shaikshavali
-
అడిషనల్ ఎస్పీగా షేకా్షవలి
– కమాండ్ కంట్రోల్ సెంటర్లో బాధ్యతలు స్వీకరణ కర్నూలు: కర్నూలు అడిషనల్ ఎస్పీగా (అడ్మిన్) పి.షేకా్షవలి బాధ్యతలు స్వీకరించారు. శివరామ్‌ప్రసాద్ పదవీవిరమణ పొందడంతో ఆ స్థానంలో షేకా్షవలిని నియమిస్తూ వారం రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సీఐడీ హెడ్ ఆఫీసులో పనిచేస్తూ ఈయన కర్నూలుకు బదిలీ అయ్యారు. అనంతపురం జిల్లా, వెలుగప్ప మండలం, శ్రీరంగపురం ఈయన స్వస్థలం. అనంతపురం కలెక్టర్ ఆఫీసులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా, రెవెన్యూ ఇన్స్పెక్టర్గా, సీనియర్ అసిస్టెంటుగా పది సంవత్సరాల పాటు పని చేశారు. 2001లో గ్రూప్–1 ఎంపికై మొదట చిత్తూరు డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆఫీసులో పని చేస్తూ ప్రమోషన్‌పై హైదరాబాద్‌కు బదిలీ అయి ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లోని మెడికల్ హెల్త్ డిపార్టుమెంటులో పని చేశారు. 2011లో సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సీనియార్టీ మేరకు పోలీసు శాఖలో డీఎస్పీగా చేరి అప్పాలో శిక్షణ పూర్తి చేసుకొని, 2012లో విశాఖపట్టణం ప్రాక్టికల్ ట్రైనింగ్, గ్రేహౌండ్స్, 2013లో సీఐడీ హైదరాబాద్, 2014లో గుంటూరు రైల్వేలో పని చేశారు. 2015లో మళ్లీ సీఐడీ హైదరాబాద్ వెళ్లి ఇప్పటి వరకు పనిచేశారు. అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొంది కర్నూలుకు బదిలీపై ఏఎస్పీగా నియమితులయ్యారు. గురువారం ఉదయం జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణను కలిసి పూల బోకే ఇచ్చి, మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా జిల్లాలోని పలువురు డీఎస్పీలు, సీఐలు అడిషనల్ ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
భక్తుల తిప్పలు భగవంతునికెరుక
హŸళగుంద: ప్రసిద్ధి చెందిన ఎల్లార్తి షేక్షావలి, షాషావలి దర్గాల వద్ద భక్తులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు. 18 ఏప్రిల్ 2014న దర్గాలను స్వాధీనం వక్ఫ్‌బోర్డు స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి మూడు నెలకోసారి టెండర్ ద్వారా దర్గాల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తోంది. ఇలా ప్రతిసారి రూ. 20 లక్షలకుపైగానే ఆదాయం వస్తోంది. ఈ నెల రూ.22 లక్షలకు టెండర్ పలికింది. ఇలా టెండర్ల ద్వారా ఇప్పటి వరకు దాదాపు రూ. రెండు కోట్ల ఆదాయం సమకూర్చుకున్న వక్ఫ్‌బోర్డు.. భక్తులకు వసతులు కల్పించడంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. వచ్చిన ఆదాయంలో 10 శాతం ఖర్చు చేసినా మెరుగైన వసతులు కల్పించే అవకాశం ఉన్నా ఆ దిశగా దృష్టి పెట్టకపోవడంతో భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి గురు,శుక్రవారాల్లో మొక్కులు చెల్లించుకునేందుకు ఎంతో దూరం నుంచి వస్తున్న భక్తులు ఇక్కడి వసతులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సరిపడా గదులు లేకపోవడంతో ఆరుబయటే నిద్రిస్తున్నారు. ఇతర అన్ని కార్యకలాపాలకు ఇబ్బందులు పడుతున్నారు. మహిళల పరిస్థితి మరీ ఇబ్బందిగా మారింది. ఆకతాయిల వేధింపులు అధికం కావడంతో సతమతమవుతున్నారు. సమస్యలను వక్ఫ్‌బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. కనీస వసతులైనా కల్పించాలి: షేక్షావలి, ఆదోని దర్గాలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇక్కడ వసతులు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గదులు లేకపోవడంతో ఆరుబయటే నిద్రించాల్సి వస్తోంది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా నీటి వసతి లేదు. పారిశుద్ధ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో నుంచి దర్గాల నిర్వహణ బాధ్యతలు తీసుకున్న వక్ఫ్‌బోర్డు అధికారులు అభివృద్ధి చేయాల్సింది పోయి ఇలా నిర్లక్ష్యం వహించడం సరికాదు. దర్గాల అభివృద్ధికి కషి: డాక్టర్ సయ్యద్ ఖాద్రి, ముతవల్లి(ఫోటో:123ఈ) షేక్షావలి, షాషావలి దర్గాల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా. ఈ రెండు దర్గాలు 2014 ఏప్రిల్‌లో వక్ఫ్‌బోర్డు పరిధిలోకి వచ్చాయి. వక్ఫ్‌బోర్డు అధికారులు ప్రతి మూడు నెలలకోసారి టెండర్ ద్వారా నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ దర్గాలకు ముతవల్లిగా ఉన్నాను. సందల్ మంటప్ ఇతర చిన్నచిన్న మరమ్మతు పనులు, అభివద్ధి పనులను వక్ఫ్‌బోర్డు అధికారుల సహకారంతో చేపడ్తాను. అందరూ సహకరిస్తే అభివృద్ధి చేస్తాం. ప్రణాళిక రూపొందించాం: ముక్తార్‌బాషా, వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్ అండ్ ఆడిటర్ త్వరలో దర్గాల అభివృద్ధి పనులకు ప్రణాళిక తయారు చేశాం. త్వరలో పనులు ప్రారంభిస్తాం. మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర పనులు బక్రీద్ తర్వాత చేపడతాం. భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం.