breaking news
reupublic day celebrations
-
గణతంత్రంపై కరోనా ఎఫెక్ట్.. సంబరాలు రద్దు
చెన్నై: మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం ప్రపంచంపై ఇంకా తొలగలేదు. కేసుల నమోదు కొనసాగుతుండడంతో ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు మొదలైనా నిబంధనలు... తగు జాగ్రత్తలతో ప్రజలు తమ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వస్తున్న గణతంత్ర వేడుకలపై కరోనా ప్రభావం పడింది. సంబరంగా కాకుండా నామమాత్రంగా వేడుకలు నిర్వహించాలని పలు రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్లో కాకుండా నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్లో సాదాసీదాగా గణతంత్ర వేడుకలు నిర్వహించాలనే యోచనలో ఉంది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఇదే నిర్ణయం తీసుకుంది. అట్టహాసంగా వేడుకలు వద్దని.. ర్యాలీలు నిషేధమని ప్రకటించింది. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొంటే కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని వేడుకలపై ఆంక్షలు విధించింది. సాంస్కృతిక కార్యక్రమాలు లేకుండానే జెండా వందనం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ వేడుకలకు విద్యార్థులను దూరంగా ఉంచాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక స్వాతంత్ర్య సమరయోధులను వారి ఇళ్లకే వెళ్లి సన్మానించాలని తెలిపింది. విద్యార్థులు, వయోధికులు, ప్రజలు వేడుకల్లో పాల్గొనకుండా టీవీ, రేడియో, సోషల్ మీడియాలో గణతంత్ర వేడుకలు వీక్షించాలని తమిళనాడు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఆ సంఘటన దురదృష్టకరం : ఉత్తమ్
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం రోజు జగిత్యాలలో జరిగిన సంఘటన దురదృష్టకరమని.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సెక్యులర్ దేశంలో మతశక్తులను ప్రోత్సహించడం సరికాదన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవం రోజు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు జెండాలతో సహా పాల్గొనడం దీనికి జిల్లా కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించడం విస్మయానికి గురిచేసిందన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో అర్థం కావడం లేదన్నారు. దీనికి కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి లేఖ రాశామన్నారు. గణతంత్ర దినోత్సవం రోజు ఓ కలెక్టర్ ప్రభుత్వాన్ని పొగుడుతూ మాట్లాడడం.. మరో కలెక్టర్ ఎంపీ కవిత కాళ్ల దగ్గర కూర్చోవడం సిగ్గుచేట్టన్నారు.