breaking news
Sayidharam Tej
-
తేజు కోసం ఈ కథ రాయలేదు
‘పటాస్’ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మలి చిత్రం ‘సుప్రీమ్’ నేడు తెరపైకి వస్తోంది. సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిల్ చెప్పిన విశేషాలు... ‘పటాస్’ ఫస్ట్ కాపీ చూసి ‘దిల్’ రాజుగారు అభినందించారు. అప్పటి నుంచి ఎమోషనల్‌గా ఆయనకు కనెక్ట్ అయిపోయా. మా కాంబినేషన్లో సినిమా చేయాలనుకున్నప్పుడు తేజు (సాయిధరమ్ తేజ్)ని హీరోగా అనుకోలేదు. కథ రెడీ చేశాక, ఎవరైతే బాగుంటుందా అని ఆలోచించి తనను ఎంచుకున్నాం ఇందులో హీరో క్యాబ్ డ్రైవర్. ఆ క్యాబ్ పేరే ‘సుప్రీమ్’. ఈ కథలో హనుమంతుడి లాంటి ట్యాక్సీ డ్రైవర్ ఎవరి కోసం వాయు వేగంతో వెళ్లాడన్నది సప్పెన్స్ చిరంజీవిగారి ‘అందం హిందోళం...’ పాట ఈ చిత్రానికి హెల్ప్ అవుతుందని రీమిక్స్ చేయలేదు. నాకున్న ప్యాషన్‌తో చేశా. ‘పటాస్’లో కామెడీ టైమింగ్ బావుందని మెచ్చుకున్నారు. ఈ సినిమాలోనూ అలానే ఉంటుంది. దానికి కారణం రాజేంద్రప్రసాద్‌గారు, జంధ్యాలగార్ల చిత్రాలను ఇన్స్పిరేషన్గా తీసుకోవడమే బాలకృష్ణగారితో ‘రామారావు’ చిత్రం చేయాలనుకున్నా. ఏప్రిల్‌లోపు కథ పూర్తి చేసి, చెప్పమన్నారు. ‘సుప్రీమ్’తో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయా. భవిష్యత్తులో అవకాశమొస్తే ఆయనతో సినిమా చేస్తా. -
ఎంత సపోర్ట్ ఉందన్నది కాదు... ఎంత కష్టపడ్డామన్నదే ముఖ్యం - చిరంజీవి
‘‘ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమా టైటిల్ వినగానే నా సినిమాలు ‘దొంగ మొగుడు’, ‘బావగారూ బాగున్నారా’ సినిమాలు గుర్తుకువచ్చాయి’’ అని చిరంజీవి అన్నారు. సాయిధరమ్ తేజ్, రెజీనా జంటగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘దిల్’రాజు నిర్మించిన చిత్రం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. శిరీష్, లక్ష్మణ్ సహ నిర్మాతలు. మిక్కీ జె. మేయర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో చిరంజీవి విడుదల చేశారు. ఈ సంద ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ -‘‘ప్రతి శాఖలోనూ గ్రిప్‌ను సంపాదించి మంచి నిర్మాతగా కొనసాగుతున్న ‘దిల్’రాజు, అలాగే ‘గబ్బర్‌సింగ్’ సినిమాను ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించిన హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్ని ఫ్రేముల్లోనూ తేజు చాలా కష్టపడ్డాడని అందరూ అంటూంటే చాలా ఆనందం వేసింది. ఎంత సపోర్ట్ ఉందన్నది కాదు... ఎంత కష్టపడ్డామన్నదే ముఖ్యం అని ఎప్పుడూ చెబుతూ ఉంటా’’ అని అన్నారు. ‘‘మెగాస్టార్ అభిమానులు కాలర్ ఎగరేసుకుని తిరిగేలా కష్టపడతాను’’ అని సాయిధరమ్ తేజ్ చెప్పారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ- ‘‘మా బ్యానర్‌ను మొదలు పెట్టి 14 ఏళ్లయింది. ‘పిల్లా నువు లేని జీవితం’ సినిమాకు ముందే సాయిధరమ్ తేజ్‌ను ఈ సినిమాలో హీరోగా అనుకున్నాం. సాయిధరమ్ తేజ్ నాలుగో సినిమాకే పవన్‌కల్యాణ్ రేంజ్‌కు వెళ్లిపోతారు. వచ్చే నెల 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నటుడు రావు రమేష్, దర్శకులు రవికుమార్ చౌదరి, అనిల్ రావిపూడి, ‘పవర్’ బాబి, గోపీచంద్ మలినేని తదితరులు పాల్గొన్నారు.