breaking news
Salt and pepper
-
అజిత్ ఇన్ బ్లాక్
సౌత్ ఇండియన్ హీరోస్లో సాల్ట్ అండ్ పెప్పర్ (అక్కడక్కడా నెరిసిన జుత్తు, గెడ్డం) లుక్‌తో ఎక్కువగా కనిపించే హీరో అజిత్. కానీ, ఈసారి లుక్ మార్చబోతున్నారట. మూడు నాలుగేళ్లుగా అజిత్ ఈ గెటప్‌లోనే కనిపిస్తున్నారు. ఫర్ ఎ చేంజ్ తన తదుపరి సినిమా కోసం సాల్ట్ అండ్ పెప్పర్ లుక్కు ఫుల్స్టాప్ పెట్టి, ఫుల్ బ్లాక్‌లో కనిపించబోతున్నారట. ఫుల్ బ్లాక్ అంటే ఒంటి రంగు అనుకునేరు. జుట్టు, గడ్డం రంగు. ఇంతకీ ఏ సినిమాలో ఈ గెటప్ అంటే.. ‘విశ్వాసం’లో. అజిత్ హీరోగా ‘వీరం, వేదాళం, వివేగం’ వంటి హిట్స్ ఇచ్చిన శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రాన్ని నిర్మించిన సత్య జ్యోతి ఫిలింస్ బ్యానర్‌పై జి.త్యాగరాజన్, జి. శరవణన్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇందులో అనుష్క పేరుని హీరోయిన్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. జనవరి 19న రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రాన్ని 2018 దీపావళికి రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. -
మళ్లీ సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్‌లోనేనా?
సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్‌లో కనిపించనున్నారా? ఇందుకు కోలీవుడ్ వర్గాల్లో అవుననే సమాధానమే వస్తోంది. రజనీకాంత్ ప్రేక్షకుల్ని, ముఖ్యంగా ఆయన అభిమానుల్ని ఎలాంటి గెటప్‌లోనైనా అలరిస్తారు. ఆయన గెటప్‌ల కంటే స్టైల్‌నే అభిమానులు ఇష్టపడాతారన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు చిన్న ఉదాహరణ కబాలి. అందులో రజనీకాంత్ సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్‌లో కనిపిస్తారు. చిత్రంలో ఎక్కువగా వయసు మళ్లిన పాత్రలోనే నటించారు. అయినా ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి పండగ చేసుకున్నారు. తాజాగా శంకర్ దర్శకత్వంలో 2.ఓ చిత్రంలో నటిస్తున్న రజనీకాంత్ తదుపరి కబాలి–2లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. కబాలి ఫేమ్ రంజిత్‌నే దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని రజనీకాంత్ అల్లుడు, నటుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై భారీ ఎత్తున్న నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటున్న కబాలి–2 చిత్ర షూటింగ్ ప్రారంభానికి గడువు దగ్గర పడింది. వచ్చే నెలలోనే చిత్రం సెట్ పైకి వెళ్లనుందన్నది తాజా సమాచారం. ఇందులో రజనీకాంత్‌కు జంటగా నటి విద్యాబాలన్ నటించే అవకాశం ఉంది. ఇందులోనూ రజనీకాంత్ సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్‌లో కనిపించనున్నారట. అయితే కబాలి చిత్రంలో కంటే ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో గెటప్ కోసం పలు డిజైన్లను రెడీ చేస్తున్నారు. అందులో చాలా కొత్తగా ఉండే గెటప్‌ను ఎంపిక చేయనున్నారట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. -
గ్రేట్ లుక్
నల్లని వెంట్రుకల నడుమ తెల్ల వెంట్రుక కనపడితే విలవిల్లాడిపోయి, ఆ ఒక్కటి కాస్తా తన ఫ్యామిలీని పెంచుకుంటూ పోతే.. వేటాడడానికి కత్తెరతో వీలైనంత కాలం విఫలయత్నం చేసి చివరికి రంగుల లోకంలోకి ‘డై’వర్ట్ అయిపోవడం అందరూ చేసే పని. ఈ రోజులకు బై బై అంటూ, ‘బ్లాక్’ మ్యాజిక్ మాటున దాగిపోకుండా వైట్హెయిర్కు వెలుగొస్తోంది. నలుపు తెలుపు మిశ్రమమైన వెరైటీ లుక్ సాల్ట్ అండ్ పెప్పర్‌కు సిటీ సైతం వెల్కమ్ చెబుతోంది. - ఎస్.సత్యబాబు యూరప్‌లో మెచ్యూర్డ్ మెన్ని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారని కొన్ని సర్వేల్లో వెల్లడైంది. పరిణతి కలిగిన మగవాళ్ల నుంచి బెస్ట్ సెక్యూరిటీ లభిస్తుందని అమ్మాయిలు భావిస్తున్నారట. ఏజ్ కవర్ చేసుకోవడానికి తంటాలు పడడాన్ని వాళ్లు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడంగా ట్రీట్ చేస్తున్నారట. వుమెన్ నుంచి ఈ తరహా అభిప్రాయాలు వ్యక్తం కావడంతో మెన్ లుక్స్‌ని అవి సహజంగానే ప్రభావితం చేశాయి. దీంతో నెరసిన వెంట్రుకలను అలాగే ఉంచేసే ధోరణికి అది నాంది పలికిందట. హాలీవుడ్‌తో క్రేజ్... పాశ్చాత్య ఆడవాళ్ల ఆలోచనల్లో మార్పు లేదా మరొకటి కావచ్చు.. హాలీవుడ్ నటీనటులు నెరసిన జుత్తుతోనే తెరపై కనిపించడం మొదలైంది. మిడిల్ ఏజ్డ్ మగవాళ్ల ముఖాల మీద కనిపించే తమాషా బ్లాక్ అండ్ వైట్ మిక్స్డ్ హెయిర్‌కి సాల్ట్ అండ్ పెప్పర్ అని ఫ్యాషనీతిజ్ఞులు పేరు పెట్టేశారు. అది తర్వాత తర్వాత హాలీవుడ్ నటుల ఏజ్‌తో పాటు పెరిగి పూర్తి గ్రే హెయిర్‌స్టైల్‌కు రూపాంతరం చెందడం తర్వాతి సంగతి. హాలీవుడ్ నటుడు జార్జ్ క్లూనీ, రాబర్ట్ డౌనీ వంటి హీరోలు, జెమ్మీ లూ కర్టిస్ వంటి హీరోయిన్ల ద్వారా బాగా పాప్యులరై అక్కడ యువ నటీనటులు, టాప్ మోడల్స్ అనుకరించే దశకు చేరుకుందీ స్టైల్. మేగజైన్ షూట్స్‌కు, ర్యాంప్‌వాక్‌కు సైతం గ్రే హెయిర్ ఆకర్షణగా మారింది. అక్కడ ఈ సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్ సరికొత్త ఫ్యాషన్ అనిస్టైలిస్ట్లు అంటుంటే కొన్ని శతాబ్దాల క్రితమే ఉందని మరికొందరు వాదిస్తూ చర్చలు సాగిస్తున్నారు. బాలీవుడ్, కోలీవుడ్లకూ వైట్నర్... ఆ తెల్ల నల్లని హవా... మెల్లగా మన బాలీవుడ్‌కీ అంటుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖులు పలువురు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌ని ఫాలో అవుతున్నారు. మిడిల్ ఏజ్డ్ మోడల్ కమ్ యాక్టర్ మిలింద్ సోమన్ వంటివారు ఈ స్టైల్‌ని పూర్తిగా ఫాలో అవుతూ పరోక్షంగా దీన్ని గ్లామరైజ్ చేస్తున్నారు. దీంతో ఇండియన్ హెయిర్స్టైలిస్ట్లూ సాల్ట్ అండ్ పెప్పర్‌కు సై