breaking news
river rafting
-
బ్రహ్మపుత్ర మెచ్చిన సాహస పుత్రిక
సాహసం సైలెంట్‌గా ఉండదు. కంచుకంఠంతో మనలోని ఆత్మవిశ్వాసాన్ని తట్టి లేపుతుంది. ఆ పిలుపును కాలేజీ రోజుల్లోనే అందుకుంది శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి చెందిన వాసుపల్లి కవిత. సాహసంతో చెలిమి చేసిన కవిత బ్రహ్మపుత్రలో రివర్ రాఫ్టింగ్ విజయవంతంగా పూర్తి చేసిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఆర్మీ వైద్యాధికారి అయిన కవిత అరుణాచల్‌ప్రదేశ్‌లో అత్యంత ఎత్తయిన గోరీచెన్ పర్వతాన్ని ఐదుసార్లు అధిరోహించింది. మరెన్నో సాహసయాత్రలకు సిద్ధం అవుతోంది.ఉద్దానం ప్రాంతమైన వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామంలోని సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాసుపల్లి కవితకు చిన్నప్పటి నుంచి క్రీడలు, స్విమ్మింగ్ అంటే ఇష్టం. చదువులోనూ ముందుండేది. కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు సాధించింది. శ్రీకాకుళంలోని రిమ్స్ వైద్య కళాశాలలో సమయంలో ట్రెక్కింగ్ చేసేది.సైన్యంలోకి....సైన్యంలో పనిచేయాలనే ఆసక్తి కవితలో ఉండేది. 2021లో ఆర్మీ వైద్యాధికారిగా కెప్టెన్ హోదాలో ΄ోస్టింగ్ పొందిన కవిత మేజర్ స్థాయికి చేరింది. అరుణాచల్ ప్రదేశ్‌లో పనిచేస్తున్నప్పుడు సాహస క్రీడలపై ఇష్టంతో ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్’లో చేరి పర్వతారోహణకు సంబంధించి రెండు కోర్సులు, రివర్ రాఫ్టింగ్‌లో ఒక ప్రత్యేక కోర్సు చేసింది.ప్రాణదాతపర్వతారోహణలో శిక్షణ తీసుకున్న కవిత అరుణాచల్‌ప్రదేశ్‌లో అత్యంత ఎత్తయిన గోరీచెన్ పర్వతాన్ని ఐదుసార్లు అధిరోహించింది. కల్నల్ రణవీర్‌సింగ్ జమ్నాల ఆధ్వర్యంలో గోరీచెన్ అధిరోహించి కిందికి వస్తున్న సమయంలో బృందంలోని ఒక యువ సభ్యురాలు ఊపిరి అందక ప్రమాదంలో పడింది. కవిత ఆమెకు తక్షణ వైద్యం అందించి ప్రాణపాయం నుంచి తప్పించింది.బ్రహ్మపుత్రలో సాహస యాత్రఅత్యంత క్లిష్టమైన బ్రహ్మపుత్ర నదిలో 1040 కిలోమీటర్ల మేరకు విజయవంతంగా రివర్ రాఫ్టింగ్ పూర్తి చేసింది కవిత. కల్నల్ రణవీర్‌సింగ్ నేతృత్వంలోని పన్నెండు మంది సభ్యుల బృందంలో ఆమె ఏకైక మహిళ. బ్రహ్మపుత్రలో రివర్ రాఫ్టింగ్ విజయవంతంగా పూర్తి చేసిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. భారత–టిబెట్ సరిహద్దులోని గెల్లింగ్ గ్రామం నుంచి బ్రహ్మపుత్రలో ప్రయాణం ప్రారంభించి, ఏకధాటిగా 28 రోజులపాటు రివర్ రాఫ్టింగ్ చేశారు. ఇండో–బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న హాట్సింగిమారి దగ్గర తమ సాహసయాత్ర ముగించారు.ప్రాణం మీదికి వచ్చినా సరే...బ్రహ్మపుత్రలో రాఫ్టింగ్ సజావుగా ఏమీ సాగలేదు. ప్రాణం మీదికి తెచ్చిన ప్రమాదాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. నది ΄÷డవునా ప్రవాహ తీవ్రత, 11 అడుగుల ఎత్తులో ఎగిసిపడే అలల ఉధృతి కారణంగా ఏర్పడిన సుడిగుండంలో చిక్కుకుని బృందం ప్రమాదంలో పడింది. కాస్త ఓపిక పడితే ప్రమాదం నుంచి బయటపడొచ్చు అనుకున్నారు. ధైర్యం కోల్పోలేదు. పెద్ద అల నుంచి తప్పించుకుని, ఈదుకుంటూ రాఫ్ట్‌ను చేరుకున్నారు. ఇలా నాలుగుసార్లు రాఫ్ట్ నుంచి పడి΄ోయినా ముందుకే సాగారు. యాత్రలో రోజుకు 12 గంటలపాటు 70 కిలోమీటర్ల మేరకు ప్రయాణించి రాత్రివేళల్లో విశ్రాంతి తీసుకునేవారు.వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో... సైన్యంలో చేసిన సేవలకు గుర్తింపుగా ‘చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్’ అవార్డు అందుకుంది కవిత. గోరీచెన్ పర్వతారోహణ సందర్భంగా తోటి పర్వతారోహకురాలికి చికిత్స చేసినందుకు రాష్ట్రపతి విశిష్ట సేవా మెడల్‌కు ఎంపికైంది. బ్రహ్మపుత్రలో రివర్ రాఫ్టింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సాధించింది.– కందుల శివశంకర్, సాక్షి, శ్రీకాకుళం -
