breaking news
Spill Way Concrete
-
ఎగువ మానేరు ఎడారేనా..?
సాక్షి, ముస్తాబాద్(సిరిసిల్ల) : రాజన్న సిరిసిల్ల జిల్లా వరప్రదాయని ఎగువ మానేరు ప్రాజెక్టు. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలోనే మొదటి చిన్నతరహ నీటి ప్రాజెక్టు. నిజాం కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఆధునీకీకరణ పనులు అటకెక్కాయి. మిషన్ కాకతీయ, నీటి ప్రాజెక్టులకు వేలాది కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుండగా.. అధికారుల ఉదాసీనత ఈ ప్రాజెక్టుకు శాపంగా మారింది. వేలాది ఎకరాలకు ప్రత్యక్షంగా.. పరోక్షంగా సాగునీరందిస్తూ.. ప్రజల దాహార్తిని తీరుస్తున్న ఎగువ మానేరుపై పాలకులు శీతకన్ను వీడాలి. ఈ ఏడాది మరమ్మతు పనులకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తోందని ఎదురు చూసిన రైతన్నలకు చివరకు నిరాశే మిగిలింది. ఈ వర్షాకాలానికి ముందే పనులు పూర్తవుతాయని భావించారు. మరింత ఆయకట్టు సాగులోకి వస్తుందనకున్న అన్నదాతలకు ఎదురు చూపులే దక్కాయి. కొట్టుకుపోతున్న స్పిల్‌వే.. చివరి నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ 1945లో కూడవెళ్లి, పల్వంచ వాగులపై నర్మాల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టును నిర్మించారు. 1948లో పనులు పూర్తయ్యాయి. 2టీఎంసీలతో 17వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే పనులకు శ్రీకారం చుట్టారు. కుడికాలువ ద్వారా అంటే ఇప్పటి ముస్తాబాద్ మండలానికి 10వేల ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా గంభీరావుపేట మండలానికి 7వేల ఎకరాలకు సాగునీటిని అందించారు. కాలక్రమంలో ప్రాజెక్టును అధికారులు పట్టించుకోలేదు. దీంతో సిల్ట్ పేరుకుపోయి నీటి సామర్థ్యం తగ్గింది. అలాగే కుడి, ఎడమ కా లువలు మట్టిలో కూరుకుపోయి చెట్లు మొలిచి నీ రు ముందుకు సాగని విధంగా తయారైంది. ఇక కుడి కాల్వలోని డిస్ట్రిబ్యూటరీ 17 వరకు షట్టర్లు ధ్వంసం అయ్యాయి. ఎడమ కాల్వలోని డీ–10 వ రకు శిథిలం అయ్యాయి. స్పిల్‌వే పై మొక్కలు మొ లిచి నెర్రెలు పెట్టింది. కొంత భాగం వరదకు కొ ట్టుకుపోయింది. చివరకు 5వేల ఎకరాలకు మాత్ర మే సాగునీరందించే ప్రాజెక్టుగా మిగిలిపోయింది. ప్రతిపాదనలకు మోక్షం కలిగేనా.. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో నీటిపారుదల శాఖ అ« దికారులు ఎట్టకేలకు కుడి, ఎడమ తూముల మరమ్మతు, షట్టర్ల మరమ్మతు, కుడికాలువ పది కిలో మీటర్లు, షట్టర్లు, ఎడమ కాలువ 5 కిలోమిటర్ల కా ల్వ లైనింగ్, ముఖ్యంగా యాభై ఏళ్లుగా నిండుకు న్న సిల్ట్ తొలగింపు తదితర పనులు చేపట్టేందుకు రూ. 49 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆరునెలల క్రితం పంపించిన ప్రతిపాదనలు ఈఎస్సీ వరకు వెళ్లి ఆగినట్లు తెలుస్తోంది. ఈ వేసవిలోనే సిల్ట్ తొలగించి కనీసం 13వేల ఎకరాలకు నీరందించాలనుకున్న ప్రతిపాదనలు దాటలేదు. మళ్లీ వర్షాలు మొదలైతే ఇక సిల్ట్పనులు చేయరాదు. భారీ వర్షాలు పడితే వచ్చే వెసవి నాటికి కూడా పూడిక తీసే అవకాశాలు తక్కువే. ష ట్టర్ మరమ్మతు చేయరాదు. మరోసారి రబీలో 5వేల ఎకరాలకు మాత్రమే నీరందించే అవకాశాలున్నాయి. 