అంటున్నారు. నసీఫా అలీ వంటి బాలీవుడ్ స్టార్స్ ఈ ఫ్యాషన్ విజృంభణతో సంబంధం లేకుండా ఎప్పటి నుంచో తెల్లని కేశాలతో నిండుగా కనిపించేవారు. అయితే ఈ లుక్కు వచ్చిన క్రేజ్‌ను కొందరు వారికీ ఆపాదించేస్తున్నారు. మరోవైపు ఈ తరహా లుక్కు సూపర్‌స్టార్ డమ్ తెచ్చాడు తమిళ హీరో అజిత్. ఈయన గత కొన్ని సినిమాల నుంచి ఈ ఫ్యాషన్‌ను ఫాలో అవుతూ.. తమిళనాడులో యూత్‌ను ఇన్స్పైర్ చేస్తున్నాడు. దీంతో అక్కడి యువత వెంట్రుకలు నెరవకున్నా సిల్వర్ కలర్ కోసం పార్లర్లకు క్యూ కడుతున్నారట. మన టాలీవుడ్లో ప్రస్తుతం ఈ లుక్ గురించి చెప్పాలంటే వైవిధ్య నటుడు జగపతిబాబునే చెప్పుకోవాలి. ఆయన విలన్‌గా మారి నటించిన లెజండ్ ద్వారా సాల్ట్ అండ్ పెప్పర్‌ని టాలీవుడ్లో తెరంగేట్రం చేయించారు. ఈ నేపథ్యంలో నగరంలో డై కు బై చెబుతున్నారు కొందరు మిడిల్ ఏజ్డ్ మెన్. ‘గ్రే’ట్ ఫ్యూచర్... ఆహారపు అలవాట్లు, పొల్యూషన్.. కారణాలేవైనా గత తరంతో పోలిస్తే ఇప్పటి తరంలో జుత్తు నెరసిపోవడమనేది చిన్న వయసులోనే సంభవిస్తోంది. అదే సమయంలో నలభైల్లోనూ ఫిట్నెస్ పరంగా బాగుంటున్నారు. ఫిజికల్‌గా ఎనర్జిటిక్‌గా కనపడుతూ, బాగున్నప్పుడు నెరసిన జుత్తు గురించి వర్రీ అవడం దేనికనే ఆలోచన ఈ సాల్ట్ అండ్ పెప్పర్ ట్రెండ్‌కు మరింత ఊతమిస్తోంది. మరోవైపు సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌కు ఇంపార్టెన్స్ పెరిగింది. అందంగా, యంగ్‌గా కన్నా కాన్ఫిడెంట్‌గా కనపడేవాళ్లే త్వరగా నలుగురినీ ఆకర్షించగలుగుతున్నారు. ఈ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ మరింతగా తమ కాన్ఫిడెన్స్‌ను ప్రొజెక్ట్ చేస్తుందని ‘సిటీ’జనులు భావిస్తుండడంతో నగరంలో ఈ తరహా లుక్కు మంచి భవిష్యత్తు కనిపిస్తోంది. పర్ఫెక్ట్ అంటున్నారు.. కొంతకాలంగా డై వేసుకోవడం లేదు. ఇప్పుడు అందరూ చాలా బాగుందంటున్నారు. నేచురల్‌గా ఉందంటున్నారు. నా భార్య, సన్నిహితులు మొదట్లో డై వేసుకోమని బలవంతం చేశారు. అయితే పార్టీ సర్కిల్లో నా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌కి వచ్చిన క్రేజ్ వారిని కూడా ఇంప్రెస్ చేసింది. ఇప్పుడు ఇదే బాగుందని వాళ్లు కూడా అంటున్నారు. - అమీర్ అలీ, వ్యాపారి కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ యూరప్ దేశాల్లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌ని బాగా లైక్ చేస్తున్నారు. అయితే అక్కడ ఫ్యాషన్‌గా కాకుండా నేచురల్‌గా స్టార్ట్ అయిందీ ట్రెండ్. ఆ తర్వాత వరల్డ్ అంతా ఫ్యాషన్‌గా మూవ్ అయింది. చెన్నై వంటి నగరాల్లో యూత్ సైతం తమ హెయిర్స్‌ను ఎక్స్ట్రీమ్ లెవల్‌కు బ్లీచ్ చేయించుకుని మరీ ఈ లుక్‌ని ఫాలో అవడం కనిపిస్తోంది. మన దగ్గర యూత్ ఇంకా అంతగా ఆసక్తి చూపడం లేదు కానీ, మిడిల్ ఏజ్డ్ వాళ్లు బాగా కనెక్ట్ అవుతున్నారు. - సచిన్, మేనియా సెలూన్