breaking news
Sharjah flight
-
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం
తిరువనంతపురం: తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి షార్జాకు వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో, విమానాన్ని ముందు జాగ్రత్తగా కేరళలో తిరువనంతపురం విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. 154 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో సోమవారం ఉదయం 10.45 గంటలకు తిరుచిరాపల్లి నుంచి ఎయిరిండియా విమానం టేకాఫ్ తీసుకుంది. కొద్దిసేపటికే ఇంజిన్లో సమస్యలు తలెత్తినట్లు గుర్తించిన పైలట్ అధికారులకు సమాచారం అందించారు. వారి సూచనల మేరకు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి స్థాయి అత్యవసర పరిస్థితి ప్రకటించి, మధ్యాహ్నం 12.01 గంటలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. తిరువనంతపురం–బహ్రెయిన్ ఎక్స్ప్రెస్ సాంకేతిక లోపంతో నిలిచిపోయిందని ఎయిరిండియా పేర్కొంది. -
షార్జా విమానానికి తప్పిన పెను ప్రమాదం
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం షార్జాకు బయలు దేరిన విమానానికి పెనుప్రమాదం తప్పింది. కొద్ది దూరం వెళ్లాక విమాన ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడాన్ని గర్తించిన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించారు. సాంకేతిక లోపాన్ని పైలట్ ముందే పసిగట్టడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.