breaking news
Sadr
-
భారీ పేలుడు.. రద్దీమార్కెట్ మొత్తం రక్తసిక్తం
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో మరో మారణ హోమం చోటు చేసుకుంది. ఈద్ లక్క్ష్యంగా చేసుకుని భారీ కుట్రకు పాల్పడ్డారు మిలిటెంట్లు. బాగ్దాద్ శివారు నగరం సద్ర్‌లోని ఓ రద్దీ మార్కెట్లో భారీ బాంబు పేలుడుకు పాల్పడగా.. ఆ ప్రాంతం రక్తపు ముద్దలతో భీకరంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటిదాకా 35 మంది చనిపోగా, 60 మందికిపైగా గాయపడ్డారు. సద్ర్ సిటీ వహాయిలత్ మార్కెట్లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బక్రీద్ కోసం మార్కెట్లకు క్యూ కట్టిన జనాలను లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. రద్దీ మార్కెట్ కావడంతో ఎటు చూసినా తెగిపడిన అవయవాలు, రక్తపు ముద్దలే కనిపిస్తున్నాయి. మృతుల్లో ఎక్కువగా పిల్లలు, మహిళలే ఉన్నారు. గాయపడ్డ వాళ్లలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఘటనకు స్థానికంగా తయారుచేసిన పేలుడు పదార్థాన్నే ఉపయోగించినట్లు అధికారులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే ఈ దాడి తమ పనేనని ఐఎస్ఐఎల్(ఐఎస్ఐఎస్) ప్రకటించుకుంది. ఇరాక్ అధ్యక్షుడు బర్హమ్ సాలి ఈ దాడిని ‘క్రూరమైన నేరం’గా అభివర్ణించాడు. కాగా, ఈ ఏడాదిలో ఈ తరహా దాడి ఇది మూడోది. మరోవైపు సోషల్ మీడియాలో ఈ పేలుడుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. -
సదర్..అదుర్స్
దీపావళి పండుగ సంబరాల్లో భాగంగా నారాయణగూడలో శుక్రవారం రాత్రి నిర్వహించిన సదర్ వేడుకులు అదుర్స్ అన్పించాయి. నిఘనిఘలాడే నలుపుతో ప్రత్యేక అలంకరణతో ఆకర్షణీయంగా నిలిచిన దున్నపోతులు ఠీవీగా నడుస్తుండగా...వాటి ముందు ప్రత్యేక వేషధారణలతో నృత్యాలు చేస్తూ కళాకారులు, యువతీ యువకులు అలరించారు. డప్పు దరువులు, ఆటపాటలు.. దున్నపోతుల విన్యాసాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. బాజాభజంత్రీల నడుమ అందంగా అలంకరించిన దున్నపోతులతో వాటి యజమానులు ర్యాలీగా నారాయణగూడకు చేరుకున్నారు. యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సదర్ సమ్మేళనానికి గ్రేటర్ హైదరాబాద్ నుండే కాకుండా మెదక్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా దున్నపోతులను అలంకరించి తీసుకువచ్చారు. సదర్ వ్యవస్థాపకులు మల్లయ్య యాదవ్ కుటుంబ సభ్యులు రెడ్డి కాలేజ్ రోడ్డులో భారీ స్వాగత వేదికను ఏర్పాటు చేశారు. - కాచిగూడ