ఫిబ్రవరి 10 నుంచి రెవెన్యూ క్రీడలు
అనంతపురం అగ్రికల్చర్ : వచ్చే నెల 10 నుంచి 12 వరకు అనంతపురం రెవెన్యూ క్రీడలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం నాయకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం, కళ్యాణదుర్గం, కదిరి, ధర్మవరం, పెనుకొండ, కలెక్టరేట్ జట్ల మధ్య ఈ నెల 29న స్థానిక ఆర్డీటీ స్టేడియంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తుండగా, ఫిబ్రవరి 5న ఫైనల్ పోటీ ఉంటుందన్నారు.
అదే నెల 10, 11, 12 తేదీల్లో పురుషుల విభాగంలో వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, టెన్నీకాయిట్, క్యారమ్స్, క్రికెట్, కబడ్డీ, టగ్ ఆఫ్ వార్, చెస్‌తో పాటు 100 మీటర్లు పరుగు, లాంగ్‌జంప్, డిస్క్‌త్రో, షాట్‌పుట్, జావెలిన్‌త్రో, నడక పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. మహిళల విభాగంలో షటిల్ బ్యాడ్మింటన్, టెన్నీకాయిట్, త్రోబాల్, చెస్, క్యారమ్స్, మ్యాజికల్ ఛైర్స్, 100 మీటర్లు పరుగు, షాట్‌పుట్, జావెలిన్‌త్రో, నడక పోటీలు ఉంటాయని తెలతిపారు. సాంస్కృతిక పోటీలు ఉంటాయన్నారు.