breaking news
Sharing App
-
బైక్ రైడ్ కావాలా? అయితే ‘రాపిడో’..!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మెట్రో నగరాల్లో ఒక చోటు నుంచి ఇంకో చోటుకు ప్రయాణించాలంటే? బస్సు, క్యాబ్ లేదా ఆటో తప్పనిసరి. వీటి చార్జీలూ కాస్త ఎక్కువే.. పైగా ట్రాఫిక్ సమస్య! అందుబాటు ధరలో.. సులువైన, సురక్షితమైన ప్రయాణం చేయాలంటే? బైక్ కరెక్ట్!! అలా అని సొంతంగా బైక్‌లను కొని అద్దెకివ్వాలంటే.. పెద్ద మొత్తంలోనే పెట్టుబడి కావాలి. అందుకే కాస్త డిఫరెంట్‌గా ఆలోచించారు ఐఐటీ భువనేశ్వర్ పూర్వ విద్యార్థుల త్రయం. ఓలా, ఉబర్‌లా మాదిరి బైక్ షేరింగ్ సేవలను ప్రారంభించారు. మరిన్ని వివరాలు రాపిడో కో–ఫౌండర్ అరవింద్ సంక ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. మాది విజయవాడ దగ్గర్లోని తిరువూరు. ఐఐటీ భువనేశ్వర్‌లో ఇంజనీరింగ్ పూర్తయ్యాక.. ఫ్లిప్‌కార్ట్‌లో చేరా. సొంతగా కంపెనీ ప్రారంభించాలన్న ఆలోచనతో ఐఐటీలో స్నేహితులైన పవన్ గుంటుపల్లి, రిషికేష్ ఎస్‌ఆర్‌లతో కలిసి 2015 నవంబర్‌లో బెంగళూరు కేంద్రంగా రాపిడోను ప్రారంభించాం. కస్టమర్ల రిజిస్ట్రేషన్ కోసం ట్రూ కాలర్‌తో ఒప్పందం చేసుకున్నాం. యాప్‌ను డౌన్లోడ్ చేశాక.. రిజిస్టర్ విత్ ట్రూకాలర్ ఆప్షన్ ఎంచుకుంటే చాలు. మొబైల్ నంబర్, ప్రొఫైల్, ఓటీపీ ఏవీ అవసరం లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. రైడర్స్‌కు బీమా సౌకర్యం ఉంటుంది. కస్టమర్ యాప్‌లో లాగిన్ అయి.. చేరాల్సిన గమ్యాన్ని ఎంట్రీ చేయగానే.. దగ్గర్లో అందుబాటులో ఉన్న బైక్‌లు కనిపిస్తాయి. డ్రైవర్ ప్రొఫైల్, ధర వస్తుంది. ఒకే చేయగానే రైడర్ రెండు హెల్మెట్లతో మీ దగ్గరికొస్తాడు. గమ్యస్థానాన్ని చేరుకున్నాక నగదు గానీ వ్యాలెట్ ద్వారా గానీ చెల్లింపులు చేయాలి. అంధులు, మానసిక వికలాంగుల కోసం రీడీమ్ ఫీచర్‌ను జోడించాం. గమ్యస్థానాన్ని వాయిస్ రూపంలో పలికితే అది టెక్ట్స్‌గా మారుతుంది. దీంతో పాటూ బ్యాంక్ ఖాతా అనుసంధానంతో వాలెట్ ద్వారా చెల్లింపులు పూర్తవుతాయి. ఏపీ, తెలంగాణల్లో 15 లక్షల రైడ్స్.. ప్రస్తుతం 15 లక్షల మంది కస్టమర్లున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 4 లక్షల మంది. రోజుకు 40 వేల రైడ్స్. తెలుగు రాష్ట్రాల నుంచి 8 వేల వరకూ ఉంటాయి. నెలవారీ బైక్ పాస్ కూడా ఉంటుంది. నెలకు 50 ట్రిప్పులకు రూ.1,500 చార్జీ. కి.మీ.కు రూ.3 చార్జీ ఉంటుంది. ప్రతి రైడ్‌పై 15–20 శాతం డ్రైవర్ నుంచి కమిషన్ తీసుకుంటాం. జనవరి నాటికి రూ.10 కోట్ల నిధులు.. ప్రస్తుతం 200 మంది ఉద్యోగులున్నారు. జనవరి నాటికి రూ.10 కోట్ల నిధులను సమీకరించనున్నాం. ఇందులో పాత ఇన్వెస్టర్లతో పాటూ పలువురు వీసీలూ పాల్గొంటారు -
టెరానెట్ నుంచి మెష్ మీడియా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్వీడన్ కేంద్రంగా పనిచేసే టెరానెట్ సంస్థ తాజాగా ‘మెష్‌మీడియా’ పేరిట కొత్త షేరింగ్ యాప్‌ను ఆవిష్కరించింది. వై-ఫైతో పనిలేకుండా స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లు, పీసీలు వంటి పరికరాలకు దీని ద్వారా వీడియోలు, మ్యూజిక్ మొదలైన వాటన్నింటిని షేర్ చేసుకోవచ్చని సంస్థ భారత విభాగం ఎండీ వైఆర్ రావు శుక్రవారమిక్కడ వెల్లడించారు. ప్రస్తుతం ఈ తరహా యాప్‌లు కొన్ని ఉన్నప్పటికీ.. వాటికి ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లపరంగా కొన్ని పరిమితులున్నాయని, ఏకకాలంలో పలు పరికరాలకు షేర్ చేసుకునే వీలు కూడా లేదని ఆయన వివరించారు. అయితే, ఓఎస్‌తో సంబంధం లేకుండా మెష్‌మీడియాను ఉపయోగించి అన్ని రకాల స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ డివైజ్‌లకు ఏకకాలంలో ఫైల్స్‌ను పంపగలిగే వీలుంటుందని రావు తెలిపారు. సుమారు 200 మీటర్ల పరిధిలో ఇది పనిచేస్తుందని చెప్పారు. నెట్వర్క్ అంతగా ఉండని కాలేజ్ క్యాంపస్‌లు, బస్సులు, రైళ్లు, ఎయిర్‌పోర్టులు మొదలైన ప్రాంతాల్లో మెష్‌మీడియా మరింత ఉపయోగకరంగా ఉండగలదన్నారు. 2017లో ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ మొదలైన వాటిల్లో అందుబాటులోకి తెస్తున్నామని ఆయన తెలిపారు. ఫీజు సుమారు రూ.100 స్థాయిలో ఉండగలదన్నారు. తయారీ దశలోనే చిప్‌లలో ఈ టెక్నాలజీని పొందుపర్చేలా క్వాల్కామ్ సంస్థతో, కంటెంట్ కోసం సోనీ మొబైల్‌తో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు రావు చెప్పారు. దీని ద్వారా కనెక్టివిటీ విభాగంలో వచ్చే మూడేళ్లలో 25% వాటా దక్కించుకోవాలని భావిస్తున్నట్లు ఆయన వివరించారు.