breaking news
sanjay junge
-
కారులో గొడవ.. ఆపై కత్తులతో దాడి
హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో సాప్ట్వేర్ ఉద్యోగి సంజయ్ జుంగీ హత్యను నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం ఛేదించారు. ఈ హత్యతో ప్రమేయం ఉందన్న అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న నలుగురు నిందితులను ఆదివారం సాయంత్రం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. నార్త్ జోన్ డీసీపీ ప్రకాష్ ఈ ఘటన వివరాలను వివరించారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి సంజయ్ జుంగీ హైటెక్ సిటీలో విధులు ముగించుకుని గురువారం అర్థరాత్రి ఇంటికి బయలుదేరాడు. ఆ తర్వాత కూకట్పల్లి వెళ్లి అక్కడ స్నేహితులతో కలసి పార్టీ చేసుకున్నాడు. అక్కడి నుంచి స్నేహితుడి బైక్‌పై పంజాగుట్టకు చేరుకున్నాడు. క్యాబ్ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో పాత బస్తీ వెళ్తున్న క్యాబ్ ను సంజయ్ ఆపి లిఫ్ట్ అడిగాడు. కారులో నిందితులు, సంజయ్ గొడవపడ్డారు. ఇంతలో సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ స్టాప్ రావడంతో సంజయ్ కారు దిగిపోయాడు. అప్పటికే సంజయ్‌పై ఆగ్రహంతో ఉన్న వారు.. కత్తులతో ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పై దాడిచేశారు. దీంతో సంజయ్ నడిరోడ్డుపై కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయాడని నార్త్ జోన్ డీసీపీ ప్రకాష్ వివరించారు. ఆ వెంటనే తమ కారులో నిందితులు అక్కడి నుంచి ఓల్డ్ సిటీ వైపు పరారైయ్యారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులు ప్రయాణించిన కారు నంబర్ గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కారు నంబర్ ట్రేస్ చేసి నిందితులను కనిపెట్టి శనివారం నాడు టాస్క్ ఫోర్స్ టీమ్ వారిని అరెస్ట్ చేసినట్లు ఈ సందర్భంగా నార్త్ జోన్ డీసీపీ ప్రకాష్, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హత్యకు దారితీసిన పరిస్థితులను వివరించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులను అభినందించారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి హత్య కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో సాప్ట్వేర్ ఉద్యోగి సంజయ్ జుంగీ హత్యను నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం ఛేదించారు. ఈ హత్యతో ప్రమేయం ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. ఆ తర్వాత పోలీసులు విలేకర్లతో హత్య జరిగిన తీరును వివరించారు. సంజయ్ జుంగీ హైటెక్ సిటీలో విధులు ముగించుకుని గురువారం అర్థరాత్రి ఇంటికి బయలుదేరాడు. ఆ క్రమంలో కూకట్పల్లి వెళ్లి అక్కడ స్నేహితులతో కలసి పార్టీలో బాగా మందుకొట్టాడు.. ఆ తర్వాత స్నేహితుడు బైక్‌పై పంజాగుట్టకు సంజయ్ చేరుకున్నాడు. క్యాబ్ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో బంజారాహిల్స్ నుంచి పాత బస్తీ వెళ్తున్న క్యాబ్ ను సంజయ్ ఆపి ... లిఫ్ట్ కోరాడు. అందుకు వారు సమ్మతించడంతో... సంజయ్ ఆ కారు ఎక్కాడు. అయితే బాగా తాగి ఉండటం వల్ల సంజయ్ అప్పటికే క్యాబ్ లో ఉన్నవారితో ఘర్షణకు దిగాడు. దీంతో వారి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇంతలో సికింద్రాబాద్‌లో స్వప్నలోక్ కాంప్లెక్స్ స్టాప్ రావడంతో సంజయ్ కారు దిగాడు.ఆ తర్వాత కూడా కారులోని వారిని విపరీతంగా దూషించాడు. దీంతో అప్పటికే సంజయ్‌పై ఆగ్రహంతో ఉన్న వారు... సంజయ్‌పై దాడి చేసి కత్తితో పొడిచాడు. దీంతో సంజయ్ నడిరోడ్డుపై కుప్పకూలి అక్కడికక్కడే మరణించాడు. అనంతరం వారు కారులో అక్కడి నుంచి పరారైయ్యారు. ఈ హత్యపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా సీసీ కెమెరా ఫుటేజ్ లను పోలీసులు పరిశీలించారు. కారు నెంబర్ ద్వారా వారు ప్రయాణించిన కారును గుర్తించారు. ఆ కారును పాతబస్తీలో స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. క్యాబ్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా... నిందితుల వివరాలు తెలిపాడని పోలీసులు చెప్పారు. అనంతరం వారిని విచారించగా హత్యకు దారి తీసిన పరిస్థితులు వారు విశదీకరించారని పోలీసులు వెల్లడించారు. -
కారులో వచ్చి.. కత్తిపోట్లు
