శివమ్ శుక్లాకు మూడో స్వర్ణం
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ కప్ షూటింగ్
న్యూఢిల్లీ : ఇప్పటికే రెండు స్వర్ణాలు సాధించి ఊపు మీదున్న యువ షూటర్ శివమ్ శుక్లా మరోసారి మెరిశాడు. జర్మనీలోని సుల్లో జరుగుతున్న రెండో ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ కప్ షూటింగ్ టోర్నీ నాలుగో రోజు మంగళవారం తను 25 మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్‌లో స్వర్ణం సాధించాడు. అలాగే ఇదే విభాగంలో జరిగిన టీమ్ ఈవెంట్లో శుక్లా.. అర్జున్ దాస్, సిమర్జిత్ సింగ్‌తో కలిసి రజతం సాధించాడు. 50మీ. రైఫిల్ 3 పొజిషన్లో అఖిల్ షియోరన్ తృటిలో స్వర్ణం కోల్పోయి రజతంతో సంతృప్తి పడ్డాడు. 25మీ. పిస్టల్ మహిళల జూనియర్ టీమ్ ఈవెంట్లో భారత్ కాంస్యం సాధించింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇప్పటిదాకా భారత్‌కు 13 పతకాలు లభించాయి.