breaking news
State Economic
-
ఎన్నికల వేళ రాష్ట్ర ఖజానాకు కాసుల గలగల
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇది కేవలం రాజకీయ ప్రక్రియ మాత్రమే కాదు. తాత్కాలికంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊపునందించే ముఖ్యమైన పరిణామం. ఈ సమయంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు చేసే ఖర్చు, ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం చేసే వ్యయం అనేక చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు, సేవారంగాలకు భారీగా డిమాండ్‌ను సృష్టిస్తుంది.ఎన్నికల నేపథ్యంలో వ్యాపార అవకాశాలుప్రింటింగ్, ప్రకటనల విభాగం (Printing and Advertising)ఎన్నికల సమయంలో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి లక్షలాది కరపత్రాలు, పోస్టర్లు ముద్రిస్తారు. దీంతో ప్రింటింగ్ ప్రెస్సులు, డిజైనర్లకు పని పెరుగుతుంది. పట్టణాలు, గ్రామాల్లో హోర్డింగ్‌ల తయారీ, బ్యానర్ల ముద్రణతో పాటు పార్టీ జెండాల తయారీ వ్యాపారాలు జోరందుకుంటుంది.ఎలక్షన్ సామగ్రి సరఫరా (Election Material Supply)ప్రచార సభలు, రోడ్ షోల కోసం మైక్ సెట్లు, లౌడ్‌స్పీకర్ల అద్దె వ్యాపారం పెరుగుతుంది. అభ్యర్థుల పర్యటనలు, కార్యకర్తల తరలింపు కోసం కార్లు, వ్యాన్లు, ఆటోలు వంటి వాహనాల అద్దెకు డిమాండ్ పెరుగుతుంది. డ్రైవర్లకు తాత్కాలిక ఉపాధి లభిస్తుంది. కార్యకర్తల కోసం పార్టీ రంగులు, గుర్తులతో కూడిన టి-షర్టులు, టోపీలు, కండువాల తయారీ, సరఫరా వ్యాపారం ఊపందుకుంటుంది.ఆహారం, ఆతిథ్యం (Food and Hospitality)ప్రచార సభలు, కార్యకర్తల సమావేశాల కోసం భారీగా ఆహార సరఫరా అవసరం అవుతుంది. దీని ద్వారా స్థానిక కేటరింగ్ వ్యాపారులు, చిరు వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నాయకులు, పార్టీ పరిశీలకుల కోసం హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల బుకింగ్‌లు పెరుగుతాయి.మీడియా, డిజిటల్ ప్రచారం (Media and Digital Campaign)సోషల్ మీడియా మేనేజ్మెంట్, వీడియోల తయారీ, డిజిటల్ ప్రకటనల కోసం ఏజెన్సీలకు, ఫ్రీలాన్సర్లకు పని దొరుకుతుంది. ఇది ఆధునిక ఎన్నికల ప్రచారంలో కీలకమైంది.రాష్ట్ర ఖజానాకు లబ్ధిస్థానిక సంస్థల ఎన్నికల ఖర్చు ద్వారా రాష్ట్ర ఖజానాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి చేకూరుతుంది. ఎన్నికల పాంప్లెట్లు, ఎలక్షన్ సామగ్రి, వాహనాల అద్దె, కేటరింగ్ సేవలు వంటి వాటిపై చెల్లించే జీఎస్టీ రూపంలో రాష్ట్రానికి ఆదాయం లభిస్తుంది. ముద్రణ, మీడియా, ఇతర సేవలపై విధించిన పన్ను రాష్ట్ర ఖజానాకు చేరుతుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు లేదా అనుమతులు లేని ప్రకటనలపై విధించే జరిమానాలు, ఫీజుల ద్వారా కూడా ఖజానాకు తాత్కాలిక ఆదాయం వస్తుంది.ఇదీ చదవండి: యురేనియం అన్వేషణకు ఎన్టీపీసీ ఒప్పందం -
‘పుర’ సమరానికి నిధుల పాచిక!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పట్టణాభివృద్ధి, పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. వచ్చే ఏడాది పురపాలికలకు జరగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు నిధుల కేటాయింపులను భారీగా పెంచింది. ప్రగతి పద్దు కింద పురపాలక శాఖకు 2017–18లో రూ.2,869.22 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్లో కేటాయింపులను రూ.4,680.09 కోట్లకు పెంచింది. వరంగల్ నగరానికి రూ.226.41 కోట్లు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం నగరాలకు రూ.301.88 కోట్ల కేటాయింపులను యథాతథంగా కొనసాగించింది. పురపాలికలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను రూ.117.23 కోట్ల నుంచి రూ.755.20 కోట్లకు పెంచింది. అయితే మునిసిపాలిటీల్లో అభివృద్ధి పనులకు సహాయక నిధులను మాత్రం రూ.426.41 కోట్ల నుంచి 230.10 కోట్లకు తగ్గించింది. మునిసిపల్ కార్పొరేషన్లకు వడ్డీ లేని రుణాలను రూ.7.55 కోట్ల నుంచి రూ.141.64 కోట్లకు పెంచింది. పురపాలికల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రుణ సహాయం అందించే టీయూఎఫ్ఐడీసీకి తొలిసారిగా రూ.200 కోట్లు కేటాయించింది. కొత్తగా ఏర్పడిన మునిసిపాలిటీల అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రాయోజిత పథకాలైన స్మార్ట్ సిటీకి రూ.150 కోట్ల నుంచి రూ.89.39 కోట్లకు కేటాయింపులను తగ్గించి, అమృత్ పథకానికి రూ.203.96 కోట్ల నుంచి రూ.313.63 కోట్లకు పెంచింది. స్వచ్ఛ భారత్‌కు రూ.115 కోట్ల కేటాయింపులను కొనసాగించింది. ఆలయాలకు నిధుల వెల్లువ! రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు పెంచింది. యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధి సంస్థకు గతేడాది రూ.100 కోట్లు కేటాయించగా, తాజాగా రూ.250 కోట్లకు పెంచింది. వేములవాడ ఆలయాల అభివృద్ధి సంస్థకు రూ.100 కోట్లను కేటాయించింది. తొలిసారిగా భద్రాచలం ఆలయాభివృద్ధి సంస్థకు రూ.100 కోట్లు, ధర్మపురి, బాసర ఆలయాభివృద్ధి సంస్థలకు చెరో రూ.50 కోట్లను కేటాయించింది. ‘మూసీ’ అభివృద్ధికి రూ.377 కోట్లు ప్రగతి పద్దు కింద హైదరాబాద్‌లో మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధికి రూ.377.35 కోట్ల కేటాయింపులను కొనసాగించి, రోడ్ల అభివృద్ధికి కేటాయింపులను రూ.377.35 కోట్ల నుంచి రూ.566.02 కోట్లకు పెంచింది. హైదరాబాద్ మెట్రో ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టుకు తొలిసారిగా రూ.400 కోట్లు కేటాయించింది. నిర్వహణ పద్దు కింద జలమండలి, హెచ్ఎండీఏ, మెట్రో రైలు సంస్థలకు బడ్జెట్లో భారీ ఎత్తున పెట్టుబడి రుణాలను కేటాయించింది. హైదరాబాద్ జలమండలికి రూ.1,420.50 కోట్ల రుణం, మెట్రో రైలుకు రూ.200 కోట్ల రుణం, హెచ్ఎండీఏకు రూ.250 కోట్ల రుణం, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కోసం మరో రూ.235 కోట్లను రుణాల కేటాయింపులను యథాతథంగా కొనసాగించింది. -
అమాత్యుల రాక నేడు
- జిల్లాకు మంత్రులు ఈటెల, కేటీఆర్ - ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు - తెలంగాణ చౌక్‌లో బహిరంగ సభ, ధూంధాం కరీంనగర్ : రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు మంగళవారం జిల్లాకు రానున్నారు. రాష్ట్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారి జిల్లాకు వస్తున్న మంత్రులకు ఘనస్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు... మంత్రులు హైదరాబాద్ నుంచి బయల్దేరి మంగళవారం సాయంత్రం 4గంటలకు జిల్లా సరిహద్దులోని శనిగరం చేరుకుంటారు. అక్కడ హుస్నాబాద్, మానకొండూర్ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్‌బాబు, రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో స్వాగతం పలికి ఊరేగింపుగా తీసుకువస్తారు. బెజ్జంకి క్రాసింగ్ వద్ద నుంచి భారీ బైక్‌ర్యాలీతో మంత్రులకు స్వాగతం పలుకనున్నారు. అల్గునూరులోని పెద్దమ్మ దేవాలయంలో మంత్రులు పూజలు నిర్వహిస్తారు. అక్కడే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం కరీంనగర్ నియోజకవర్గ సరిహద్దులోని మానేరు బ్రిడ్జి వద్ద స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో పార్టీ నేతలు మంత్రులకు ఘనస్వాగతం పలుకుతారు. అక్కడినుంచి భారీ ఊరేగింపుతో నగరంలోకి ప్రవేశించి మహాత్మా జ్యోతిరావుపూలే, మహాత్మగాంధీ విగ్రహాలకు, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. సాయంత్రం నగరంలోని తెలంగాణ చౌక్‌లో రాత్రి 7గంటలకు నిర్వహించే బహిరంగసభ, ధూంధాంలో మంత్రులతో పాటు జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ఇప్పటికే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నగరంలోని పలు కూడళ్లలో కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గులాబీమయం చేశారు. ఆయా ప్రాంతాల్లో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికేందుకు, యువకులతో బైక్‌ర్యాలీ నిర్వహించేందుకు స్థానిక కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. మంత్రుల పర్యటనను విజయంతం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి కోరారు.


