సత్యసాయి విద్యా విహార్‌లో సన్నీ
పూర్ణకుంభంతో యాజమాన్యం స్వాగతం
ఉప్పొంగిన విద్యార్థులు
బాబా ఆశీస్సులతో ఏదైనా సాధ్యమని ఉద్బోధ
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఎంవీపీ కాలనీ సెక్టార్-8లోని సత్యసాయి విద్యావిహార్ స్కూల్‌ను భారత మాజీ కెప్ట్‌న్ సునీల్ గవాస్కర్ శుక్రవారం సందర్శించారు. పాఠశాల యాజమాన్యం ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికింది. సత్యసాయి సదన్‌లోని బాబాకు ఆయన పూజ లు చేశారు. తరగతికి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. జీవి తంలో ఒడిదుడుకులు ఎదురవుతుంటాయని, వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలన్నారు. విద్యార్థులు సానుకూల దృక్పథం అలవర్చుకోవాలని సూచించారు.
భగవాన్ సత్యసాయి ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. క్రికెట్లో మధుర జ్ఞాపకాలను వారితో పంచుకున్నారు. విద్యార్థులు తెచ్చిన క్రికెట్ బ్యాట్, బంతిపై సంతకం చేశారు. ఓ విద్యార్థిని సత్యసాయి విగ్రహాన్ని ఆయనకు అందజేసింది. కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు వి.ఆర్.నాగేశ్వరరావు, నగర కన్వీనర్ పి.ఆర్.ఎస్.ఎన్.నాయుడు, ప్రసన్నకుమార్, బోత్ర షిప్పింగ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రాం గోపాల్, విజయ నిర్మాణ్ సంస్థ అధినేత విజయకుమార్, న్కూల్ ప్రిన్సిపాల్ ఎ.కౌసల్య పాల్గొన్నారు.