హైదరాబాద్: భాగ్యనగరంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. కారులో వచ్చిన ముగ్గురు దుండగులు కత్తులతో పొడిచి చంపి పారిపోయారు. పోలీసులు గస్తీ వాహనంలో వెంబడించినా చిక్కకుండా పరారయ్యారు. సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద గురువారం తెల్లవారుజామున నడిరోడ్డుపై ఈ దారుణం చోటుచేసుకుంది. సీసీటీవీల ఆధారంగా ఆ కారు నంబర్‌ను గుర్తించిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమా లేదా వ్యక్తిగత కక్షలు ఈ హత్యకు దారితీశాయా? అన్న కోణంలో విచారణ చేపట్టారు. అంధ విద్యార్థి పరీక్షకు సాయంగా వెళ్లి.. సికింద్రాబాద్ పార్శిగుట్టకు చెందిన సురేందర్, జయమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. చిన్న కుమారుడు సంజయ్ జుంగే (25) ఈఈఈ పూర్తి చేసి ఏడాది క్రితమే మణికొండలోని సదర్‌ల్యాండ్ గ్లోబల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ సంస్థలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఓ అంధ విద్యార్థికి సాయంగా పరీక్ష రాయడానికి వెళ్తున్నానంటూ సంజయ్ బుధవారం ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి వెళ్లాడు. పరీక్ష రాసిన అనంతరం తన సంస్థలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు రెండో షిప్ట్ డ్యూటీ చేశాడు. తర్వాత సహోద్యోగులు కుశాల్కర్, సిద్ధాంత్లతో కలిసి మియాపూర్‌లోని సిద్ధాంత్ గదికి వెళ్లాడు. ఈ ముగ్గురూ గురువారం తెల్లవారుజాము వరకు మద్యం తాగారు. అనంతరం బైక్‌పై వారంతా పంజగుట్టలోని పీవీఆర్ మాల్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ వాహనం దిగిన సంజయ్.. తాను ఇంటికి వెళ్తానని చెప్పడంతో మిగతా ఇద్దరు స్నేహితులు వెళ్లిపోయారు. అక్కడ్నుంచి సంజయ్ బేగంపేట్‌లో ఉండే స్నేహితుడు భాస్కర్‌కు ఫోన్ చేసి.. క్యాబ్‌లో వస్తానని, ప్యారడైజ్ వద్ద పికప్ చేసుకోవాలని కోరాడు. చివరగా తెల్లవారుజామున 5.13 గంటలకు భాస్కర్ తో మాట్లాడాడు. రెండు నిమిషాల్లోనే ఘాతుకం సంజయ్ నడుచుకుంటూ స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్దకు చేరుకోగానే.. ఓ స్విఫ్ట్ డిజైర్ కారు వచ్చింది. సంజయ్ రోడ్డు దిగి పక్కకు జరగ్గా.. కాస్త ముందుకు వెళ్లి కారు ఆగింది. అందులోంచి ముగ్గురు వ్యక్తులు సంజయ్ వద్దకు వచ్చి పెనుగులాడారు. అందులో ఒకరు కత్తితో సంజయ్ ఛాతీపై పొడిచాడు. దీంతో కుప్పకూలిన సంజయ్ అక్కడికక్కడే మరణించాడు. ఉదయం 5.15 గంటల సమయంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ‘హిట్ అండ్ రన్’ అనుకున్న పోలీసులు సంజయ్‌ను హత్య చేసిన దుండగులు అదే కారులో ప్యారడైజ్ వైపు పారిపోతుండగా.. అదే సమయంలో మహంకాళి పోలీసుస్టేషన్‌కు చెందిన పెట్రోలింగ్ వాహనం వీరి వాహనానికి ఎదురు వచ్చింది. కారు అతి వేగంతో దూసుకు వెళ్తుండటం.. కొద్దిదూరంలోనే ఓ వ్యక్తి (సంజయ్) కిందపడి ఉండటాన్ని పోలీసులు గమనించారు. ఆ వ్యక్తిని ఢీకొట్టి పారిపోతున్నారని (హిట్ అండ్ రన్) భావించి ఆ కారును వెంబడించారు. వెనక్కు తిరిగి ప్యారడైజ్ నుంచి ఎంజీ రోడ్ మీదుగా ట్యాంక్‌బండ్ వరకు దుండగుల కారును వెంబడించారు. అయితే దుండగులు 130 నుంచి 140 కి.మీ. స్పీడుతో వెళ్లి పోలీసులకు చిక్కలేదు. అనంతరం ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు హత్య జరిగినట్లు గుర్తించి కారుకు సంబంధించిన ఆచూకీ కనిపెట్టాలంటూ అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. అయినా ఫలితం దక్కలేదు. దొరకని కారు..: మిత్రుడితో క్యాబ్‌లో వస్తున్నానని సంజయ్ చెప్పిన నేపథ్యంలో నగరంలోని అన్ని క్యాబ్ సర్వీసుల్లోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. సంజయ్ ఒకవేళ హంతకుల కారులోనే ప్రయాణించాడా? అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నారు. హంతకులు పారిపోయిన తెలుపు రంగు కారు నంబర్ ‘8055’ను ‘బాస్’ మోడల్లో రాసినట్లు సీసీ కెమెరాల ఫీడ్ ఆధారంగా గుర్తించారు. నగరంలో ఆ నంబర్‌తో 14 కార్లు ఉండడంతో వాటి యజమానులను ప్రశ్నిస్తున్నారు. సంజయ్ సహోద్యోగులు, స్నేహితులతో పాటు అతడి కాల్ వివరాలు ఆధారంగా విచారణ చేస్తున్నారు. మృతుడి దేహంపై ఉన్న కత్తిగాట్లను పరిశీలించిన పోలీసులు ఈ హత్య ప్రొఫెషనల్స్ పనిగా అనుమానిస్తున్నారు. రక్షించమని అరిచాడు ‘‘హత్య జరిగిన సమయం లో నేను విధుల్లో ఉన్నా. సంజయ్ వెనుక నుంచి కారు తో వచ్చిన దుండగులు హారన్ కొట్టారు. సంజయ్ పక్కకు జరగ్గానే ముగ్గురు బయటకు దిగి అతనితో గొడవ పడ్డారు. అందులో ఒకడు కత్తితో దాడి చేశాడు. సంజయ్ ‘బచావో బచావో’ అంటూ అరిచాడు. అంతలోనే దుండగులు కారులో పరారయ్యారు’’ - మనోహర్, ప్రత్యక్ష సాక్షి (సెక్యూరిటీ గార్డు)