breaking news
shoots wife
-
భార్యను గన్‌తో కాల్చి చంపిన భర్త
కర్ణాటక: భార్యను భర్త పిస్తోల్ కాల్చి హత్య చేసిన ఘటన కొడగు సోమవారపేట తాలూకా బెట్టళ్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి జరిగింది. కిషన్ అలియాస్ గోపాల్–చస్మా దంపతులు గొడవ పడ్డారు. ఆవేశంతో కిషన్ తన వద్ద ఉన్న పిస్తోల్‌తో చస్మాపై కాల్పులు జరిపాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ విషయాల కారణంగానే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. -
భార్యను కాల్చి చంపిన బీజేపీ నేత.. పరారీ
మీరట్: ఉత్తరప్రదేశ్‌లో ఓ బీజేపీ ఎమ్మెల్యే దారుణానికి దిగాడు. భార్యతో గొడవపడి ఆమెపై కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకునేందుకు సిద్ధపడ్డాడు. అయితే, ఇంట్లో ఉన్న ఇతరులు అతడి చర్యను అడ్డుకోవడంతో ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. భార్య మాత్రం చనిపోయింది. బీజేపీ నాయకుడు కులదీప్ తోమర్ తన భార్య పూనమ్‌తో తొలుత గొడవపడ్డాడు. ఆ తర్వాత విపరీతంగా తిట్టుకున్నారు. తొలుత చేయి చేసుకున్న ఆయన అనంతరం తన దగ్గర ఉన్న తుపాకీతో భార్యపై కాల్పులు జరిపాడు. అనంతరం తనకు తుపాకీ ఎక్కుపెట్టుకొని కాల్చుకోబోతుండగా ఇంట్లో మేనళ్లుడు వచ్చి అడ్డుకున్నాడు. పూనమ్‌ను ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే, భార్య చనిపోయిందనే భయంతో ప్రస్తుతం కులదీప్ పరారీలో ఉన్నాడు. మొత్తం ఆయన కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు.