breaking news
Sokaj notices
-
కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డికి షోకాజ్ నోటీసు
-
ముగ్గురు బాక్సర్లకు షోకాజ్ నోటీస్
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై ఆరోపణలు చేసిన ముగ్గురు బాక్సర్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ట్రయల్స్‌లో కోచ్‌లు, సెలక్షన్ కమిటీ కుమ్మక్కై జట్టు ఎంపికను ప్రకటించారని బాక్సర్లు దినేశ్ కుమార్, దిల్బాగ్ సింగ్, ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు భారత బాక్సింగ్ సమాఖ్య ముగ్గురు సభ్యులతో క్రమశిక్షణ కమిటీని నియమించింది. మంగళవారం సమావేశమైన ఈ కమిటీ బాక్సర్లకు నోటీసులు జారీ చేస్తూ ఈనెల 15లోగా సమాధానమివ్వాలని ఆదేశిం చింది. జట్టు గురించి ఆరోపణలు చేయడం శిక్షార్హమని, వీటిని నిరూపించకుంటే కఠిన శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐబీఎఫ్ అధ్యక్షుడు మటోరియా అన్నారు. -
నిట్‌లో ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
నిట్ క్యాంపస్, న్యూస్‌లైన్ : వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో బోధన, బోధనేతర సిబ్బందికి షోకాజ్ నోటీసుల పరంపర సాగుతోంది. నిట్ టెక్నికల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకుడు జి.ఆనంద్‌కు డెరైక్టర్ ఫ్రోఫెసర్ టి.శ్రీనివాసరావు మంగళవారం నోటీసు జారీ చేశారు. విద్యార్థులు ఇచ్చిన పాత పరుపు, బకెట్ తీసుకువెళ్తుండగా సెక్యూరిటీ కాంట్రాక్టర్ అఖిల్ గుర్తించి అడ్డుకున్నారు. ఈ విషయంలో ఆనంద్‌కు నోటీ సు జారీ అయింది. గతంలో గణితశాస్త్ర విభాగం ప్రొఫెసర్ అయ్యంగార్ పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు సమావేశానికి రూ.2.50లక్షలు ఖర్చు చేసినందుకు అదే విభాగంకు చెందిన ప్రొఫెసర్ వై.ఎన్.రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేయడం వివాదానికి దారి తీసింది. అలాగే, బోధనేతర సిబ్బంది మైదం సంజీవకు మెస్ బిల్లుల విషయంలో, సిద్దిరాములు, సుబ్బారావు, మహబుల్తో పాటు ఫిజికల్ డెరైక్టర్ పి.రవికుమార్‌కు వివిధ సందర్బాల్లో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇంకా నిట్ బోధనేతర సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం ప్రధాన భవనం ఎదుట ఆందోళనకు దిగగా, వారికి కూడా నోటీసు జారీ చేసిన విషయం విదితమే. కాగా, సమస్యలపై ప్రశ్నించడం, ఆందోళనకు దిగడం జరిగితే నోటీసులు జారీ చేయడం ఆనవాయితీగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.