కల్లోల నదిలో కిక్కే కిక్కు
⇒ గంగానదిలో తప్ప మరెక్కడా లేదు ⇒ కాళీ నదిలో రివర్ ర్యాఫ్టింగ్ సందడి ⇒ వర్షాలతో మొదలైన సీజన్ ⇒ దండేలి అభయారణ్యంలో జల హోరు బెంగళూరు: జర్రున దూసుకుపోయే నది ప్రవాహంతో సమానంగా పోటీపడుతూ పడవలో దూసుకెళ్లడం, రాళ్లు, గుట్టలు, కొండల నడుమ నుంచి మెరుపు వేగంతో కదులుతూ నదీ జలాల్లో సయ్యాటలాడడం మంచి థ్రిల్లింగ్ అనుభూతి. ఇలాంటి కిక్‌నిచ్చే సవాళ్లు కావాలంటే నదిలో ర్యాఫ్టింగ్ చేయాల్సిందే. అది కూడా కాళీ నదిలో అయితే మరీ బాగుంటుంది. ఉత్తర కన్నడ జిల్లాలోని దండేలి అభయారణ్యం పర్యాటకులకు స్వర్గధామం. దేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి సందర్శకులు వస్తుంటారు. పచ్చని అడవుల అందాలు, లోయల సౌందర్యం, అరుదైన పశుపక్ష్యాదులను చూసి ఆనందిస్తుంటారు. దీంతో పాటు దేశంలో గంగానదిలో తప్ప మరెక్కడా కనిపించని వైట్ వాటర్ ర్యాఫ్టింగ్ దండేలి అడవుల గుండా ప్రవహించే కాళీ నదిలో మాత్రమే లభ్యం. ఏమిటీ రివర్ ర్యాఫ్టింగ్ ఇక్కడ అడవుల్లో పుట్టి అరేబియా సముద్రంలో కలిసే కాళీ నది జూన్ నుంచి ఉధృతంగా ప్రవాహాన్ని అందుకుంటుంది. ఇక నదీజలాల్లో ర్యాఫ్టింగ్ చేయాలనుకునే ఔత్సాహికులు కూడా ఇక్కడికి పయనమవుతారు. ఇక్కడ ఉన్న పలు క్లబ్‌లు, రిసార్ట్లు ర్యాఫ్టింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ప్లాస్టిక్, రబ్బర్ బోట్లలో 10–15 మంది కూర్చుని పొంగిపొర్లే నదీజలాల్లో ప్రయాణించడం ఒక వింత అనుభూతి. గజ ఈతగాళ్లు, నిపుణులు పడవను నురగలు కక్కే నదీజలాల్లో కొండలను, బండలను తప్పించుకుంటూ దూకుతూ బోట్‌ను తీసుకెళ్తుంటే సందర్శకుల గుండెలు ఉద్విగ్నతతో లయ తప్పుతాయి. కొందరు ర్యాఫ్టింగ్ ప్రి యులు తామే పడవలను తీ సుకుని సొంతంగా నదిలో విహా రానికి బయల్దేరతారు. ఇది కొన్ని గంటలు ఉండవచ్చు, కొ న్ని రోజులు కావచ్చు. మధ్యలో మజిలీలు వేస్తూ టెంట్లలో కాలం గడుపుతూ సిటీ లైఫ్ ఒత్తిళ్ల నుంచి దూరంగా సేదదీరుతారు. వర్షాలు ఆరంభం కావడంతో కాళీ నదిలో కూడా ర్యాఫ్టింగ్ సందడి మొదలైంది. ఎలా వెళ్లాలి? బెంగళూరు నుంచి 480 కిలోమీటర్ల దూరం. దండేలికి బెంగళూరు, బళ్లారి, హుబ్లి–ధార్వాడ, మైసూరు, బెళగావి తదితర నగరాల నుంచి బస్సు సర్వీసులున్నాయి. రైల్లో అయితే లోండాకు వెళ్లి అక్కడి నుంచి గంటన్నర బస్సు ప్రయాణంతో దండేలిలో దిగవచ్చు. ఎక్కడ ఉండాలి? దండేలిలో ఆర్థిక స్థాయిని బట్టి బస చేయడానికి తగిన రిసార్ట్లు, హోటళ్లు లభ్యం. కొంచెం ఖర్చు పెట్టగలిగితే ఆధునిక సౌకర్యాలు, ఆతిథ్యంతో కూడిన బస దొరుకుతుంది. బడ్జెట్ హోటళ్లూ ఉన్నాయి. ఇక సాహసాలు చేయాలనుకుంటే జంగిల్ సఫారీ, రివర్ ర్యాఫ్టింగ్ చేయవచ్చు. ఇవే కాకుండా ఈ దట్టమైన అరణ్యంలో ఊరికే అలా గడిపినా ఎంతో హాయిగా ఉంటుందంటారు సందర్శకులు. ఇంకా చుట్టుపక్కల సింధేరి కొండలు, ఉలవి శ్రీక్షేత్రం ఆలయం, అంబికా నగర, కావాల గుహలను సైతం తిలకించవచ్చు.