breaking news
satya narayana reddy
-
టెన్త్ ఎగ్జామ్స్: నిమిషం నిబంధనలేదు కానీ,..
సాక్షి, హైదరాబాద్ : రేపటినుంచి జరగబోతున్న పదవ తరగతి పరీక్షలకు ఒక నిమిషం నిబంధన ఏమీ ఉండదని, కానీ.. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకుంటే మంచిదని ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్ఎస్సీ పరీక్షల కోసం మొత్తం 5 లక్షల 34 వేల మంది విద్యార్థులు హాజరవుతారని వెల్లడించారు. 2530 పరీక్ష కేంద్రాలు పరీక్షలకు సిద్ధం చేశామని చెప్పారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా ఫ్లైయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు మంచి నీటి సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలల్లో లిక్విడ్ హ్యాండ్ వాష్ లాంటివి సిద్ధం చేశామని చెప్పారు. చదవండి : రేపటి నుంచే టెన్త్ పరీక్షలు -
బాలికపై అత్యాచారయత్నం
ఒంటరిగా ఉన్న బాలిక పై కన్నేసిన ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ప్రతిఘటించిన బాలిక గట్టిగా కేకలు వేయడంతో.. అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్ మండలం రామన్నగూడెం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాలిక(16) ఇటీవలే ఇంటర్ పరీక్షలు పూర్తిచేసి ఇంటి దగ్గరే ఉంటోంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నిమిత్తం బావి వద్దకు వెళ్లిన సమయంలో బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఇంటిపక్కన ఉండే పల్లా సత్యనారాయణరెడ్డి(50) అనే వ్యక్తి ఆమె అఘాయిత్యం చేయడానికి యత్నించాడు. దీంతో బెంబేలెత్తిపోయిన బాలిక బిగ్గరగా కేకలు వేసింది. ఇది గుర్తించిన స్థానికులు అక్కడికి చేరుకునేలోపే అతను అక్కడి నుంచి పరారయ్యాడు. గురువారం బాలిక తల్లిదండ్రుల సాయంతో సత్యనారాయణరెడ్డి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. -
రైల్‌రోకో భగ్నం
బీజేపీ కిసాన్‌మోర్చా పిలుపు మేరకు జమ్మికుంటలో శుక్రవారం నిర్వహించిన రైల్ రోకోను పోలీసులు భగ్నంచేశారు. పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాటతో ఉద్రిక్తత ఏర్పడింది. కిసాన్‌మోర్చా జాతీయ కార్యదర్శి సుగుణాకర్‌రావు స్పృహతప్పి పడిపోయూరు. నాయకుల ప్రయత్నాలకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించి రైలురోకోను అడ్డుకున్నారు. - న్యూస్‌లైన్, జమ్మికుంటటౌన్ జమ్మికుంట టౌన్, న్యూస్‌లైన్ : బీజేపీ కిసాన్మెర్చా ఇచ్చిన పిలుపు మేరకు జమ్మికుంటలో నిర్వహించిన రైల్‌రోకో కార్యక్రమాన్ని పోలీసులు భగ్నంచేశారు. ఫిబ్రవరి 7ను రైతుల ఆగ్రహదినోత్సవంగా పరిగణిస్తూ బీజేపీ రైల్‌రోకో నిర్వహించేందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివ చ్చారు. బీజేపీ కిసాన్మెర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పి.సుగుణాకర్‌రావు ఆధ్వర్యంలో పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ నుంచి డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగింపు నిర్వహించారు. గాంధీ చౌరస్తాకు రాగానే డీఎస్పీ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. నాయకులు కొద్దిసేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. స్థానిక పోలీసులతోపాటు రైల్వే పోలీసులు రైల్‌రోకో నిర్వహించకుండా నాలుగు చోట్ల రోప్‌లు పట్టుకుని మోహరించారు. మొదట పోలీసులను దాటి రైల్‌రోకో నిర్వహించేందుకు రైల్వేస్టేషన్‌కు వెళ్తున్న సమయంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ రోడ్డుపైనే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తదుపరి స్టేషన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకోవడంతో నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు నాయకులను చెల్లాచెదురు చేసే క్రమంలో ఒకరిపై ఒకరు పడడంతో అక్కడే ఉన్న సుగుణాకర్‌రావు సొమ్మసిల్లి పడిపోయారు. నాయకులు రైల్వేస్టేషన్ లోపలికి వె ళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అరెస్టుకు నిరసనగా పోలీస్‌స్టేషన్ ఎదుట కొందరు నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. మరోవైపు గాంధీ చౌరస్తా వద్ద గంటపాటు బీజేపీ నాయకులు ధర్నా రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్ స్తంభించింది. రైల్వే పోలీసులు సైతం రైల్వేస్టేషన్లో భారీ బందోబస్తు నిర్వహించారు. సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు, ప్రధాన కార్యదర్శి జగన్మోహన్రావు, బొబ్బలరాజిరెడ్డి, భాషవేన మల్లేశ్, వేల్పుల వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్‌రావు, ఇంద్రారెడ్డి, గూడూరి శ్రీనివాస్, పొనగంటి శంకరయ్య, ఆకుల రాజేందర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలోనే రైతులకు గోస.. కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని కిసాన్మెర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పి.సుగుణాకర్‌రావు అన్నారు. అరెస్టరుున అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో దేశంలో అరగంటకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడని, అరుునా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే రైతు ఆత్మహత్యలు నివారించేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు.