breaking news
Salvador
-
సర్ఫింగ్ క్రీడాకారిణి మృతి.. శిక్షణ సమయంలో ప్రమాదం
శాన్సాల్విడార్: మధ్య ఆమెరికా దేశమైన ఈఐ సాల్వడార్ జాతీయ సర్ఫింగ్ జట్టు క్రీడాకారిణి కేథరీన్ డియాజ్(22) మృతి చెందారు. శిక్షణ పొందుతున్న సయమంలో చోటు చేసున్న ప్రమాదంలో ఆమె మృతి చెందినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ తెలిపింది. దేశంలోని నైరుతి పసిఫిక్ వైపు గల ఎల్ తుంకో బీచ్ల్ ఆమె మృతదేహం బయటపడినట్లు పేర్కొంది. అంతర్జాతీయ సర్ఫింగ్ టోర్నమెంట్లలో తమ దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి డియాజ్ సన్నద్ధమవుతోందని సర్ఫింగ్ ఫెడరేషన్ సభ్యుడొకరు తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అధ్యక్షుడు యామిల్ బుకెల్ మాట్లాడుతూ.. ఆమె కుటంబం సభ్యులు, స్నేహితులకు సంఘీభావం తెలిపారు. డియాజ్ మృతి సర్ఫింగ్ జట్టుకు తీరని లోటు అని పేర్కొన్నారు. చదవండి: జపాన్‌లో భారీ భూకంపం.. సునామి హెచ్చరికలు జారీ -
బ్రెజిల్ తొలి ప్రత్యర్థి క్రొయేషియా
సాల్వెడార్: సొంతగడ్డపై వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ఆతిథ్య బ్రెజిల్ జట్టు తమ తొలి మ్యాచ్‌ను క్రొయేషియా జట్టుతో ఆడుతుంది. వచ్చే సంవత్సరంలో జూన్ 12 నుంచి జూలై 13 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన ‘డ్రా’ వివరాలను శుక్రవారం విడుదల చేశారు. జూన్ 12న సావోపాలోలో క్రొయేషియాతో జరిగే గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌తో బ్రెజిల్ తమ టైటిల్ వేటను ప్రారంభిస్తుంది. ఆ తర్వాత 17న మెక్సికోతో; 23న కామెరూన్‌తో బ్రెజిల్ తలపడుతుంది. మొత్తం 32 జట్లను ఎనిమిది గ్రూప్‌లుగా విభజించారు. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ స్పెయిన్ తమ తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఢీకొంటుంది. ఈసారి విశ్వవిజేతగా నిలిచిన జట్టుకు 3 కోట్ల 50 లక్షల డాలర్ల (రూ. 214 కోట్లు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. ఆయా గ్రూప్‌ల వివరాలు: గ్రూప్ ‘ఎ’: బ్రెజిల్, క్రొయేషియా, మెక్సికో, కామెరూన్. గ్రూప్ ‘బి’: స్పెయిన్, నెదర్లాండ్స్, చిలీ, ఆస్ట్రేలియా. గ్రూప్ ‘సి’: కొలంబియా, గ్రీస్, ఐవరీకోస్ట్, జపాన్. గ్రూప్ ‘డి’: ఉరుగ్వే, కోస్టారికా, ఇంగ్లండ్, ఇటలీ. గ్రూప్ ‘ఇ’: స్విట్జర్లాండ్, ఈక్వెడార్, ఫ్రాన్స్, హోండూరస్. గ్రూప్ ‘ఎఫ్’: అర్జెంటీనా, బోస్నియా హెర్జెగోవినా, ఇరాన్, నైజీరియా. గ్రూప్ ‘జి’: జర్మనీ, పోర్చుగల్, ఘనా, అమెరికా. గ్రూప్ ‘హెచ్’: బెల్జియం, అల్జీరియా, రష్యా, దక్షిణ కొరియా