breaking news
Rs 18
-
ఎల్ అండ్‌టీ కి భారీ ఆర్డర్లు
ముంబై: దేశీయ నిర్మాణం, ఇంజనీరింగ్ దిగ్గజ సంస్థ లార్సెన్ & టుబ్రో (ఎల్ అండ్ టి) భారీ ఆర్డర్లను సాధించింది. మార్చిలో మొత్తం రూ. 18,549 కోట్ల విలువైన ఆర్డర్లు లభించినట్లు వెల్లడించిన మౌలిక సదుపాయాలు, ఇంజినీరింగ్ దిగ్గజం ఎల్అండ్టీ కౌంటర్ బలపడింది. . ప్రస్తుతం బీఎస్ఈలో 1.6 శాతం పెరిగి,52 వారాల గరిష్ఠానికి చేరువలోఉంది. ఈ నెలలో ఇప్పటివరకూ సెన్సెక్స్ 3 శాతం పుంజుకోగా.. ఎల్అండ్టీ షేరు 8 శాతం పెరగడం విశేషం. కాగా.. ఈ షేరు ఇంతక్రితం 2016 ఆగస్ట్‌లో ఈ స్థాయికి చేరింది. -
ఒక్కరోజు నష్టం రూ. 18వేల కోట్లు
దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు శుక్రవారం చేపట్టిన బంద్ కారణంగా 16 వేల నుంచి 18 వేలకోట్ల రూపాయల వరకు నష్టం ఏర్పడినట్టు అసోచాం అంచనా వేసింది. ఈ రోజు బంద్ కారణంగా బ్యాంకింగ్, ప్రజారవాణా, టెలికాం తదితర సేవలకు అంతరాయం ఏర్పడంతో దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం ఏర్పడినట్టు అసోచాం ప్రతినిధులు వెల్లడించారు. దేశ జీడీపీలో వాణిజ్య, రవాణా, హోటల్స్ ప్రధాన రంగాలని, అలాగే బ్యాంకింగ్ సహా ఆర్థిక రంగ సర్వీసులు కీలకమైనవని, బంద్ కారణంగా నష్టం ఏర్పడినట్టు తెలిపారు. నెలకు కనీస వేతనం రూ. 18 వేలు చేయాలని, నెలకు రూ. 3 వేల కనీస పెన్షన్ వంటి 12 డిమాండ్లతో 10 కేంద్ర కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బంద్ కారణంగా సాధారణ జనజీవనంపై ప్రభావం చూపించింది. ప్రజా రవాణా ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులుపడ్డారు. హరియాణా, జార్ఖండ్, బెంగాల్లో వందలాది కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుని విడిచిపెట్టారు.