breaking news
SP rajakumari
-
మోకరిల్లిన స్వరం
విజయనగరం ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబు కరోనా బారిన పడి కోలుకున్నారు. తన పై అధికారులు తనను తిరిగి విధులకు స్వాగతిస్తున్న సందర్భంలో జిల్లా ఎస్పీ రాజకుమారి ఔన్నత్యం మీద సొంతంగా పాట రాసి, బాణీలు సమకూర్చి, పాడి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఎస్పీ ఎదుట మోకాళ్లపై కూర్చొని నమస్కరిస్తూ కన్నీళ్లతో ఆమెను కొనియాడారు. ఊహించని ఆ అభివాదానికి ఎస్పీ..స్టేజ్ పై నుంచి అతడి వద్దకు వచ్చి ఆప్యాయంగా చేయిపట్టి పైకి లేపారు. ఆ దృశ్యాన్ని చూస్తున్న వారందరి కన్నులు చెమ్మగిల్లాయి. రాజకుమారి ఎదుట కన్నీళ్లతో పాటపాడుతున్న ఎఆర్ కానిస్టేబుల్ రాంబాబు. ఖాకీ డ్రెస్ వేసుకుంటే చట్టానికి కట్టుబడి, శాంతి భద్రతల సంరక్షణే బాధ్యతగా నడుచుకోవడం తప్ప భావోద్వేగాలకు లోనవడం ఉండదు. అయితే విజయనగరం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి.రాజకుమారి విధి నిర్వహణలో అధికారిగా ఉంటూనే.. సిబ్బందికి ఇంటి పెద్దలా నిలబడుతున్నారు. కష్టం వస్తే ఆదుకుంటున్నారు. ఒక ఆడపడుచుగా పోలీసు కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. అందుకు తాజా నిదర్శనమే కానిస్టేబుల్ రాంబాబు కృతజ్ఞతాభివందనం. కరోనా కాలంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర అత్యవసర విధుల్లోని వారితోపాటు.. పోలీసులు కూడా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది పోలీసులు కోవిడ్ కోరల్లో చిక్కుకుంటున్నారు. ఇళ్లలోనూ, ఆస్పత్రులలోనూ ఐసోలేషన్లోకి వెళ్లిపోయి కొన్నాళ్లపాటు కరోనాతో పోరాడి విజేతలుగా తిరిగి వస్తున్నారు. ఎస్పీ రాజకుమారి ఎదుట మోకరిల్లి నమస్కరిస్తూ పాట పాడుతున్న ఎఆర్ కానిస్టేబుల్ రాంబాబు ఆ సమయంలో వీరి విధులను కూడా ఎస్పీ రాజకుమారి నిర్వహిస్తున్నారు. రేయింబవళ్లు వారి స్థానంలో తనే రోడ్ల మీద పహారా కాస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అదే సమయంలో సిబ్బంది బాగోగులను వీడియో, టెలీకాన్ఫరెన్సుల ద్వారా నిరంతరం తెలుసుకుంటున్నారు. తగిన సూచనలు ఇస్తూ ధైర్యాన్ని నింపుతున్నారు. ఆమె అందించిన తోడ్పాటుతో, ఇచ్చిన స్ఫూర్తితో మానసిక దృఢత్వాన్ని సాధించి జిల్లాలో దాదాపు నాలుగు వందల మంది పోలీసులు కరోనానుంచి బయటపడ్డారు. వాళ్లందర్నీ సత్కరించి, నిత్యావసర సరుకులు అందించి, తిరిగి విధులకు సాదరంగా ఆహ్వానిస్తున్నారు ఎస్పీ రాజకుమారి. గతంలో ఎంతోమంది సమర్థులైన అధికారులను చూసి ఉండవచ్చు.. సిన్సియర్ ఆఫీసర్ల వద్ద పనిచేసి ఉండవచ్చు. కానీ.. ఈ కష్టకాలంలో అమ్మలా ఆదరిస్తున్న రాజకుమారి వంటి అధికారి దగ్గర పనిచేయడం తమ అదృష్టం అని విజయనగరం పోలీసులు భావిస్తున్నారు. – బోణం గణేష్, సాక్షి, విజయనగరం -
మోసం అతని నైజం
రాజమహేంద్రవరం (తూర్పుగోదావరి): ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను, రుణ మాఫీ అంటూ రైతులను మోసం చేసి పరారయ్యే ఘరానా మోసగాడిని జిల్లాలోని రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపిన వివరాల మేరకు మురమళ్ల గ్రామానికి చెందిన సలాది రాం గోపాల్ అలియాస్ సుంకర శివరాం, అలియాస్ వేణు గోపాల్ వివిధ మోసాలకు పాల్పడ్డాడు. 2006 సంవత్సరం న్యూవే ఫౌండేషన్, రైతు మిత్ర సంఘం, ఆంధ్రా కిసాన్ సంఘం, చంద్రన్న బీమా, స్వచ్ఛ భారత్ పథకాల్లో ఉద్యోగాలు, కాంట్రాక్టులు, రైతులకు రుణాలు, ఎరువులు ఉచితంగా ఇప్పిస్తానని నమ్మించాడు. నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకొని పరారయ్యేవాడు. ఇతడు రాష్ట్ర వ్యాప్తంగా 20కి పైగా కేసుల్లో నిందితుడు. 2014లో రాజమహేంద్రవరం రైతు మిత్ర ఫౌండేషన్ సంస్థ స్థాపించి పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ఉద్యోగాలు, రైతులకు రుణాలు ఇప్పిస్తామని చెప్పి రూ.1.45 లక్షలు వసూలు చేసి పరారయ్యాడు. 2016లో ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రన్న బీమా అనే కార్యాలయం పెట్టి అందులో ఫీల్డ్ ఆఫీసర్నని పరిచయం చేసుకుని దీపిక ట్రావెల్స్‌లో కారును అద్దెకు తీసుకొని రెండు నెలలు అద్దె చెల్లించి మూడో నెలలో కారుతో సహా ఉడాయించాడు. రాంగోపాల్ ఇప్పటికే 12 కేసుల్లో అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చాడు. మరో 8 కేసుల్లో అరెస్ట్ అవ్వాల్సి ఉంది. రాజమహేంద్రవరం, విశాఖపట్టణం, విజయవాడ ప్రాంతాల్లో ప్రజలను మోసం చేసి రూ.52.14 లక్షలతో పరారయ్యాడు. గత కొన్ని రోజులుగా తప్పించుకు తిరుగుతున్న అతడిని శుక్రవారం రాజమహేంద్రవరం శ్యామలానగర్ సెంటర్లో పోలీసులు పట్టుకున్నారు.