breaking news
roll over RTC bus
-
టీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి
సాక్షి, కృష్ణా: జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మల్ నుంచి ఒంగోలు వెళ్తున్న టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మద్యం మత్తులో డ్రైవర్..పోలీస్ బస్సు బోల్తా
తల్లాడ: మండల పరిదిలోని లక్ష్మీనగర్ సమీపంలో సోమవారం పోలీస్ మినీ బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో ఐదుగురు పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి. ఖమ్మం నుంచి కొత్తగూడెం వెళ్తున్న మినీబస్సు అతి వేగంగా ప్రయాణిస్తుండగా డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీ కొట్టి, బోల్తా పడింది. ఎదురుగా లోయలో పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీస్ ఏఓ సీహెచ్.వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ సువర్ణబాబు, జూనియర్ అసిస్టెంట్లు పి.రాములు, ఎస్కె.అబ్బాస్, ఎండీ.ఫయాజ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలాన్ని వైరా ఏసీపీ ప్రసన్నకుమార్, సీఐ మల్లయ్య స్వామి సందర్శించారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. క్రేన్ సహాయంతో మినీ బస్సును రోడ్డు మీద నుంచి పక్కకు తీశారు. డ్రైవర్ ఎం.జ్ఞాన సుందర్ రావు మద్యం మత్తులో ఉన్నాడని డ్రంక్ అండ్ డ్రైవ్‌లో తేలినట్లు ఎస్సై మేడా ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు తల్లాడ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన వైరా ఏసీపీ ప్రసన్నకుమార్ -
వరద ఉధృతితో వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు
నల్లబెల్లి(వరంగల్): వరద ఉధృతితో ఆర్టీసీ బస్సు బోల్తాపడిన పడిన ఘటన నల్లబెల్లి శివారులో గురువారం చోటుచేసుకుంది. ప్రయాణికుల కథనం ప్రకారం.. ములుగు నుంచి నర్సంపేకు 30 మందితో నర్సంపేట డిపోకు చెందిన బస్సు సాయంత్రం బయలుదేరింది. నల్లబెల్లి మధ్యలవాగు వద్దకు చేరుకొగానే అప్పటికే కురిసిన భారీ వర్షంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. డ్రైవర్ అంకూస్ బస్సును వాగుదాటేంచే ప్రయత్నం చేస్తుండగా గుంతలోకి వెళ్లి అదుపుతప్పి పడిపోయింది. ప్రయాణికులు హాహాకారాలు చేయడంతో వాగు సమీపంలో ఉన్న వారు అక్కడికి చేరుకొని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో శనిగరం గ్రామానికి చెందిన కక్కెర్ల శ్రీధర్‌కు కాలుకు తీవ్రంగా, మరికొందరు ప్రయాణికులకు భుజం, తల, కాళ్లకు గాయాలయ్యాయి. ఎస్సై మేరుగు రాజమౌళి ఘటన స్థలాన్ని పరిశీలించారు. తీవ్రగాయాలైన శ్రీధర్‌ను 108లో నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కాజ్‌వేపై వెళ్లుతున్న బస్సు గుంతలో పడిన విషయాన్ని గమనించిన డ్రైవర్ అంకూస్ బ్రేకులు వేస్తూ అదుపు చేసేందుకు ప్రయత్నించినట్లు ప్రయాణికులు తెలిపారు. గుంతలమయమైన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పలువురు మండిపడ్డారు. కాగా సంఘటన స్థలాన్ని ఆర్టీసీ నర్సంపేట డీఎం మధుసూదన్, సీఐ శ్రీకాంత్, ఎంపీపీ బానోత్ సారంగపాణి తదితరులు పరిశీలించారు. గాయపడిన శ్రీధర్‌కు తమ సంస్థ మెరుగైన వైద్యసేవలు, ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకొంటామని డీఎం మధుసూదన్ తెలిపారు. సహాయక చర్యల్లో మూడుచెక్కలపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పలుకాల తిరుపతిరెడ్డి, బత్తిని రమేష్, రాజుకుమార్, మర్రి రాజు, ఎండీ షబ్సీర్, పెద్దబోయిన బిక్షపతి, పిండి హరీష్, మేకల ప్రశాంత్, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్, నల్లబెల్లి ఎంపీటీసీ సభ్యుడు నానెబోయిన రాజారాం, తౌటురెడ్డి రాజిరెడ్డి, మామిండ్ల రాజిరెడ్డి పాల్గొన్నారు.