కిటకిటలాడుతున్న శైవ దేవాలయాలు
హైదరాబాద్: తొలి కార్తీక సోమవారం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో శైవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక సోమవారం కావడంతో రాజమండ్రి వద్ద గోదావరిలో అధిక సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా శివాలయాలు, పంచారామ క్షేత్రాలు ద్రాక్షారామం, సామర్లకోటలలో స్వామికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో శివాలయాలకు భక్తులుపోటెత్తారు. భీమవరం పంచారామ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది.
కర్నూలు జిల్లా శ్రీశైలం దేవాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలి వచ్చారు.
కరీంనగర్ జిల్లా వేములవాడ భక్తులతో కిటకిటలాడుతోంది.
**