sarkaar
-
నువ్వేం మనిషివయ్యా సుధీర్.. ‘ఫ్రీ’ కోసం పిల్లలు కంటావా?: మల్లారెడ్డి
ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత మల్లారెడ్డికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ‘పాలమ్మినా.. పూలమ్మినా.. ’అనే డైలాగ్‌తో పాటు ఆయన ఏం మాట్లాడినా..ఆ మాటలు నెట్టింట వైరల్ అవుతుంటాయి.ఇక ఇటీవల తన 50 ఏళ్ల వివాహ వార్షికోత్సవం (గోల్డెన్ జూబ్లీ) సందర్భంగా తన భార్య కల్పనను మరోసారి పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచాడు. అయితే ఎప్పుడు రాజకీయ సభల్లో లేదా కాలేజీలో నిర్వహించే ఈవెంట్స్‌లో మాత్రమే పాల్గొనే మల్లారెడ్డి..తొలిసారి ఓ ఎంటర్టైన్మెంట్ షోకి గెస్ట్‌గా వెళ్లాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహిస్తున్న ఎంటర్టైన్మెంట్ షో ‘సర్కార్ షో’ ఆరో సీజన్లో పాల్గొన్నాడు. సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యహరిస్తోన్న ఈ ఎంటర్ టైన్మెంట్ షో లో మల్లారెడ్డి తనదైన డైలాగులు, డ్యాన్స్ లు చేసి అలరించారు. తాజాగా దీనికి సంబంధించిన కొత్త ప్రోమో రిలీజ్ అయింది. అందులో హోస్ట్ సుధీర్‌పై మల్లారెడ్డి వేసిన పంచులు నవ్వులు పూయిస్తుంది. ‘పెళ్లి చేసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా సార్’ అని సుధీర్ అడిగితే..‘పనికిరానోళ్లకు ప్రాబ్లమ్స్ ఉంటాయి’ అని తనదైన శైలీలో జవాబిచ్చాడు. అంతేకాదు ‘ఇంత ఏజ్ వచ్చినా పెళ్లి చేసుకోకపోతే నువ్వేం మనిషివయ్యా’ అని సుధీర్‌ని అనగానే.. పక్కనే ఉన్న అలీ, శివాజీ పలగబడి నవ్వారు. ఇక ‘సుధీర్ నువ్వు పెళ్లి చేసుకో.. నీ పిల్లలకు మల్లారెడ్డి తన కాలేజీలో ఫ్రీ సీటు ఇస్తాడు’అని అలీ అంటే..‘అవన్నీ ఏం లేవు..ఇది గవర్నమెంట్ కాదు’అని అంటూనే.. ‘ఫ్రీ కోసం పిల్లలు కంటడా ఏంటి? అని చమత్కరించాడు. ఇక ‘మీ బయోపిక్‌లో ఎవరు నటిస్తే బాగుంటుంది’అని సుధీర్ అడిగితే.. ‘డైరెక్టర్ ఎవరిని సెట్ చేస్తే వాళ్లు నటిస్తారు’ అని మల్లారెడ్డి తనదైన శైలీలో జవాబిచ్చాడు. ఇంకా మల్లారెడ్డి ఏం మాట్లాడాడు.. ఆయన చేసిన సందడి ఎంటి అనేది మే1న ఫుల్ ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. -
సమస్యలు పరిష్కరించేదాకా పోరాటం
ఎంజీఎం : ప్రభుత్వం రెండో ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని, వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.చుక్కయ్య స్పష్టం చేశారు. బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట చేపట్టిన వంటావార్పు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 24 రోజులుగా ఏఎన్ఎంలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. కాంట్రాక్టు ఏఎన్ఎంలను క్రమబద్ధీకరిస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే మాట మారుస్తూ మోసం చేస్తున్నారని విమర్శించారు. రెండో ఏఎన్ఎంలకు 10వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనకు సీఐటీయూ అనుబంధ సంఘాలు మద్దతు తెలుపుతూ ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొంటామని చుక్కయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.యాదానాయక్, సీఐటీయూ జిల్లా నేతలు రొయ్యల రాజు, చక్రపాణి, సుధాకర్,తదితరులు పాల్గొన్నారు. దీక్ష శిబిరంలో ఏఎన్ఎంల నిద్ర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట వంటావార్పు కార్యక్రమంతో ఆందోళన చేపట్టిన రెండో ఏఎన్ఎం రాత్రి అక్కడే నిద్రించారు.


