breaking news
Sainath Reddy
-
దాల్మియా గనుల తవ్వకాలు నిలిపివేత
మైలవ రం/జమ్మలమడుగు రూరల్: మైలవరం మండలం నావాబు పేట సమీపంలో ఏర్పాటు చేసిన దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన గనుల తవ్వకాలను కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక ఇన్‌ఛార్జి తహశీల్దార్ సాయినాథరెడ్డి నిలుపుదల చేసినట్లు పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ పెద్దకొమెర్ల, హనుమంతరాయునిపేట గ్రామాల్లో కార్బన్ వాయువు ప్రభావంచేత పంటలు నల్లగా మసకబారిపోతుండటంతో, అలాగే ప్రజల ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతోందని ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీనికి తోడు నవాబుపేట గ్రామంలో గనుల బ్లాస్టింగ్ వల్ల ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయని గ్రామస్థులంతా కలిసి కలెక్టర్ రమణకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గనుల తవ్వకాలను పూర్తిగా నిలుపుదల చేసినట్లు ఆయన వివరించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం జనవరి 5వతేదీలోగా కలెక్టర్‌ను కలిసి సంజాయిషీ ఇవ్వాలని సూచించినట్లు వివరించారు. -
చెన్నైలో జగన్ యువ సేన
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో జగన్ యువ సేన వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటయింది. దీనిని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లో ప్రకటించారు. చెన్నైలో తమ సేవల్ని విస్తృతం చేయనున్నామని ఆ అసోసియేషన్ ప్రతినిధులు వివరించారు. తమిళనాడు ప్రజల్లో వైఎస్సార్ కుటుంబంపై ఎనలేని అభిమానం ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ వైఎస్సార్ సీపీ నేతృత్వంలో సేవా కార్యక్రమాల్ని విస్తృత పరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాము సైతం అంటూ ఇక్కడి యువత, తెలుగు విద్యార్థులు కదిలారు. నగరంలోని కళాశాలల్లో చదువుకుంటున్న యువత జగన్ యువసేన పేరుతో తమ కార్యక్రమాలను చెన్నైలో విస్తృత పరిచేందుకు నిర్ణయించారు. డి సాయినాథ్‌రెడ్డి, బి రాజేష్ రెడ్డి, టీ నరేంద్రనాథ్ రెడ్డి కలసికట్టుగా ఈ యువసేనను ఏర్పాటు చేశారు. లోటస్ పాండ్‌లో సోమవారం తమ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. ఆయన చేతుల మీదుగా జగన్ యువసేన వెల్ఫేర్ అసోసియేషన్ నినాదంతో కూడిన టీ షర్టును విడుదల చేశారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని, చెన్నైలోని తెలుగు ప్రజలకు సహకారం అందించే విధంగా ముందుకు సాగాలని తమకు అధినేత జగన్ మోహన్ రెడ్డి సూచించారని యువసేన ప్రతినిధి సాయినాథ్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఁసాక్షిరూ.తో మాట్లాడుతూ, తమ అధినేత సూచనలు, సలహా మేరకు తమిళనాడులో సేవలను విస్తృతం చేస్తామన్నారు. అన్నదానం, రక్తదానం, పేదలకు ఉపయోగ పడే విధంగా సంక్షేమాల పంపిణీ, ఆశ్రమాల్లో సేవా కార్యక్రమాలను చేపట్టనున్నామని వివరించారు.