breaking news
sports developments
-
ఒడిషాలో 89 స్టేడియాలు!
భువనేశ్వర్: భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తూ క్రీడల పట్ల తమ ప్రాధాన్యతను చూపించిన ఒడిషా ప్రభుత్వం ఇప్పుడు తమ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టింది. ఒడిషాలో మొత్తం రూ. 693.35 కోట్ల వ్యయంతో 89 మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియాలను నిరి్మంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్’ కింద 18 నెలల వ్యవధిలోనే ఈ నిర్మాణాలు పూర్తవుతాయి. ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారివంటివి ఎదురైనప్పుడు వసతి కేంద్రాలుగా, ఆస్పత్రులుగా కూడా ఉపయోగించుకునే విధంగా ఈ స్టేడియాలను నిరి్మస్తున్నారు. 2023లో భారత్‌లో హాకీ ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో రూర్కెలాలో ‘బిర్సా ముండా’ పేరుతో అధునాతన హాకీ స్టేడియాన్ని రూ. 120 కోట్ల వ్యయం తో ఒడిషా ప్రభుత్వం ఇప్పటికే నిర్మిస్తోంది. -
క్రీడాభివృద్ధికి తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరం
స్పెషల్ ఛీప్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం ముగిసిన చదరంగం టోర్నీ రాజమహేంద్రవరం సిటీ : క్రీడాభివృద్ధికి తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరమని ప్రభుత్వ స్పోర్ట్స్, యూత్ అడ్వాన్స్మెంట్ స్పెషల్ ఛీప్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. 46వ జాతీయ జూనియర్ ఓపెన్ (అండర్ –19) చదరంగం చాంపియన్, 31వ జాతీయ జూనియర్ (అండర్–19) బాలికల చదరంగం చాంపియన్ షిప్–2016 టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. రాజమహేంద్రవరంలోని షెల్టాన్ హోటల్లో ఈ నెల 8వ తేదీన 11 రౌండ్ల ఈ చదరంగం టోర్నమెంట్ మొదలైన సంగతి తెలిసిందే. బహమతి ప్రదానోత్సవానికి విచ్చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఏకాగ్రతతో నిరంతరం సాధన చేయాల్సిన క్రీడ చదరంగమన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో టోర్నమెంట్ నిర్వహించిన ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ఎసెంట్ స్పోర్ట్స్ ఫౌండేషన్‌ను ఆయన అభినం«ధించారు. ఎసెంట్ స్సోర్ట్స్ ఫౌండేషన్ సారధులు డాక్టర్లు శ్రీనివాస్, శ్రీదేవిలను రాష్ట్ర చదరంగం సంఘం శాలువాలో సత్కరించింది. కార్యక్రమంలో చదరంగం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైడీ రామారావు, కార్యదర్శి శ్రీహరి, ట్రిప్స్ స్కూల్ బాలాత్రిపుర సుందరి, వంశీకృష్ణ, జిల్లా బాడ్మింటన్ అసోసియేషన్ సీనియర్ ఉపాధ్యక్షురాలు తనూజ పాల్గొన్నారు. విజేతలు వీరే... బాలికల విభాగంలో తమిళనాడుకు చెందిన వైశాలి 9.5 పాయింట్లతో మొదటిస్థానంలో నిలిచింది. ఒడిశాకు చెందిన బిదార్ రుతుంబర, పశ్చిమ బెంగాల్‌కు చెందిన అర్పితా ముఖర్జీ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జి.లాస్య 8 పాయింట్లతో రెండోస్థానం సాధించారు. ఓపెన్ కేటగిరీలో.. బీహార్‌కు చెందిన కుమార్ గౌరవ్, మహారాష్ట్రకు చెందిన మహ్మద్ నుభారిష్ 8.5 పాయింట్లతో మొదటిస్థానంలో నిలిచారు. మహారాష్ట్రకు చెందిన సుధావాణి, తమిళనాడుకు చెందిన ముత్తయ్యఅలీ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్.కృష్ణతేజ, తమిళనాడుకు చెందిన ప్రసన్న, çపశ్చిమ బెంగాల్‌కు చెందిన సర్కార్, చండీఘర్‌కు చెందిన గోయల్ 8 పాయింట్లతో రెండోస్థానం సాధించారు. విజేతలకు షీల్డులతో పాటు రూ.రెండున్నర లక్షల నగదు బహుమతులు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.