breaking news
srisailam temple officials
-
శ్రీశైలంలో అర్ధరాత్రి పూజలు.. కలకలం
సాక్షి, శ్రీశైలం/కర్నూలు : శ్రీశైల మల్లన్న సన్నిధిలో కలకలం రేగింది. వేదపండితుడు గంటి రాధాకృష్ణను సస్పెండ్ చేస్తున్నట్టు ఆలయ ఈవో రామచంద్రమూర్తి ప్రకటించారు. రాధాకృష్ణ నిబంధనలకు విరుద్ధంగా వ్యవరించాడంటూ పేర్కొన్నారు. క్షుద్రపూజలు చేశాడని ఆరోపించారు. దీంతో అధికారులు, వేదపండితుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గతంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోనూ క్షుద్రపూజలు నిర్వహించారనే ఆరోపణలొచ్చాయి. -
అక్రమాల నీడ
భక్తులకు నీడనిచ్చే షెడ్ల నిర్మాణంలో చేతివాటం కాంట్రాక్టర్లకు అనుకూలంగా అధికారులు గడువు దాటినా పూర్తి కాని పనులు లక్షలాది రూపాయల అదనపు బిల్లులు పర్యవేక్షణతో సరిపెడుతున్న ఉన్నతాధికారులు అభివృద్ధి ముసుగులో అక్రమార్కుల పంట పండుతోంది. కాంట్రాక్టర్లు ఇష్టారీతిన పనులు చేపట్టడం.. అధికారులు కూడా వంత పాడుతుండటం.. ఉన్నతాధికారులు తనిఖీలు చేసినా చర్యలు లేకపోవడంతో కోట్లాది రూపాయలకు రెక్కలొస్తున్నాయి. వాస్తవంగా చేపట్టాల్సిన పనులకు.. క్షేత్ర స్థాయిలో కొనసాగుతున్న పనులకు పొంతన లేకపోవడం వెనుక ‘మాస్టర్ ప్లాన్’ కనిపిస్తోంది. కర్నూలు: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో రూ.642 కోట్ల అంచనా వ్యయంతో మాస్టర్ ప్లాన్ అమలవుతోంది. ఇందులో భాగంగా చేపడుతున్న తొలి దశ పనుల్లో నాణ్యత కొరవడుతోంది. దేవాదాయ శాఖ నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం కాకుండా మాస్టర్ ప్లాన్ ఎప్పటికప్పుడు మారుతూ పోవడం విమర్శలకు తావిస్తోంది. మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం శ్రీశైలంలో మూడు చోట్ల తొమ్మిది షెడ్ల నిర్మాణానికి రూ.14.97 కోట్లు కేటాయించారు. టెండర్లో ఈ పనులను హైదరాబాద్‌కు చెందిన అభిరామ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.12.28 కోట్లకు దక్కించుకుంది. 18 నెలల వ్యవధిలో పూర్తి చేయాల్సిన షెడ్లను 1,12,561.43 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. అయితే పనులు మొదలుపెట్టే సరికి వసతి షెడ్లు కాస్తా ఒకటి కల్యాణ మండపంగా.. మరొకటి కల్యాణ కట్టగా.. ఇంకొకటి క్లాక్రూమ్గా.. తక్కినవి స్నానాల గదులు, మరుగుదొడ్లు, క్యూలైన్ కాంప్లెక్స్‌గా మారిపోయాయి. పాతాళగంగకు వెళ్లే మార్గంలో కాటేజీ నెం.111 ఎదురుగా రెండు షెడ్లను మాత్రమే భక్తుల కోసం నిర్మించగా.. వీటికి ఎదురుగా భారీ వైశాల్యంలో ఆడిటోరియం నిర్మాణానికి శ్రీకారం చుట్టడం గమనార్హం. వాస్తవానికి తొలుత వీటన్నింటినీ 2.60 లక్షల చదరపు అడుగుల వైశ్యాలంలో నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే కాంట్రాక్టర్ సమయానికి పూర్తి చేయలేకపోయారు. 2015 ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేసేలా అదనపు సమయం తీసుకున్నా.. ఇప్పటికీ ఆడిటోరియం పనులు బేస్మెంట్ స్థాయిలోనే నిలిచిపోయాయి. టెండర్లకే టెండర్ పిలిగ్రిం షెడ్ల ప్లాన్ సవరిస్తూ గత ఏడాది శివరాత్రి సందర్భంగా క్యూలెన్ కాంప్లెక్స్ వద్ద ఓ కొత్త క్యూలైన్ షెడ్డును నిర్మించారు. అయితే మాస్టర్ ప్లాన్‌లో క్యూలెన్ కాంప్లెక్స్ వద్ద వసతి షెడ్డుకు బదులుగా క్యూలెన్ షెడ్డును నిర్మించేందుకు ప్రతిపాదించారు. ఈ పనిని రూ.10లక్షలు చొప్పున మూడు భాగాలుగా విభజిస్తూ రూ.30 లక్షలకు టెండర్ పిలిచారు. భీమ్లానాయక్ అనే కాంట్రాక్టర్ ఈ షెడ్డు నిర్మాణ పనులను దక్కించుకున్నట్లు తెలిసింది. శరవేగంగా పనులు చేపట్టి పూర్తి చేశారు. నిర్మాణానంతరం ఈ పనులకు సంబంధించిన బిల్లులు మాత్రం పిలిగ్రిం షెడ్డు పనులను దక్కించుకున్న అభిరామ్ ఇన్ఫ్రా సంస్థ నుంచి చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత టెండర్‌కు సంబంధించి కేటాయించిన అసలైన నిధులను అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై దోచుకున్నట్లు సమాచారం. విచారణ జరిపితే అక్రమాలు వెలుగులోకి.. పిలిగ్రిం షెడ్ల నిర్మాణ పనుల్లో చోటు చేసుకున్నాయంటున్న అక్రమాలపై విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఆడిటోరియం పనుల తీరును పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ పనులను నిలిపేయాలని కూడా ఆదేశించారు. అవినీతికి అడ్డుకట్ట వేయాలంటే పనుల తీరుతెన్నులపై ఆర్అండ్బీ లేదా ఇరిగేషన్ అధికారులతో విచారణ చేపడితే ఫలితం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూరేలా.. నిధులను కొల్లగొట్టడంలో సిద్ధహస్తులైన ఇంజినీర్లు దేవాదాయశాఖ నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం షెడ్ల పనులను చేపట్టలేదు. మూడేళ్ల నుంచి చేపట్టిన ఈ పనులకు ఇప్పటి వరకు రూ.11.35 కోట్లు ఖర్చు చేశారు. కాటేజీ నెంబర్.111 ఎదురుగా ఆడిటోరియం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీనికి అభిముఖంగా వెనుక భాగాన రెండు వసతి షెడ్లు నిర్మించారు. అయితే ఆడిటోరియం నిర్మాణ ప్రాంతంలో ఉన్న బండరాళ్లను తొలగించడానికి నిధులు ఖర్చు చేశారు. కానీ.. తొలగించిన బండరాళ్ల కంటే అధిక ఎత్తులో ఆడిటోరియం పునాదులు తీయడంతో చేసిన ఖర్చు వృథాగా మారింది. ఈ అంశాలేవీ పట్టని ఇంజినీరింగ్ అధికారులు మళ్లీ ఆ పునాదులను బేస్మెంట్స్థాయి వరకు మట్టితో నింపేందుకు రూ.42 లక్షలు మంజూరు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వాస్తవానికి అక్కడ ఆ స్థాయిలో పునాదుల ఎత్తు పెంచాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కాంట్రాక్టర్‌ను సంతృప్తి పరిచేలా వ్యవహరించినట్లు తెలుస్తోంది.