breaking news
Sandalwood Casket
-
జయమ్మకు గందపు చెక్కల పేటిక
-
జయమ్మకు గందపు చెక్కల పేటిక
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయ లలిత అంతిమయాత్ర ప్రారంభమైంది. అశేష అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తల అశ్రునయనాల మధ్య ఆమె పార్థీవ దేహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఏర్పాటుచేసిన గందపు చెక్కల పేటికలో ఉంచి మెరీనా బీచ్ వద్దకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా లక్షల్లో హాజరైన అశేష జనవాహిని జయహో అమ్మ, పురుచ్చి తలైవీ, జయమ్మ అంటూ నినాదాలు చేస్తున్నారు. జయ పార్థీవ దేహాన్ని ఉంచిన రాజాజీ హాల్ నుంచి మెరీనా బీచ్‌కు మూడు కిలోమీటర్ల దూరం ఉంది. గందపు చెక్కల పేటికలో ఉంచి ఆమెను ఖననం చేయనున్నారు. ఇప్పటికే అంత్యక్రియలు జరిగే చోట పెద్ద మొత్తంలో జనాలు చేరి ఉన్నారు. రహదారి పొడవునా ఇసుకేస్తే రాలనంతమంది జనం ఉన్నారు.