9వ ప్యాకేజీలోకి గెస్ట్‌హౌస్, బోటింగ్ నిజాం నిర్మించిన గెస్ట్‌హౌజ్ శిథిలావస్థలో ఉండగా.. ఉద్యానవనం రూపు కోల్పోయింది. దీంతో అధికారులు రూ.2 కోట్లతో ఆధునిక హంగులతో గెస్ట్‌హౌస్ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. టూరిజం శాఖ ఉద్యానవనం, గెస్ట్‌హౌస్ నిర్మాణం చేపట్టనుండగా.. దీనిని కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ కింద చేపట్టనున్నారు. -
అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే సంబరాలు
- నేడు స్పిల్ వే కాంక్రీట్ పనులకు సీఎం శంకుస్థాపన - 7న డయాఫ్రమ్ వాల్, 14న స్పిల్‌వే గేట్ల పనులు ప్రారంభోత్సవం సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచేసి.. కమీషన్లు ఇచ్చే వారికే నామినేషన్ పద్ధతిలో పనులు కట్ట బెట్టిన సీఎం చంద్రబాబు తన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి తనదైన శైలిలో ప్రచారానికి తెర తీశారు. బడ్జెట్లో ప్రత్యే కంగా నిధులు కేటాయించి కేంద్రమే పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుకు.. తన వల్లే నాబార్డు రూ.1981.54 కోట్ల రుణం మంజూరు చేసిందంటూ ఈ నెల 26న ఢిల్లీలో కేక్‌లు కట్ చేసి.. సంబరాలు చేసుకోవడం అందులో భాగమేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవు తోంది. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం 1.59 గంటలకు పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే కాంక్రీట్ పనులకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, ఎం.వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాంక్రీట్ పనుల శంకుస్థాపనను ఘనంగా నిర్వహిం చేందుకు కోట్లాది రూపాయల ఖర్చుతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఎఫ్ఎస్లు రావా ల్సిందిగా సీఎం కార్యాలయం గురువారం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద బస్సులను ఏర్పాటు చేశామని, అఖిల భారత సర్వీసు అధికారు లందరూ ఆ బస్సుల్లో ఎక్కి పోలవరం రావా ల్సిందిగా సీఎం కార్యాలయం పేర్కొంది. అంచనా వ్యయంలో పెంపు, కమీషన్లు ఇచ్చే వారికి పనులు అప్పగింతలాంటి అక్రమాల ను కప్పిపుచ్చుకోవడానికే భారీ ప్రచార కార్యక్రమానికి తెర తీశారని అధికారులే విమర్శిస్తున్నారు. శుక్రవారం పోలవరం స్పిల్ వే కాంక్రీట్ పనులకు శంకుస్థాపన చేయడం, జనవరి 7న డయా ఫ్రం వాల్ నిర్మాణ పనులు, 14న స్పిల్ వే గేట్ల పనుల ప్రారంభ సంబరాలు నిర్వహించడం అందులో భాగమే నని చెబుతున్నారు. ఇందులో అఖిల భారత సర్వీసు అధికారులను భాగస్వామ్యం చేయా లని చూడటాన్ని పలువురు అధికారులు తప్పుపడుతున్నారు. సాధారణంగా ప్రాజెక్టు కు శంకుస్థాపన చేయడం.. జాతికి అంకితం చేసే కార్యక్రమాలనే ఘనంగా నిర్వహిస్తారని వారు చెబుతుండటం గమనార్హం.