breaking news
Shah Rukh Khan
-
సెట్లోనే కన్ను మూయాలనుంది
‘‘జీవితాంతం నేను నటుడిగానే ఉంటాను. సినిమా సెట్లో కన్ను మూయాలన్నదే నా సంకల్పం’’ అని పేర్కొన్నారు షారుక్ ఖాన్. భారతీయ చిత్ర పరిశ్రమకు తాను చేసిన సేవలకుగాను ‘లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్’లో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు షారుక్. ఈ సందర్భంగా ఆయన అక్కడి మీడియాతో ముచ్చటించారు. అందులో భాగంగా ‘జీవితాంతం మీరు నటుడిగానే కొనసాగుతారా?’ అని ఓ విలేకరి ప్రశ్నించారు.ఇందుకు షారుక్ బదులిస్తూ... ‘‘చనిపోయే వరకూ సినిమాల్లోనే ఉంటాను. ఏదైనా సినిమా సెట్లో యాక్షన్ చెప్పగానే నేను చనిపోవాలి. వాళ్లు కట్ చె΄్పాక కూడా పైకి లేవకూడదు. ఇదే నా కోరిక’’ అన్నారు. అలాగే స్టార్‌డమ్‌ని మీరు ఎలా ఫీలవుతారు? అనే మరో ప్రశ్నకు స్పందిస్తూ... ‘‘స్టార్‌డమ్‌ను చాలా గౌరవిస్తాను. ఎందుకంటే దానివల్లే ఫ్యాన్స్ ప్రేమ, ఆదరణ, గుర్తింపు, డబ్బు లభించాయి. ఇక నాకు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. అయితే ప్రస్తుతం ప్రజలు చాలా సున్నితమనసున్నవారయ్యారు. ఏం చెప్పినా డిస్టర్బ్ అవుతున్నారు. కాబట్టి సెన్సాఫ్ హ్యూమర్ లేకపోవడమే మంచిది’’ అన్నారు షారుక్ ఖాన్. -
అనంత్ అంబానీ పెళ్లి.. ఆ హీరోలకు గిఫ్ట్‌గా కోట్ల విలువైన వాచీలు
అంబానీల ఇంట్లో పెళ్లి గురించి ఎంత మాట్లాడుకున్నా తరగదు అన్నట్లు ఉంది. ఎందుకంటే గత కొన్నాళ్లుగా ఏదో ఓ పేరుతో ఫంక్షన్ నిర్వహిస్తూనే ఉన్నారు. తాజాగా ముఖ్యమైన పెళ్లి వేడుక కూడా జరిపించారు. దీనికి బాలీవుడ్, టాలీవుడ్, టీమిండియా క్రికెటర్లతో పాటు ప్రధానమంత్రి స్థాయి నుంచి ముఖ్యమంత్రులు వరకు చాలామంది హాజరై, హాట్ టాపిక్ అయిపోయారు. ఇదంతా పక్కనబెడితే అనంత్.. తన స్నేహితులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: అంబానీ పెళ్లిలో ఐశ్వర్య రాయ్.. డిస్కషన్ మాత్రం విడాకుల గురించి!)ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ పెళ్లి వేడుక కనివినీ ఎరుగని రీతిలో జరిగింది. దాదాపు రూ.5000 కోట్ల మేరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే అనంత్‌కి బాలీవుడ్లో బోలెడంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్లలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, రణ్వీర్ సింగ్ తదితరులు ఉన్నారు. ఇప్పుడు వీళ్లకే తన పెళ్లి సందర్భంగా అనంత్ అంబానీ ఖరీదైన వాచీలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.లగ్జరీ వాచీలకు పెట్టింది పేరైన 'అడెమార్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ పెర్పుట్యల్ కాలండెర్' అనే వాచీనీ అనంత్ బహుమతులుగా ఇచ్చాడు. మార్కెట్లో ఒక్క వాచీ ధర రూ.2 కోట్ల పైమాటే అని తెలుస్తోంది. వీటితో షారుక్, రణ్వీర్ పోజులిచ్చిన పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: అంబానీ పెళ్లిలో స్పెషల్ ఎట్రాక్షన్ వీళ్లదే.. పిక్ అదిరిపోయింది!) View this post on Instagram A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology)