breaking news
seethammadhara
-
బాలుడి కడుపులో ఫుట్‌బాల్ సైజ్ కణితి
విశాఖపట్నం: హాయిగా ఆడిపాడుతూ, ఎంచక్కా చదువుకునే వయసు ఆ బాలుడిది. పదహారేళ్ల ప్రాయంలో ఉరకలెత్తే ఉత్సాహంతో ఉండాల్సిన ఆ బాలుడు కాస్తా దాదాపు నెల రోజుల నుంచి విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతూ, తరచు జ్వరం వస్తుండడంతో నీరసించిపోయాడు. వేరే ఆస్పత్రులలో చూపించగా.. కాలేయంలో ఇన్ఫెక్షన్ ఉందని మందులు వాడారు.అయినా ఫలితం లేకపోవడంతో విశాఖపట్నంలోని కిమ్స్ సీతమ్మధార ఆస్పత్రికి తీసుకురాగా.. ఇక్కడ పరీక్షలు చేస్తే అది కేన్సర్ అని తేలింది. అతడికి అరుదైన, సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించిన సీనియర్ జీఐ, లివర్ సర్జన్ డాక్టర్ మురళీధర్ నంబాడ ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలిపారు.“ఆ బాలుడు ఇక్కడకు వచ్చేసరికే అతడికి పొట్ట బాగా ఉబ్బిపోయి ఉంది. దాంతో కాలేయంలో ఏదో ఇబ్బంది ఉందని గుర్తించాము. పరీక్షలు చేయగా అతడికి అత్యంత అరుదైన కాలేయ కేన్సర్ వచ్చిందని తెలిసింది. దాన్ని వైద్య పరిభాషలో మాలిగ్నెంట్ హెపాటిక్ యాంజియో మైలోలిపోమా అంటారు. ఇది కాలేయంలో కుడివైపు దాదాపు సగభాగాన్ని ఆక్రమించుకుని ఉంది. సీటీ స్కాన్, ఎంఆర్ఐ లాంటి పరీక్షలు కూడా చేసి, కణితి సరిగ్గా ఎక్కడినుంచి ఎక్కడివరకు ఉంది, ఏయే భాగాలను ఆక్రమించింది, ఎలాంటి పొజిషన్లో ఉందనే విషయాలను గుర్తించాం.అనంతరం వెంటనే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించాం. మొత్తం శస్త్రచికిత్సకు దాదాపు ఆరున్నర గంటల సమయం పట్టింది. 4.5 కిలోల బరువున్న ఆ కణితి.. దాదాపు ఫుట్‌బాల్ పరిమాణంలో ఉంది. ఇది చాలా పెద్ద కణితి. ఇలాంటి దాన్ని ఎలాంటి సమస్యలు లేకుండా తొలగించడం కూడా చాలా కష్టం. కణితి నుంచి ఏమాత్రం రక్తస్రావం కాకూడదు. అలాగే కణితి కూడా కాలేయంలో మిగలకుండా పూర్తిగా తొలగించాలి. అదే సమయంలో ఆరోగ్యవంతమైన భాగాన్ని యథాతథంగా కాపాడుకోవాలి.ఎందుకంటే, కాలేయం అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. రోగి వయసు 16 సంవత్సరాలే కాబట్టి, తర్వాత కాలేయం పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల మిగిలిన కాలేయాన్ని కాపాడుకోవాలి. అయితే కణితి పరిమాణంతో పాటు అది ఉన్న ప్రదేశం కూడా చాలా సమస్యాత్మకం. దాంతో అత్యంత జాగ్రత్తగా ప్లాన్ చేసి, పూర్తి స్థాయి కచ్చితత్వంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది” అని డాక్టర్ మురళీధర్ వివరించారు.శస్త్రచికిత్స అనంతరం బాలుడు వేగంగా కోలుకోవడంతో ఐదోరోజే డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం కీమోథెరపీ ఆరు సైకిల్స్ కూడా పూర్తిచేసుకుని అతడు తన రోజువారీ కార్యకలాపాలను సాధారణంగానే చేసుకోగలుగుతున్నాడు. అత్యంత సంక్లిష్టమైన ఇలాంటి శస్త్రచికిత్సలను కూడా సీతమ్మధారలోని కిమ్స్ ఆస్పత్రిలో విజయవంతంగా చేసి, తమ కుమారుడి ప్రాణాలు కాపాడినందుకు బాలుడి తల్లిదండ్రులు ఆస్పత్రి వైద్యులకు, సిబ్బందికి, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. -
విశాఖ సీతమ్మధార ట్రెజరీలో భారీ స్కామ్
-
రైతు బజార్లో మంత్రి గంటా తనిఖీలు
విశాఖపట్టణం : విశాఖపట్నం నగరంలోని సీతమ్మధార రైతు బజారులో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు బజారు నిర్వాహణ తీరుపై ఆయన ఉన్నతధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బజారులో ఉల్లి ధరలపై ఆరా తీశారు. ఉల్లి ధరలు అందుబాటులోకి వచ్చే వరకు సబ్సిడీ ధరలకే ఉల్లిని అందించాలని గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఉన్నతాధికారులను ఆదేశించారు. అంతేకాకుండా డిమాండ్‌కు తగ్గట్లు ఉల్లి అందుబాటులో ఉండేలా చూడాలని గంటా శ్రీనివాసరావు రైతు బజారు అధికారులకు సూచించారు. -
సీతమ్మదార ''ఈనాడు'' ఖాళీ
-
సీతమ్మధారలోని 'ఈనాడు' కార్యాలయం ఖాళీ
విశాఖ : సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో విశాఖపట్నం సీతమ్మధారలోని ఈనాడు కార్యాలయాన్ని ఎట్టకేలకు ఆ సంస్థల అధినేత రామోజీరావు ఖాళీ చేస్తున్నారు. ఇందు కోసం నిన్న రాత్రి భారీ క్రేన్లు, 200మందికి పైగా పనివాళ్లను నియమించారు. మంగళవారం ఉదయం కార్యాలయం ఫెన్సింగ్ తొలగించి యంత్రాలను ఆటోనగర్‌కు తరలిస్తున్నారు. కాగా ఈ వివాదానికి సంబంధించి ఆర్సీసీ కోర్టులో నేడు వాయిదా ఉండి. కాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో భవనాన్ని ఖాళీ చేయకపోతే పాత బకాయిల కింద రూ.2.60 కోట్లు, రెండు నెలల అద్దె రూపంలో రూ.34 లక్షలను ఫిబ్రవరి 10లోపు రామోజీ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఆలోపే భవనాన్ని ఖాళీ చేసి బయట పడాలని ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని, సిబ్బందికి ఆ మేరకు ఆదేశాలిచ్చారని తెలిసింది.