breaking news
romero
-
రోమెరో, పోప్ పాల్–6లకు సెయింట్‌హుడ్
వాటికన్ సిటీ: హత్యకు గురైన, ఎల్ సాల్వడార్‌కు చెందిన ఆర్చ్‌బిషప్ ఆస్కార్ అర్నుల్ఫో రోమెరో గాల్డమెజ్‌తోపాటు ఇటలీకి చెందిన పోప్ పాల్–6లకు సెయింట్‌హుడ్‌ను పోప్ ఫ్రాన్సిస్ ప్రదానం చేశారు. రైతుల హక్కుల కోసం పోరాడిన రోమెరో 1980లో చర్చిలోనే హత్యకు గురయ్యారు. పోప్ పాల్–6పై కూడా 1970లో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో హత్యాప్రయత్నం జరిగినా అప్పట్లో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. 1978లో అనారోగ్యంతో మరణించారు. వీరిద్దరికీ సెయింట్‌హుడ్ ఇస్తున్నట్లు ఆదివారం వాటికన్లో ప్రార్థనల కోసం హాజరైన వేలాది మంది భక్తుల ముందు పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు. ‘పాల్–6, రోమెరోలను క్రైస్తవ సన్యాసులుగా మేం ప్రకటిస్తున్నాం. వారిని సన్యాసుల జాబితాలో చేరుస్తూ, చర్చిల్లో వీరిని కూడా ఆరాధించాలని ఆదేశిస్తున్నాం’ అని ఫ్రాన్సిస్ చెప్పారు. ఎముకల కేన్సర్‌తో చనిపోయిన, ఇటీలీకి చెందిన అనాథ బాలుడు, జర్మన్ నన్ సహా మరో ఐదుగురికి కూడా పోప్ ఫ్రాన్సిస్ సెయింట్‌హుడ్ ప్రసాదించారు. హత్యకు గురైన సమయంలో రోమెరో రక్తంతో తడిసిన తాడు ను బెల్ట్‌గా ధరించి పోప్ ఫ్రాన్సిస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్ సాల్వడార్ అధ్య క్షుడు సాంచెజ్ సెరెన్, చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్, స్పెయిన్ రాణి సోఫియాహాజరయ్యారు. సెయింట్‌హుడ్ హోదా ఇలా: సెయింట్‌హుడ్‌ను పొందటమంటే రోమన్ క్యాథలిక్ చర్చిలో అత్యున్నత స్థాయిని పొందటమే. ఒక వ్యక్తిని సెయింట్ (సన్యాసి)గా ప్రకటించేందుకు మొత్తంగా ఐదు దశలుంటాయి. వ్యక్తిని సన్యాసిగా ప్రకటించేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించేందుకు ముందుగా ఆ వ్యక్తి చనిపోయిననాటి నుంచి కనీసం ఐదేళ్లు ఆగాలి. ఆ తర్వాత సదరు వ్యక్తి చనిపోయిన ప్రాంతంలోని క్రైస్తవ మతగురువులు విచారణ జరిపి, ఆ వ్యక్తి పవిత్రత, సత్యనిష్టతల గురించి వివరాలు సేకరిస్తారు. సెయింట్ హోదా ఇవ్వదగిన వ్యక్తిగా తేలితే ఆ విషయాన్ని వారు సెయింట్లను సిఫారసు చేసే ఓ కమిటీకి తెలుపుతారు. ఆ తర్వాత సదరు చనిపోయిన వ్యక్తికి అద్భుత శక్తులున్నట్లు తేలాలి. అంటే ఆ వ్యక్తి తమ కలలో కనిపించాడనీ, తమ అనారోగ్యాన్ని బాగు చేయడమో, కష్టాలను తీర్చాడనో ఎవరో ఒకరు చెప్పాలి. వాటిలోని వాస్తవాలను పరీక్షించిన అనంతరం అదొక అద్భుత మని రుజువైతే వారిని బీటిఫై చేస్తారు. ఆ తర్వాత మరోసారి అలాంటి అద్భుతం జరిగి నట్లు తేలితే వారికి సెయింట్ హోదా ఇస్తారు. పోప్‌పాల్–6, రొమెరో -
పిల్లా ... నా బావనిస్తనే....
"నాకిష్టమైన టీమ్ గెలిస్తే నగ్నంగా ఊరేగుతా," "ఉగ్రవాదుల చెరనుంచి బాలికల్ని విడిపించేందుకు నన్ను నేను సమర్పించుకుంటా" వంటి బంపర్ ఆఫర్ల జాబితాలో ఇంకొకటి వచ్చి చేరింది. అర్జెంటీనా ప్రపంచకప్ గెలుచుకుంటే నా భర్తను వారం రోజుల పాటు పాప్ సింగర్ కి అరువు ఇస్తానని ఆఫర్ ఇచ్చింది అర్జెంటీనా గోల్ కీపర్ సెర్జియో రోమెరో భార్య ఎలియానా గుయెర్సియో. ఈ మేరకు ఆమె ఒక ట్వీట్ కూడా చేసింది. అసలు కథేమిటంటే సెమీఫైనల్ లో నెదర్లాండ్స్ ఆటగాళ్ల గోల్స్‌ను గోల్ కీపర్ రొమెరో సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ఆ ఆట చూసిన పాప్ సింగర్ మనసు పారేసుకుని మెచ్చుకుంది. దాంతో అర్జెంటీనా గెలిస్తే నా భర్తను వారం పాటు అప్పిస్తానని ఎలియానా వాగ్దానం చేసేసింది. ఆదివారం ఫైనల్ మ్యాచ్ గెలిస్తే ఎలియానా వాగ్దానం నిలబెట్టుకుంటుందా లేక "అమ్మో నా బావనిస్తనా" అనేస్తుందో చూడాలి.