ్చేందుకు అందించే గ్రీన్ కార్డులను ప్రతిభ ఆధారంగానే ఇవ్వాలి. ఎందుకంటే అమెరికాను ముందు వరసలో ఉంచడానికి అదొక్కటే మార్గం. మెరిట్ ఆధారిత వలస విధానం ప్రారంభించడానికి ఇదే సమయం. ఎవరైతే అధిక నైపుణ్యాలు కలిగి ఉన్నారో, ఎవరు మన సమాజానికి మంచి సేవలను అందించగలరో, ఎవరు మన దేశాన్ని ప్రేమించి గౌరవిస్తారో వారికి మాత్రమే మనం గ్రీన్ కార్డులు ఇవ్వాలి' అని ట్రంప్ చెప్పారు. మెరిట్ ఆధారిత వలస వ్యవస్థను ట్రంప్ తీసుకొస్తే అది ఎక్కువమంది భారతీయులకు మేలును అందిస్తుంది. అయితే, వారి కుటుంబాలను విస్తరించుకునేందుకు మాత్రం అడ్డుకునే అవకాశం ట్రంప్ ప్రకటించిన విధానంలో ఉండనుంది. ఎందుకంటే చైన్ మైగ్రేషన్ విధానం ఉండబోదని ఆయన మరోసారి నొక్కి చెప్పారు. ఇదిలా ఉండగా.. ట్రంప్ ప్రసంగాన్ని డెమొక్రాట్స్ బహిష్కరించారు. -
12న ఒబామా చివరి ‘అధ్యక్ష’ ప్రసంగం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్టేట్ ఆఫ్ ద యూనియన్ను ఉద్దేశించి తన చివరి ప్రసంగం చేయనున్నారు. జనవరి 12న ఆయన అమెరికన్ కాంగ్రెస్ సంయుక్త భేటీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తన అధ్యక్ష కాలంలో సాధించిన విజయాలను వివరించనున్నారు. క్యూబాతో సంబంధాల పునరుద్ధరణ తదితర అంశాలను ప్రస్తావించే అవకాశముంది. ప్రస్తుతం హవాయి ద్వీపంలో సంవత్సరాంతపు సెలవుల్లో ఉన్న ఒబామా ఈ విషయాన్ని ఈమెయిల్లో తెలిపారు. తాను పదవి చేపట్టే నాటికి.. ఇప్పటికీ నిరుద్యోగం తగ్గిందన్నారు. ఒబామా పదవీ కాలం మరో 12 నెలల్లో ముగియనుంది.