ఆస్తికోసం బాబాయి హత్య
సానిగూడెం (దెందులూరు) : ఆస్తికోసం సొంత బాబాయిని రోకలిబండతో కొట్టి చంపాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన సోమవారం రాత్రి దెందులూరు మండలం సానిగూడెంలో జరిగింది. ఏలూరు టౌన్ సీఐ రాజశేఖర్ కథనం ప్రకారం.. సానిగూడెం గ్రామంలో పంపన రామకృష్ణ(50)కి అతని అన్న కొడుకు రవికి మధ్య కొంతకాలంగా ఆస్తి వివాదం నడుస్తోంది. ఈ నేప«థ్యంలో సోమవారం రాత్రి రవి రోకలి బండతో పంపన రామకృష్ట తలపై మోదాడు. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న సీఐ రాజశేఖర్ ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.