breaking news
Sony carista
-
చెన్నై టూ బ్యాంకాక్ అంటున్న జైఆకాశ్
నటుడు జైఆకాశ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం చెన్నై టూ బ్యాంకాక్.జి.ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై కే.షాజహాన్, కే.ఆనంద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్యాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. నటి సోనీ చరిష్టా, యాళిని కథానారుుకలుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్యపాత్రల్లో పవర్‌స్టార్, శామ్స్, అశ్విన్ నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ స్థానిక వడపళనిలోని ఏవీఎం స్టూడియోలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు ప్రభుసాలమన్ అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టగా దర్శకుడు త్యాగరాజ్ ముహూర్తం సన్నివేశాన్ని జైఆకాష్, శ్యామ్స్, అశ్విన్‌లపై చిత్రీకరించారు. అనంతరం దర్శకుడు చిత్ర వివరాలను తెలుపుతూ ఇంటి పనుల కోసం అంటూ చెన్నై నుంచి బ్యాంకాంక్‌కు అమ్మారుులను తీసుకెళ్లి చట్ట విరోధ పనులకు వాడుతుంటారన్నారు.వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నారన్నదే చిత్ర కథ అని తెలిపారు.చిత్ర షూటింగ్‌ను అధిక భాగం బ్యాంకాంక్‌లో తీసినట్లు వెల్లడించారు.అదే విధంగా పట్టయ్, బక్కట్, గోవా ప్రాంతాల్లోనూ చిత్రీకరణను జరపనున్నట్లు తెలిపారు. ఇందులో బ్యాంకాక్, మలేషియా నటీనటులు నటించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతాన్ని యూకే.మురళి, చాయాగ్రహనాన్ని దేవరాజ్ అందిస్తున్నట్లు తెలిపారు. -
సోనీ.. అందాల రాణి
‘హైదరాబాద్ అంటే ఎంతో ఇష్టం. ఇక్కడికి తరచూ వస్తుంటాన’ని వర్ధమాన నటి సోనీ చరిస్తా చెప్పారు. నాంపల్లి స్టేషన్ రోడ్‌లోని లేపాక్షి ఫర్నీచర్ షోరూమ్‌లో ఎక్స్‌క్లూజివ్ వెడ్డింగ్ ఫర్నీచర్‌ను ఆమె శుక్రవారం ప్రారంభించారు. 30 శాతం డిస్కౌంట్‌తో సరికొత్త ఫర్నీచర్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు షోరూం మేనేజర్ అనిత చెప్పారు. - గన్‌ఫౌండ్రీ -
మన విద్యావిధానంపై...
ఇప్పటి విద్యావిధానంతో పిల్లల ఇబ్బందులు, వారి మీద ఆ ఒత్తిడి ఎలా ఉందన్న అంశంతో ‘టాప్ ర్యాంకర్స్’ అనే చిత్రం రూపొందుతోంది. రాజేంద్రప్రసాద్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి గోళ్ళపాటి నాగేశ్వరరావు దర్శకుడు. పసుపులేటి బ్రహ్మం నిర్మాత. సోనీ చరిష్టా నటిస్తున్నారు. ఈ నెల 30న విడుదల. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ ‘‘ఈ క్లిష్టమైన అంశాన్ని చాలా బాగా డీల్ చేశారు’’ అని చెప్పారు